నేలటూరి వెంకటరమణయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సుప్రసిద్ధ చారిత్రక పరిశోధకులు నేలటూరి వెంకటరమణయ్య ప్రకాశం జిల్లా నేలటూరు గ్రామంలో 1883లో జన్మించారు. తండ్రి సుబ్బయ్య, తల్లి పాపమ్మ. పూదూరు ద్రావిడులు. ఆంధ్రదేశ చరిత్ర, శాసనములు, ప్రాచీనసాహిత్యంలో విశేష కృషి చేసేరు. మరణం 1977లో. ఆంధ్రప్రభ 15-8-1963 ప్రత్యేక సంచికలో తిరుమల రామచంద్రగారు రాసిన వ్యాసం "మహామనీషి వెంకటరమణయ్య" తెలుగు తూలికలో చూడవచ్చు.[1]

జీవిత విశేషాలు[మార్చు]

వెంకటరమణయ్య గారి తండ్రిగారు సుబ్బయ్యగారు. తాతగారు లక్ష్మీనారాయణగారు.ముత్తాత వెంకటాచలం ఉరవ్ తాతాచార్లుగారు. వెంకటరమణయ్య గారిని బాల్యమిత్రులందరు వెంకటరమణాచార్లు అని ఎరుగుదురు.బీద కుటుంబము అగుటవలన వెంకటరమణయ్య గారు శ్రమ జీవి. సుప్రసిద్ధ న్యాయవాదులు శ్రీ తూములూరి శివరామయ్యగారు నెల్లురులో తమ వృత్తి ప్రారంభించిన కాలమున వారు బీద బ్రాహ్మణులకు ఎంతో ఉపకరించి వార భోజనాదులు ఏర్పాటు చేయింపగా వెంకటరమణయ్య గారు, వారి సోదరులు రాఘవయ్యగారు అచ్చట భుజించెడివారు.శివరామయ్యగారి భాండాగారమందలి పుస్తకములను వదలక చదువుకొనుచుండెడివారు.ఇరువురు ఒక చోటికి పోవునేల అని వెంకటరమణయ్య గారు మధుకర వృత్తిని అవలంబించిరి.ఎవరైనను కసరినను నోర్చుకొనుచు, స్థలముచాలని ఒక యింట నివసించుచు కాలక్షేపము చేసిరి.1913 సం.SSLC పరీక్షయై, మదరాసుకువచ్చి, మణలి హాష్టలలో చేరి, 1915-16 లో ఇంటర్మీడియట్ ను, 1918-19 లో B.A. Hons ఉత్తీర్ణులైరి. ఆనర్సు చదువు ఉద్దేశ్యము ముందులేదు. B.Aలో ఖాళీలు లేకపోవుటవలన్ ప్రింసిపల్ గారు వీరియందు ఆదరము వహించి ఆనర్సులో చేరిపించిరి.తర్వాత బెంగళూరు వెస్ట్లీ కమిషన్ కాలేజి హైస్కూలో కొంతకాలము అధ్యపకులుగా ఉండి 1920-21 లో మరల మదరాసుకు వచ్చిరి.క్రైస్తవ కళాశాలలో కార్లీ గారి సిఫారసుమేరు చారిత్రిక అధ్యాపకుల పోస్టుఖాళీ లేనందున తెలుగు అహ్ద్యాపకులుగా చేసిరి. Best Telugu Pandit అని పేరుసంపాదించి 1922లో కళాశాలలో చారిత్రికాధ్యాపాకులైరి.అది మొదలు 1931 వరకు అక్కడే పని చేసినారు.

మదరాసుకు వచ్చి ఉద్యోగము కుదిరిన ప్రారంభకాలమందే శ్రీ మానవల్లి రామకృష్ణ కవి గారి స్నేహము లభించెను.వీరి తమ్ముడు రాఘవయ్యగారి ప్రెసిడెంసీ కాలేజీలో ఉన్నత విద్యనభ్యసించి కెమిస్ట్రీ ఉపాధ్యాయుడిగా అమెరికన్ బాప్టిస్ట్ హై స్కూల్లో పనిచేసిరి.

