ఊటుకూరు సత్యనారాయణరావు
Appearance
ఊటుకూరు సత్యనారాయణరావు | |
---|---|
జననం | మార్చి 14, 1905 |
మరణం | 1981 |
జాతీయత | భారతీయుడు |
వృత్తి | కవి, నాటక , సినిమా రచయిత |
ఊటుకూరు సత్యనారాయణరావు (మార్చి 14, 1905 - 1981) ప్రముఖ కవి, నాటక, సినిమా రచయిత.[1]
జననం - విద్యాభ్యాసం
[మార్చు]సత్యనారాయణరావు 1905, మార్చి 14న అచ్యుతరావు, రంగనాయకమ్మ దంపతులకు కృష్ణాజిల్లా, గంపలగూడెం సమీపంలోని ఆర్లపాడు గ్రామంలో జన్మించాడు.
రచనా ప్రస్థానం
[మార్చు]గుహుడు, బాష్పాంజలి, ఉదయరేఖలు వంటి పద్యకావ్యాలు రచించాడు.
నాటకాలు
[మార్చు]బందా కనకలింగేశ్వరావు ప్రోత్సాహంతో నాటక రచనను ప్రారంభించి 12 నాటికలు రాశాడు.
- పాషాణి (1937)
- ఛత్రపతి శివాజీ (1940)
- వీరాభిమన్యు (1940)
- వసంతసేన (1941)
- అనార్కలి (1941)
- ద్రౌపది (1943)
- ఫిరదౌసి (1955)
- కర్ణధారి (1957)
సినిమాలు
[మార్చు]మాయా మచ్ఛీంద్ర (1943) చిత్రానికి మాటలు, పాటలు అందించాడు.
బహుమతులు
[మార్చు]ఉత్తమ రచన - వీరాభిమన్యు - నంది నాటక పరిషత్తు - 2005 - విజయవాడ
మరణం
[మార్చు]సత్యనారాయణరావు [1981]లో గంపలగూడెంలో మరణించారు.
మూలాలు
[మార్చు]- ↑ నాటక విజ్ఞాన సర్వస్వం, తెలుగు విశ్వవిద్యాలయం కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.624.