తేజోమూర్తుల కేశవరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తేజోమూర్తుల కేశవరావు

తేజోమూర్తుల కేశవరావు భారతీయ చిత్రకారుడు. ఇతడు దారుచిత్రాలను (కఱ్ఱపై చిత్రాలను) చెక్కడంలో నేర్పరి. అతని చిత్రాలు ఉదయిని, భారతి తదితర పత్రికలలో ప్రచురితమయ్యాయి.

జీవిత విశేషాలు[మార్చు]

అతను శాంతినికేతన్‌లో నందాలాల్‌ బోస్‌ వద్ద దారు చిత్రలేఖనంలో శిక్షణ పొందాడు.[1]

అతను కర్రపై చిత్రించిన "పల్లెటూరి సంసారము" చిత్రమునకు చెన్నపురి లలిత కళా సంఘం వారి చిత్ర ప్రదర్శన (1936) లో ప్రథమ బహుమతి లభించింది.

శ్రీశ్రీ రాసిన మహా ప్రస్థానం కవరు పేజీలు స్వయంగా శ్రీశ్రీయే దగ్గరుండి డిజైన్ చేశాడు. కవరుపేజీపై టైటిల్ అక్షరాలను కేశవరావు రాసాడు. పుస్తకంపై శ్రీరంగం శ్రీనివాసరావు అన్న సంతకం తయారీకి అతను పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. పసుపు పచ్చని కాగితాలపై నీలి పెన్సిలుతో యాభై సార్లు రాసి అందులో ఒకదాన్ని ఎంచుకున్నట్టు తానే అనంతంలో చెప్పుకున్నాడు.[2]

అతను నార్ల వెంకటేశ్వరరావు రచన ‘కొత్తగడ్డ’ (నాటికలో)కు సైతం మరో ఆర్ట్‌ డైరెక్టర్‌ జి.వి. సుబ్బారావు తో కలసి అందులోని ప్రతి నాటికకు చివర ఒక చిత్రం వేసి ఆ పుస్తకానికి ఒక ప్రత్యేక శోభ తెచ్చాడు. [3]

చిత్రమాలిక[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "ప్రముఖ చిత్రకారులు – పేజీ 3". మామాట. Retrieved 2020-07-11.
  2. "నవ చైతన్య నికేతన మార్గదర్శకుడు శ్రీశ్రీ-2సంచిక – తెలుగు సాహిత్య వేదిక | సంచిక - తెలుగు సాహిత్య వేదిక" (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-04-12. Retrieved 2020-07-11.
  3. "ఆర్కైవ్ నకలు". m.andhrajyothy.com. Archived from the original on 2020-07-12. Retrieved 2020-07-11.

బాహ్య లంకెలు[మార్చు]