ఇంటిలో కూడ పాండిత్యపు వాతావరణము బాల్యమునుండియు లేకపోలేదు రమణయ్యగారికి.చక్కని కవి, పెక్కు యక్షగానములు రచించినవారు, విజయాశ్వ చరిత్ర కావ్యకర్తలు శ్రీ పురాణము పిచ్చయ్యశాస్త్రి గారు వీరికి మేనమామ గారు.వీరికి 1909లో కుమార్తెనిచ్చి పెండ్లి చేసినారు. శ్రీ సరస్వతుల సూర్యనారాయణశాస్త్రి గారు సంస్కృత్రాంధ్ర పండితులేకాక వెంకటగిరి సంస్థానమున పండితులును. వీరందరు కలిసి ఉండెవారు.

ఈవిధముగా సంస్కృతాంధ్ర భాషల పరిచయమును చారిత్రికాధ్యాపక ఉద్యోగమును దొరికిన కాలమున జీవితమందు పెద్ద మార్పునకు కారణమైన ఒక సంభవము జరిగినది. అది సోదర వియోగము. రాఘవయ్యగారు తన 35యేట 1927లో మరణించిరి. ఇది వెంకటరమణయ్య గారికి పెద్ద దెబ్బ.అటుపై సోదర వియోగము దుర్భరమై ఆకాలమున దానిని మరచుటకు మరింత చదువులలో మునిగి బాహ్య ప్రపంచమును మరచిఫొవుటకు చేసిన ప్రయత్నము అత్యధిక చారిత్రిక పరిశోధన రూపమును దాల్చినది. అప్పుడు Oregin of the South Indian Temples కు డాక్టరేటు బిరుదు దొరికనది.

సోదరుడు పోయిన కొరతను తీర్చు సోదర తుల్యుడుగా వీరికి ఈకాలమున దొరికినవారు సుప్రసిద్ధ పరిశోధకులు శ్రీ మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు.1928లో డాక్టరు పట్టముపొందిన వెనుక 1930-31 వరకు క్రైస్తవ కళాశాలలో అధ్యాకలుగానుండి, ఆ సం.మదరాసు విశ్వవిద్యాలయమున హిస్టరీ డిపార్టుమెంటులో రీడరుగా నియమితులైరి.అంతకుముందే వెలువడిన వీరిరచనలు త్రిలోచన పల్లవ-కరికాల చోళులను ఆంగ్లగ్రంధము, కంపిలి-విజయనగరము అను ఆంగ్ల వ్యాసములు రచించినారు.

విశ్వవిద్యాలయమును వదలిన తరువాత మదరాసు Record Office లో Regional Research Officer గా కొంతకాలము పనిచేసి Freedom Movement చరిత్ర రచనకు కావలసిన విషయములు సేకరించిరి. అటుపై వేములవాడ చాళుక్యుల చరిత్రను ఆంగ్లములో వ్రాసి శాసన ప్రతిబింబములతో హైదరాబాదు పురాతత్త్వశాఖ వారి ప్రచురణగా వెలువడినది.

వీరు వట్టి చరిత్రకారులు మాత్రమేకారు.ఆంధ్రమున చక్కని కృషిచేసి భాషా వాజ్మయచారిత్రక విషయములమీద చాలా వ్యాసములు వ్రాసినారు. వీనినెల్ల ఒక సంపుటముగా హైదరాబాదు ఆంధ్ర సారస్వత పరిషత్తువారు ప్రకటించి ఉన్నారు.మదరాసు ఓ ఎం ఎస్ లైబ్రరీవారికి హైదరుచరిత్ర కుమారరాముని చరిత్ర మున్నగు పెక్కు గ్రంధములకు సంపాదకులు అగుటయే కాక యక్షగానములు మీద చక్కని పరిశోధన చేసిరి.తెనుగు ప్రబంధ పఠానాశక్తి వీరికి మెండు.నన్నిచోడుని కుమారసంభవమునకు సగము వరకు వ్యాఖ్య రచించినారు.

వీరు చక్కని కధకులు కూడా. చారిత్రికేతి వృత్తములను గ్రహించి తెలుగులోను, ఇంగ్లీషులోను చాలకధలు కల్ప్నాశిల్పముమీద వ్రాసిఉన్నారు.

