తెలుగులో సాంకేతిక పరిభాష

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ప్రభుత్వ పాఠ్యపుస్తకాలలో, ఇతర ప్రమాణిక పుస్తకాలలో తెలుగులో వాడిన సాంకేతిక పదజాలాన్ని ఒక్క త్రాటి పైకి తెచ్చే ప్రయత్నం.

  1. స్థాన విలువ= Place value
  2. ఆరోహణ క్రమం= Descending order
  3. అవరోహణ క్రమం= Ascending order
  4. తూగుడుబల్ల= see-saw
  5. గాలిబుగ్గ= Balloon
  6. ఎక్కం/గుణకార పట్టిక= Multiplication table
  7. భాగాహారం= Division
  8. అంకె= digit
  9. సంకలనం/కూడిక= Addition
  10. వ్యవకలనం/తీసివేత= Subtraction
  11. గుణకారం= Multiplication
  12. భిన్నం= Fraction
  13. లవం= Numerator
  14. హారం= Denominator
  15. క్రమభిన్నం= Proper fraction
  16. అపక్రమ భిన్నం= Improper fraction
  17. మిశ్రమ భిన్నం= Mixed fraction
  18. సజాతి భిన్నాలు= Like fractions
  19. విజాతి భిన్నాలు= Unlike fractions
  20. సమభిన్నాలు= Equivalent fraction
  21. కనిష్ఠ భిన్నం= Simplified fraction
  22. విభాగిని= Divider
  23. పరిధి/చుట్టుకొలత= Perimeter
  24. దీర్ఘచతురస్రం= Rectangle
  25. పొడవు= length
  26. వెడల్పు= breadth/Width
  27. చతురస్రం= square
  28. వైశాల్యం= Area
  29. సంఖ్య= Number/Numeral
  30. కొలత= Measurement & Unit
  31. జాన= Handspan
  32. బెత్తె= Fingerspan
  33. మూర= Cubit
  34. అంగ= Pace
  35. అడుగు= Foot
  36. పరిమాణం= Capacity
  37. అమరిక= Pattern
  38. సహజ విలువ/వాస్తవ విలువ= Place value
  39. సవరణ= Round off
  40. ద్విమితి(తీయ)= 2 Dimesnsion(al)
  41. త్రిమితి(తీయ)= 3 Dimesnsion(al)
  42. గుణ్యం= Multiplicand
  43. గుణకం= Multiplier
  44. లబ్దం= Product
  45. విభాజ్యం= Dividend
  46. భాజకం= Divisor
  47. భాగఫలం= Quotient
  48. శేషం= Remainder
  49. సరిసంఖ్య= Even number
  50. బేసి సంఖ్య= Odd number
  51. అంచు= Edge
  52. మూల/శీర్షం= Corner/Vertex
  53. సౌష్టవం= Symmetry
  54. తూనికరాయి= Weighing stone
  55. కొలపాత్ర= Measuring Jar
  56. పూసల చట్రం= Abacus
  57. నిలువు వరుస= Column
  58. దత్తాంశం= Data
    1. దత్తాంశ నిర్వహణ= Data Handling
  59. బిందువు= Point
  60. విస్తృతి/పరిధి/వ్యాప్తి= Range
  61. ద్విముఖ సంఖ్య= Palindrome number
  62. వియోగం= Minuend
  63. వియోగకం= Subtrahend
  64. భేదం= Difference
  65. స్థిరాంకం= Constant
  66. దత్తాత్రేయ రామచంద్ర కాప్రేకర్= D.R Kaprekar
  67. కొన్నవెల= Cost price
  68. అమ్మినవెల= Selling price
  69. లాభం= Profit
  70. నష్టం= Loss
  71. గుణిజం= Multiple
  72. DMAS నియమం= DMAS rule
  73. జ్యామితి= Geometry
  74. తలం= Face
  75. శంకాకారం= Cone
  76. స్థూపాకారం= Cylinder
  77. కర్ణం= Diagonal/Hypotenuse
  78. వృత్తం= Circle
