చర్చ:తానా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వ్యాసం పేరు[మార్చు]

వ్యాసం పేరు ఉత్తర అమెరికా తెలుగు సంఘం అని మారిస్తే బాగుంటుందని నా అభిప్రాయం.Rajasekhar1961 11:44, 6 సెప్టెంబర్ 2008 (UTC)

పేర్ల గురించి చర్చ జరుగుతున్నందున కొంత ఆగండి. ప్రస్తుతానికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం నుండి తానాకు దారిమార్పు ఉంది గనుక పరవాలేదు. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 14:39, 6 సెప్టెంబర్ 2008 (UTC)
ప్రసిద్ధి చెందిన పేరు "తానా" కనుక వ్యాసం అసలు పేరు తానాగానే ఉండాలి. వార్తాపత్రికలలో, మేగజైన్లలో తానా పేరుతోనే వ్యవహరిస్తారు (బ్రాకెట్లలో ఉ..అ..తె..సం.. అని ఇస్తారనుకోండి). కాబట్టి మనం కూడా దాన్నే అనుసరించాలి. పూర్తి పేరుతో ప్రసిద్ధమయితే తప్ప ప్రతీ దానికీ పూర్తి పేరు అని పట్టుపడితే బాగుండదు. అందురు నడిచే బాటను వదిలి కొత్త బాట పట్టడం వికీ విధానం కాదు. అయినా నాకో సందేహం కొందరు సభ్యులు నేను సృష్టించిన వ్యాసపు పేర్లను ఏకపక్షంగా (అవసరం లేకున్ననూ) మార్చివేసి ఇతర పేర్లవరకు వచ్చే సరికి చర్చ అంటున్నారుఏందుకో!!! -- C.Chandra Kanth Rao(చర్చ) 15:33, 6 సెప్టెంబర్ 2008 (UTC)
చంద్రకాంత్ గారూ! "తానా" గానే ఉంచుదాం. రెండు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి గనుక చర్చ అనివార్యం. వారి హక్కు కూడాను. ఇంతకు ముందు మీరు మొదలు పెట్టిన వ్యాసాల పేర్లు మళ్ళించేటప్పుడు సభ్యులు వాటిని ఎవరు సృష్టించారో చూడలేదనుకొంటాను. మనకు ఈ విషయంలో స్పష్టమైన నిర్దేశకాలు లేవు గనుక తాము "సరయిన పేరు"కు మారుస్తున్నామనుకొన్నారు. అవగాహనలో ఉన్న భేదాలవల్లనే ఇలా జరిగిందని అనిపిస్తున్నది. దయచేసి సీరియస్‌గా తీసుకోవద్దు. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 16:16, 6 సెప్టెంబర్ 2008 (UTC)

తాత్కాలిక సూచన[మార్చు]

విధానాలు రూపొందేలోపు తాత్కాలికంగా నేను చేసే సూచన - పేరు మార్పు గురించి నిర్దిష్టమైన, ఉమ్మడి అభిప్రాయం లేనపుడు వ్యాసాన్ని మొదలు పెట్టిన పేరు కొనసాగించడం మంచిది. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 16:16, 6 సెప్టెంబర్ 2008 (UTC)

కాసుబాబు గారు, వ్యాసాన్ని మొదలు పెట్టిన పేరు అని అంటున్నారు కాని కొందరు సభ్యులు ప్రతీ దానికీ పేద్ద పేర్లు పెట్టి వ్యాసం ప్రారంభించి గందరగోళానికి దారితీస్తున్నారు. ఆ పేర్లు చదవడానికే ఎబ్బెటుగా ఉంటున్నాయి. పేరు పెద్దదైనా వ్యాసంలో సమాచారం మాత్రం నామమాత్రమే. చిన్న వ్యాసాలు, ఇంటిపేర్ల వ్యాసాలు వద్దని ఇదివరకే చర్చ జరిగింది. అయిననూ ఇంకా ఇంకా చిన్న చిన్న పేజీలు, అవసరం లేని ఇంటిపేర్ల వ్యాసాలు పుడుతున్నాయి. -- C.Chandra Kanth Rao(చర్చ) 16:39, 6 సెప్టెంబర్ 2008 (UTC)
"https://te.wikipedia.org/w/index.php?title=చర్చ:తానా&oldid=3265931" నుండి వెలికితీశారు