విద్య[మార్చు]

  • యమ్.ఎ.
  • పి.హెచ్.డి.

సాహిత్యం[మార్చు]

  • చరిత్ర రచన లేక చారిత్రకవ్యాసములు. ప్రథమ భాగము. మద్రాసు. వేదము వెంకటరాయ శాస్త్రి, 1948.[2]
  • పల్లవులు, చాళుక్యులు. మద్రాసు. వేదము వెంకటరాయ శాస్త్రి, 1969
  • విజయనగర చరిత్ర, 2. సం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, 1977
  • కృష్ణదేవరాయలు, హైదరాబాదు, 1972
  • త్రిలోచన పల్లవుడు
  • కరికాలచోళుడు
  • విజయనగర పట్టణ సామ్రాజ్య ఉత్పత్తి
  • దక్షిణ హిందూదేశప్రారంభం
  • విజయనగర మూడవ రాజవంశములోని పతనములు
  • భారతదేశములో మహమ్మదీయుల తొలి విస్తరణ
  • విజయనగర చరిత్రకు మరి కొన్ని మూలములు
  • పాల్కురికి సోమనాథుడు ఎప్పటివాడు?
  • ఆంధ్రప్రదేశమున చరిత్ర పరిశోధన
  • మధుర తంజావూరు నాయక రాజుల నాటి ఆంధ్ర వాఙ్మయ చరిత్ర.

నవలలు, కథలు[మార్చు]

  • మధుమావతి. (పెద్దకథ. తెలుగు స్వతంత్ర - 1948 ఆగస్టు 8-1948 సెప్టెంబరు 3)
  • ప్రతీకారము. (పెద్దకథ. తెలుగు స్వతంత్ర - 12.11.1948-19.11.48)
  • ఛత్రగ్రాహి. (పెద్ద కథ. తెలుగు స్వతంత్ర - 10.12.1948-07.01.1949)
  • పచ్చడము. (పచ్చడము (కథ) భారతి - 01.12.)
  • కృష్ణదేవరాయలు
  • The origina of the city and the Impire of Vijayanagara. గ్రంధము.
  • Third Dynasty of Viajayanagara. వ్యాసము.
  • వెలుగోటి వారి వంశ చరిత్ర. గ్రంధము.
  • Early Muslim Expansion. గ్రంధము.
  • Rudra Siva వ్యాసము.
  • Further Sources of Vijayanagara History గ్రంధము.

పరిష్కరణలు[మార్చు]

  • కొమర్రాజు వెంకట లక్ష్మణరావు: మహమ్మదీయ మహాయుగము. 2 సం. పరిష్కర్త. నేలటూరి వెంకటరమణయ్య. 1964.
  • నన్నెచోడుని కుమారసంభవము. పరిష్కర్త. నేలటూరి వెంకటరమణయ్య. హైదరాబాదు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య ఎకాడమీ, 1978.
  • విజయరాఘవుని రఘనాథాభ్యుదయము. పరిష్కర్త. నేలటూరి వెంకటరమణయ్య
  • కంకంటి పాపరాజుయెక్క విష్ణుమాయావిలాస నాటకము. పరిష్కర్త. నేలటూరి వెంకటరమణయ్య.

Publications in English[మార్చు]

  • Perur Inscriptions. Andhra Pradesh Textbook Press, 1973
  • Studies in the history of the ¬¬¬third dynasty of Vijayanaga. University of Madras Press, 1935.
  • Vijayanagara: Origin of the city and the empire. New Delhi: Asian Educational Services, 1990
  • Rudradeva University of Madras, 1941

Collaborations[మార్చు]

  • Nelaturi Venkataramanayya and P.V. Parabrahma Sastry. Inscriptions of Andhra Pradesh, Nalgonda District. A.P. Department of Archaeology and Museum. . Pub by Government of Andhra Pradesh. 1994

వనరులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. [1]
  2. వెంకటరమణయ్య, నేలటూరి. చారిత్రక వ్యాసములు.
  • 1974 భారతి మాస పత్రిక వ్యాసము:డా. నేలటూరి వెంకటరమణయ్యగారి భాషాసేవ. వ్యాసకర్త: శ్రీ వేదము వేంకటరాయ శాస్త్రి.