  79. వృత్త వ్యాసార్ధం= Radius of a circle
  80. వృత్త కేంద్రం= Centre of the circle
  81. పరిధి= Circumference
  82. గణన చిహ్నం= Tally mark
  83. పట చిహ్నం= Pictograph
  84. కమ్మీ రేఖాచిత్రం= Bar graph
    1. రెండు వరుసల కమ్మీ రేఖాచిత్రం= Double Bar graph
  85. ఏకాంక భిన్నం= Unit fraction
  86. కొలబద్ద= Measuring scale
  87. పూర్ణ సంఖ్య= Integer
  88. పూర్ణాంకం= Whole number
  89. ధర్మం= Property
  90. సంవృత ధర్మం= Closure property
    1. సంకలన సంవృత ధర్మం= Closure under addition property
    2. వ్యవకలన సంవృత ధర్మం= Closure under subtraction property
    3. గుణకార సంవృత ధర్మం= Closure under multiplication property
  91. స్థిత్యంతర (వినిమయ) ధర్మం= Commutative property
    1. గుణకారవినిమయ (స్థిత్యంతర) ధర్మం= Commutativity of multiplication
  92. సహచర ధర్మం= Associative property
  93. సంకలన తత్సమాంశం= Additive identity
  94. ధనపూర్ణ సంఖ్య= Positive integer
  95. ఋణపూర్ణ సంఖ్య= Negative integer
  96. తత్సమాంశం = Identity
    1. సంకలన తత్సమాంశం= Additive identity
    2. గుణకార తత్సమాంశం= Multiplicative identity
  97. విభాగ ధర్మం/న్యాయం= Distributive property
  98. దశాంశం= Decimal
  99. వ్యుత్క్రమం= Reciprocal
  100. ప్రాతినిధ్య విలువలు= Representative Values
  101. పరిశీలనాంశం= Observation
  102. సరాసరి= Average
  103. సగటు= Mean
  104. అంకగణితం= Arithmetics
  105. బహుళకం= Mode
  106. మధ్యగతం= Median
  107. సమీకరణ= Equation
    1. సామాన్య సమీకరణ= Simple Equation
  108. చరరాశి= Variable
  109. విలువ= Value
  110. సమాసం= Expression
  111. సమానత్వపు గుర్తు= Equality sign—"="
  112. LHS/RHS= దీన్ని పాఠ్యపుస్తకాలు ఆంగ్లంలోనే వ్రాస్తున్నాయి
  113. పరిక్రియ= Operation
  114. పక్షాంతరం= Transposition
  115. రేఖ= Line
  116. కోణం= Angle
  117. రేఖా ఖండం= Line segment
  118. బిందువు= Point
  119. కిరణం= Ray
  120. పూరక కోణాలు= Complementary angles
  121. సంపూరక కోణాలు= Supplementary angles
  122. ఖండన రేఖలు= Intersecting lines
  123. ఖండన బిందువు= Point of intersection
  124. తిర్యగ్రేఖ= Transversal
  125. అంతర కోణం= Interior angle
  126. బాహ్య కోణం= Exterior angle
  127. సదృశ కోణం= Corresponding angle
  128. ఏకాంతర కోణాలు= Alternate interior angles
  129. ఏక బాహ్య కోణాలు= Alternate exterior angles
  130. ఉన్నతి= Altitude
  131. సమబాహు త్రిభుజం= Equilateral triangle
  132. సమద్విబాహు త్రిభుజం= Isosceles triangle
  133. లంబ కోణ త్రిభుజం= Right angled triangle
  134. రాశి= Quantity
  135. అసలు= Principal
  136. వడ్డీ= Interest
    1. బారువడ్డీ= Simple interest
    2. చక్రవడ్డీ=