తెలుగు బాట

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తెలుగు భాషపై కీర్తిని వెలిగించడానికి, స్ఫూర్తిని కలిగించడానికి, ప్రపంచంలో తెలుగు వారు ఎక్కడ ఉన్నా తెలుగును ప్రోత్సహించడానికి e-తెలుగు[1] తెలుగు బాటకు శ్రీకారం చుట్టింది. దస్త్రం:తెలుగుబాట.jpg కంప్యూటర్లు, జాలంలో తెలుగుని పెంపొదించడానికి కృషి చేస్తున్న e-తెలుగు, బయటి ప్రపంచంలో (ప్రభుత్వ, ప్రయివేటు వ్యవహారాలలో) కూడా తెలుగు వాడకం పెరగాలని ఆశిస్తూ ఈ తెలుగు బాట కార్యక్రమంలో భాగంగా తెలుగు కై నడక చేపట్టింది. తెలుగు వాడకాన్ని ప్రోత్సహించడానికి, గుర్తు చేయడానికి తెలుగు భాషా దినోత్సవం (ఆగస్టు 29) సరైన సందర్భం! 2010 లో మొదటి సారి తెలుగుబాట నిర్వహించడం జరిగింది. అప్పుడు మొదలు ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని e-తెలుగు వారు నిర్వహిస్తున్నారు.

మొదటి తెలుగుబాట

[మార్చు]

మొదటి తెలుగుబాట 2010 లో ఆగస్టు 29న గిడుగు రామమూర్తి గారి పుట్టిన రోజు సందర్భంగా తెలుగు భాషా దినోత్సవం రోజున నిర్వహించారు. తెలుగు తల్లి విగ్రహం, ట్యాంక్ బండ్ నుండి జ్ఞానభూమి (పీ.వీ.నరసింహారావు సమాధి) వరకూ జరిగింది, దాదాపు వంద మంది ఔత్సాహికులు పాల్గొన్నారు.

రెండవ తెలుగుబాట

[మార్చు]

2011 కు గానూ తెలుగుబాట కార్యక్రమాన్ని తెలుగు భాషా దినోత్సవానికి ఒక రోజు ముందుగా, అంటే ఆగస్టు 28న నిర్వహించడం జరిగింది. ఆదివారం అందరికీ శెలవు రోజు కావటంతో ఎక్కువ మందికి రావటానికి సౌకర్యంగా ఉంటుందని నిర్ణయించడం జరిగింది. తెలుగు లలిత కళా తోరణం నుండి బషీర్ బాగ్ వరకు మరలా అక్కడి నుండి తెలుగు విశ్వవిద్యాలయం వరకూ నడక సాగింది. నడక తరువాత నందమూరి తారక రామారావు కళామందిరం లో తెలుగు భాషకు ఆధునిక హోదా అన్న విషయం పై విలేకరుల సమావేశం, చర్చ జరిగాయి.

ఇతర సమాచారం

[మార్చు]

మరిన్ని వివరాలు , సమోదు కొరకు తెలుగు బాట http://telugubaata.etelugu.org/[permanent dead link] వద్ద లభించును

బయటి లింకులు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2011-08-15. Retrieved 2011-08-17.