తెలుగు భాషా పరిరక్షణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఇంగ్లీషు వ్యామోహం వలన ఇంగ్లీషు ప్రాథమిక స్థాయి నుండే బోధనా మాధ్యమంగా ప్రత్యేకించి ప్రైవేటు పాఠశాలలలో బలపడింది. ఆధునిక ప్రసార మాధ్యమాలు, సినిమాలలో వాడే తెలుగులో ఇంగ్లీషు పదాలు పెరుగుతున్నాయి. భాషోద్యమంతో ప్రత్యేక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడినా, ప్రభుత్వ కార్యకలాపాల్లో తెలుగుకి ప్రాధాన్యత రాలేదు. ఈ స్థితిని చక్కదిద్దడానికి వ్యక్తులు, సంస్థలు కృషిచేస్తున్నాయి.

తెలుగు వాడుక స్థితి మరియు మెరుగునకు సూచనలు[మార్చు]

తెలుగు సాహిత్యంలో, మాధ్యమాలలో ఎన్నో మార్పులు జరుగుతున్నాయి మాటల పొందిక కరువైపోతుంది. తేటతెనుగు మాటల అల్లిక కరువైపోతున్నది. స్వరమాధుర్యం కరువైపోతున్నది. తెలుగు భాషలో మట్లాడే వారే తక్కువైపోతున్నారు. ఆధునిక పోకడల పేరుతో మాతృభాష-స్వరూప స్వభావాలను, రూపురేఖలను మార్చేస్తున్నారు. క్లుప్తంగా చెప్పాలంటే వర్ణ, పద, వాక్య స్థాయిలలో పరభాషా పదాలు ఎక్కువై, వ్యాకరణం మాత్రమే తెలుగులో ఉండే స్థితి వచ్చింది.

తెలుగు భాష దుస్థితికి కారణాలు
 • మాతృభాషాభిమానం జనసామాన్యానికి లేకపోవడం. ఇద్దరు తెలుగువారు కలసినా ఇంగ్లీషులో మాట్లాడటం.
 • పాఠ్యాంశాలలో తెలుగు లేకపోవడం, లేక స్థాయిని దిగజార్చడం. ప్రాథమిక విద్యా స్థాయి బోధకులలో భాషా పండితులు ఉండటంలేదు.
 • పరభాషా పదాలను విచ్చలవిడిగా, తెలుగు పదాలున్నాకూడా, పత్రికలలో వాడటం
 • కొత్త పద నిర్మాణం ఎక్కువగా జరగకపోవడం.
 • ప్రభుత్వ స్థాయిలోనే వివిధ పథకాలకు ఇంగ్లీషులో పేరులు పెట్టడం. (విలేజ్ మాల్) అనేది ఈమధ్యనే ప్రవేశపెట్టారు.
 • దేవాలయాల పాలన కార్యక్రమాలలో కూడా అనవసరంగా ఆంగ్లపదాలను (విఐపి బ్రేక్ దర్శనం, సన్నిధి బ్లెస్సింగు వంటివి).
మెరుగుకు సూచనలు[1].
 • జనవ్యవహారంలో సహజసిద్ధంగా పుట్టే పదాలను వాడుకలోకి తేవాలి. విశాఖ వాసులు డ్రెడ్జర్ ని తవ్వోడ, సబ్ మెరైన్ ని దొంగోడ అంటారు.
 • పత్రికలు తెలుగు పదాలనే విధిగా వాడాలి, ఉదా: అసెంబ్లీ - శాసనసభ, కోర్టు -న్యాయస్థానం, ఆర్గానిక్ ఫార్మింగ్ - సేంద్రీయ వ్యవసాయం, వాటర్ షెడ్స్ - వాలుగట్లు, చెక్ డ్యాం -వరద గట్టు. ఆంగ్లపదాలకు సమానార్థకాలను వాడటానికి సూచనలు. ఉన్నమాటలను పరిమితార్థంలో వాడటం, ఉన్న మాటలకు కొత్త అర్థాలను కల్పించటం, భాషానువాదం మరియు యథానువాదం. అర్థబోధక శక్తి ఉన్నరూపాలు వ్యాకరణ విరుద్ధాలైనా వాడటమే మంచిది, ఉదా: ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, గ్లోబలీకరణ
 • కొత్త పదాలను సృష్టించి ప్రచారం చేయాలి. దీనికి కాశీనాథుని నాగేశ్వరరావు, ఇతర భారతీయ భాషా పరిరక్షణ వాదులు మనకు ఆదర్శం కావాలి. ఆయన సృష్టించిన పదాలు ఉదా: నైట్రోజన్-నత్రజని, నికెల్-నిఖిలము, ఆక్సిజన్ - ప్రాణ వాయువు, ఫొటోసింథసిస్ - కిరణ జన్య సంయోగక్రియ, ఎంతో ప్రాచుర్యం పొందాయి.
 • మాటల ద్వారా, పాటల ద్వారా, సమాచార మాధ్యమాల ద్వారా, తెలుగు భాష సొబగులను, సొగసుందనాలను కాపాడుకోవాలి. నాటకాలు, నాటికలు, ప్రహసనాలు, చతుర సంభాషణలు, జనపదాలు, పల్లె గీతాలు, చిందు గీతాలు, మొదలగు వాటిని, మనం నిధిగా తలచి కాపాడుకోవాలి.
 • పదవ తరగతి వరకు తెలుగు తప్పనిసరి భాషగా చెయ్యడం. దాన్ని కచ్చితంగా అమలు పరచడం
 • ప్రచార మాధ్యమాలు భాషని ఎక్కువగా ప్రభావితం చేస్తాయి కనుక అక్కడ మార్పు తీసుకురావడం ముఖ్యం.
ఉదాహరణ కి తెలుగు లో నిర్మించే టివి కార్యక్రమాలను ప్రోత్సహించడం.
వాణిజ్య ప్రకటనలు తెలుగు లోనే ఉండాలి అని నిబంధనలు పెట్టడం . డబ్బింగ్ ప్రకటనలు ప్రసారం చెయ్యకుండా వీలయితే నిబంధనలు పెట్టడం .
తెలుగు భాషను పిల్లలకు చేరువ చేసేలా తెలుగు లో కొత్త కృత్రిమ సచేతమైన వ్యక్తుల(Animation Character) కార్యక్రమాలను (ఆంగ్లం లో బార్నీ,ఎల్మో లా )నిర్మించడం.[ఆధారం చూపాలి]

తెలుగు భాషా సంస్ధలు[మార్చు]

తెలుగు భాషా పరిరక్షణ ధ్యేయంగా ప్రత్యేక పత్రికలు, పత్రికలలో శీర్షికలు[మార్చు]

ఇవీ చూడండి[మార్చు]

వనరులు[మార్చు]

 1. తెలుగు వెలుగులేవి, అద్దంకి శ్రీనివాస్, హైద్రాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం తెలుగు అధ్యాపకులు. ఆంధ్రజ్యోతి,ఆగష్టు 29, 2010 మాతృ భాషా దినోత్సవ సందర్భంగా వ్యాసం
 2. e-తెలుగు
 3. తెలుగు-e
 4. e-తెలుగు