Jump to content
వికీ పాఠకులే వికీ రచయితలు!
వికీలో వ్యాసాలు రాస్తున్నది ఎక్స్పర్టులూ, సబ్జెక్టు నిపుణులూ కాదు. ఇక్కడ సాధారణ పాఠకులే వ్యాసాలు రాస్తారు. అందరూ కలిసి పరస్పర సహకారంతో, సమన్వయంతో పనిచేస్తూ వ్యాసాలను రాస్తారు. వివిధ వనరుల్లోంచి సమాచారాన్ని సేకరించి, ఆ మూలాలను ఉదహరిస్తూ ఆ సమాచారాన్ని వికీలో చేరుస్తారు. మరింత సమాచారం కోసం వికీపీడియా:పరిచయము చూడండి. ఈ పనిలో మీరూ భాగం పంచుకోవచ్చు. వికీలో ఖాతా సృష్టించుకోండి. మీకు ఆసక్తి ఉన్న విషయం గురించిన సమాచారాన్ని రాసి, వికీ అభివృద్ధిలో మీరూ తోడ్పడండి. ఈ విషయంలో సందేహమేమైనా ఉంటే వికీపీడియా సహాయకేంద్రంలో అడగండి.

తెలుగు వచనములు

వికీపీడియా నుండి
ఏక వచనం - కుక్క
బహువచనం: కుక్కలు

తెలుగు భాషలో రెండు వచనములు ఉన్నాయి. అవి ఏకవచనము, బహువచనము.

  • ఏకవచనము : ఒక వస్తువును గాని, వ్యక్తిని గురించి తెలుపునది ఏకవచనము. ఉదాహరణ: రాముడు, వనము. కొన్ని పదములు నిత్యైక వచనములుగా ఉపయోగించబడతాయి. ఇవి వరి, బంగారము, మొదలైనవి.
  • బహువచనము : రెండు గాని, అంతకంటె ఎక్కువ వస్తువుల గురించి గాని, మనుషులను గురించి గాని చెప్పినది బహువచనము. ఉదాహరణ: బల్లలు, వనరులు. కొన్ని పదములు నిత్య బహు వచనములుగా ఉపయోగించబడతాయి. ఇవి పాలు, కందులు, పెసలు, మొదలైనవి.

వచనములు లేదా వచనాలు సంఖ్యలను తెలియజేసేవి.

సంస్కృతంలో వచనములు మూడు విధములుగా ఉన్నాయి.

  • ఏకవచనము : ఒక సంఖ్యను తెలియజేసేది "ఏకవచనము".
  • ద్వివచనము : రెండు సంఖ్యను తెలియజేసేది "ద్వివచనము".
  • బహువచనము : మూడు అంతకు మించి అనంత సంఖ్యలను తెలియజేసేది "బహువచనము"

తెలుగు భాషలో ఏకవచనము, బహువచనములు మాత్రమే ఉన్నాయి.

1. ఏకవచనము - ఒక వస్తువును గురుంచిగాని, ఒకే వ్యక్తిని గురించిగాని చెప్పినచో అది ఏకవచనమగును - పుస్తకము, బల్ల, రామరావు.
2. బహువచనము - రెండుగాని అంతకంటే ఎక్కువ వస్తువులను గురించిగాని, ఇద్దరుగాని అంతకంటే ఎక్కువమంది వ్యక్తులను గురించిగాని చెప్పినచో అది బహువచనము - పుస్తకములు, బల్లలు, పూలు.
3. నిత్య ఏకవచనము - పంటలు, లోహములు మొదలైనవి నిత్య ఏకవచనములగును - వరి, బియ్యము, ఇనుము, రాగి.
4. నిత్య బహువచనము - ధాన్య వాచక శబ్దములు - కందులు, పెసలు, ఉలవలు.

మూలాలు

[మార్చు]
  • తెలుగు వ్యాకరణము: వర్రే సాంబశివరావు, దేవీ పబ్లికేషన్స్, విజయవాడ, 1999.