ఉదయిని
రకం | ద్వైమాసపత్రిక |
---|---|
రూపం తీరు | డెమీ ఆక్టావో |
ప్రచురణకర్త | కొంపెల్ల జనార్ధనరావు |
సంపాదకులు | కొంపెల్ల జనార్ధనరావు |
సహ సంపాదకులు | ఆచంట జానకీరాం |
స్థాపించినది | జూన్ 1934 |
భాష | తెలుగు |
కేంద్రం | మద్రాసు |
ఉదయిని[1] సాహిత్యపత్రిక రెండు నెలలకు ఒకసారి వెలువడేలా ప్రముఖ భావకవి కొంపెల్ల జనార్ధనరావు 1934లో ప్రారంభించాడు. మద్రాసు నుండి వెలువడిన ఈ పత్రిక ఎక్కువకాలం మనలేక పోయింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ పత్రిక ఆరు సంచికలు మాత్రమే వెలుగు చూడగలిగింది.
శీర్షికలు
[మార్చు]ఈ పత్రిక నాలుగో సంచిక దసరా 1935 సంచికలో ఈ క్రింది అంశాలున్నాయి.
- కిరణాలు - సంపాదకుడు
- శశిదూతము (కవిత) - విశ్వనాథ సత్యనారాయణ
- లోపాముద్ర (కవిత) - శివశంకరశాస్త్రి
- స్వర్ణకింకిణి (కవిత) - మల్లవరపు విశ్వేశ్వరరావు
- అదృష్టము (కవిత) - జనమంచి కామేశ్వరరావు
- ప్రభాతసుందరి (కవిత) - ఊటుకూరు సత్యనారాయణరావు
- గోగీతి (కవిత) - అత్తిలి సూర్యనారాయణమూర్తి
- నీడ (కవిత) - చావలి బంగారమ్మ
- భైరవి (కవిత) - పురిపండా అప్పలస్వామి
- సమస్య - రావిపాటి వెంకటరామారావు
- శ్రీ దీక్షితులు గారి నాటికలు - పిలకా గణపతిశాస్త్రి
- ఆక్షణము - మంగిపూడి పురుషోత్తమశర్మ
- సీత (కుందమాల) - విశ్వనాథ సత్యనారాయణ
- ఆరనిజ్యోతి - జనమంచి కామేశ్వరరావు
- శైలబాల - అడివి బాపిరాజు
- పావురాలు (దారుచిత్రము) - తేజోమూర్తుల కేశవరావు
- ప్రాకృతము - నన్నయకు పూర్వపు సాహిత్యము - మల్లంపల్లి సోమశేఖరశర్మ
- వాఙ్మయవీధి
- శృంగాటకం
రచయితలు
[మార్చు]ఈ పత్రికలో పైన పేర్కొన్న రచయితలే కాకుండా ఇంకా కృష్ణశాస్త్రి, రాయప్రోలు సుబ్బారావు, నోరి నరసింహశాస్త్రి, దామెర రాజగోపాలరావు, ముద్దుకృష్ణ, చింతా దీక్షితులు, ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి, చలం, నేలటూరి వెంకటరమణయ్య, శ్రీరంగం శ్రీనివాసరావు, కొండేపూడి సుబ్బారావు, అడివి బాపిరాజు, తెలికిచెర్ల కృష్ణమూర్తి, కవికొండల వెంకటరావు, కొమఱ్ఱాజు వినాయకరావు, కందుకూరి రామభద్రరావు, దువ్వూరి రామిరెడ్డి, శ్రీపాద గోపాలకృష్ణమూర్తి, పింగళి లక్ష్మీకాంతం, కాటూరి వెంకటేశ్వరరావు, కొడాలి ఆంజనేయులు,కరుణకుమార, వెంపటి నాగభూషణం, పుట్టపర్తి శ్రీనివాసాచార్యులు, ఆచంట జానకీరాం, కొంపెల్ల జనార్ధనరావు మొదలైనవారు రచనలు చేశారు.
పండితాభిప్రాయము
[మార్చు]ఈ పత్రిక గురించి గిడుగు వెంకట రామమూర్తి పంతులు తన అభిప్రాయాన్ని ఈ విధంగా తెలిపాడు.
మీవంటి మహానుభావుల రచనలు ప్రచురించడానికి వేరుగా ఒక పత్రిక ఉండడము ఉచితమే. ఆవశ్యకము కూడాను. ఈ సంచికలలోని కొత్త రచనలు మీవి, మీ మిత్రులవీ శ్రద్ధగా పరిశీలించినవారికి తెలుగు సాహిత్య చరిత్రలో కొత్త యుగము ఏర్పడుతున్నట్టు తోచకపోదు. ఇంగ్లీషూ, బంగాళీయుల విదేశీయ భాషలలోని కొత్త రచనలు చదివి నవ్యకావ్య రసాస్వాదనము చేసి తృప్తి పొందిన తెలుగు రసికులకు నేటి తెలుగు మాసపత్రికలను అందులోనూ 'ఉదయిని', 'జ్వాల ' వంటి వాటిని ఇటుపైని ఈసడించడానికి కారణముండదు. నేటి తెలుగు భాషలో నేటి భూలోకము ప్రతిఫలించేటట్టు చేయగల తెలుగు లేఖకులున్నూ, తెలుగు కవులున్నూ అన్య దేశీయులతో తులతూగగలవారు తయారవుతున్నారని ఈ పత్రికలు విశదము చేస్తున్నవి.
మూలాలు
[మార్చు]- ↑ "ప్రెస్ అకాడెమీ జాలస్థలిలో ఉదయిని పత్రిక ప్రతి". Archived from the original on 2016-03-05. Retrieved 2020-07-21.