Jump to content

తానా

వికీపీడియా నుండి
(తెలుగు అసోసియేషన్ అఫ్ నార్త్ అమెరికా నుండి దారిమార్పు చెందింది)
హిల్లరీ క్లింటన్ తో తానా వ్యవస్థాపక అధ్యక్షుడు దుర్వాసుల శాస్త్రి

తానా లేదా ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA లేదా Telugu Association of North America) అనేది ఉత్తర అమెరికాలో నివసిస్తున్న తెలుగు ప్రజల సంఘం. తెలుగు సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడానికి, పరివ్యాప్తం చేయడానికి, తెలుగు ప్రజల, వారి సంతతి యొక్క గుర్తింపుని కాపాడడానికి, తెలుగు సాహిత్య, సాంస్కృతిక, విద్యా, సాంఘిక, సేవా చర్చలకు ఓ వేదికగా నిలవడానికి ఈ సంఘం ఏర్పాటైంది.

తానా మొదటి జాతీయ సమావేశం 1977 లో జరిగింది. లాభాపేక్షలేని సంస్థగా 1978లో అధికారికంగా ఏర్పాటైంది.[1] ముప్పైవేలకు పైగా సభ్యులుకల తానా అతి పెద్ద ఇండో-అమెరికా సంఘాల్లో ఒకటి.

కార్యకలాపాలు

[మార్చు]

సేవాకార్యక్రమాలు

[మార్చు]

సాంస్కృతిక, సాహిత్య కార్యక్రమాలు

[మార్చు]

సన్మానాలు సత్కారాలు

[మార్చు]

ఈ సంస్థ ఉత్తర అమెరికాలో ఉన్న తెలుగు ప్రజలలో వివిధరంగాలలో రాణిస్తున్నవారిని గుర్తించి వారిని పురస్కారాలతో సత్కరిస్తున్నది.

  • 2003లో న్యాయ రంగంలో విశేష ప్రతిభను కనబరచిన ఆశారెడ్డిని విశిష్ట ప్రతిభా పురస్కారంతో సత్కరించింది.

తానా అధ్యక్షులు

[మార్చు]
  • కోమటి జయరాం .జన్మస్థలం కృష్ణాజిల్లా మైలవరం దగ్గరి వెల్వడం.నాన్న భాస్కరరావు మైలవరం సమితి ప్రెసిడెంట్‌గా 17ఏళ్లు పనిచేశారు. 1989 నుంచి 1994దాకా ఎమ్మెల్యేగా కూడా చేశారు.అమ్మ పేరు కమలమ్మ. నలుగురు సంతానంలో పెద్దవాడు.పదవ తరగతి దాకా మైలవరంలో.విజయవాడ లయోలా కాలేజీలో . సి.ఇ.సి..భోపాల్ పక్కనే ఉన్న విదీశ పట్టణంలోని ఎస్.ఎస్.ఎల్.జైన్ కాలేజీలో ఎం.కామ్‌. కాలిఫోర్నియాలోని ఆర్మ్ర్‌స్టాంగ్ యూనివర్శిటీలో ఎంబిఎ.స్వాగత్ ఇండియన్ క్యూజిన్' పేరిట అమెరికాలో మొత్తం తొమ్మిది చైన్ రెస్టారెంట్లు ఉన్నాయి. అమెరికాలో తానా ఆటా కార్యక్రమాలకు భోజనాలను ఏర్పాటు చేసేవాడు.గత ఐదేళ్ల నుంచి 'తెలుగు టైమ్స్' అనే పక్ష పత్రికను కూడా ప్రచురిస్తున్నాడు.

మూలాలు

[మార్చు]
  1. "తానా గురించి". Archived from the original on 2008-01-04. Retrieved 2007-12-27.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=తానా&oldid=3265930" నుండి వెలికితీశారు