తొలకరి

ఆంధ్రప్రదేశ్ లో నైరుతి రుతుపవనాలురాకతో వర్షాకాలం ప్రారంభమవుతుంది. నైరుతి రుతుపవనాల రాకతో కురిసిన మొట్టమొదటి లేక తొలి వానను తొలకరి లేక తొలకరి జల్లు అంటారు.
వర్షపాతం
[మార్చు]మొత్తం వార్షిక వర్షపాతంలో 10 శాతం వేసవి కాలంలో కురుస్తుంది. అదికూడా క్యుములోనింబస్ మేఘాలు ఏర్పాటు వల్ల కురిసే సంవహన వర్షపాతం. ఈ సంవహన వర్షపాతాన్ని సాయంకాలపు వర్షపాతం లేదా 4 గంటల వర్షపాతం లేదా ఆరంభపు జల్లులు అని కూడా అంటారు. ఈ వర్షపాతాన్ని తొలకరి జల్లులు (Premonsoon Showers) అంటారు.[1]
ఈ సంవహన వర్షపాతాన్ని వివిధ పేర్లతో పిలుస్తారు.
1) మామిడి జల్లులు (Mango Showers): ఇవి కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కురుస్తాయి.
- ఇవి మామిడి పండ్లు రాలకుండా ఉండటానికి, పక్వానికి (Ripening of mangoes) రావడానికి ఉపయోగపడుతాయి.
- వీటిని ఏప్రిల్ వానలు అని కూడా అంటారు.
2) చెరీ బ్లాసమ్ షవర్స్ (Coffee Showers): కేరళ, కర్ణాటక ప్రాంతంలో కురిసే తొలకరి జల్లులు. డిసెంబర్‌లో ప్రారంభమైన కాఫీ పంట కొంతకాలం మార్చికి ముగుస్తుంది.
- కాఫీ పుష్పాలు వికసించే దశలో కాఫీ నాణ్యతకు వానలు అవసరం.
3) తేయాకు జల్లులు (Tea Showers): అసోం రాష్ట్రంలో తేయాకు, నాణ్యతకు, ఉత్పాదకతకు ఉపయోగపడే వర్షాలు.
4) ఏరువాక జల్లులు: ఆంధ్రప్రదేశ్
5) తొలకరి వానలు (Premonsoon Showers): తెలంగాణ
- వేసవిలో అత్యధిక సగటు వర్షపాతం అసోం రాష్ట్రంలో నమోదవుతుంది (500 సెం.మీ.).
వ్యవసాయ పనులు ప్రారంభం
[మార్చు]ఎండలకు బీడు బారిన పొలాలు తొలకరి వర్షంతో పదును బారుడంతో రైతులు భూమిని ఎద్దుల ద్వారా లేక ట్రాక్టర్ల ద్వారా దున్ని వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు.
గ్యాలరీ
[మార్చు]- తొలకరి వర్షాలలో జోగ్ జలపాతం
మూలాలు
[మార్చు]- ↑ Nipuna. "తొలకరి జల్లులుగా పిలిచే వర్షపాతం?". Retrieved 2025-10-19.