త్రిపుర ప్రభుత్వం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Government of Tripura
Seat of GovernmentAgartala
చట్ట వ్యవస్థ
Assembly
SpeakerBiswa Bandhu Sen
Deputy SpeakerRam Prasad Paul
Members in Assembly60
కార్యనిర్వహణ వ్యవస్థ
GovernorN. Indrasena Reddy
Chief MinisterManik Saha
Deputy Chief MinisterVacant
Chief SecretaryShri Jitendra Kumar Sinha, IAS[1][2]
Judiciary
High CourtTripura High Court
Chief JusticeJustice Aparesh Kumar Singh

త్రిపుర రాష్ట్ర ప్రభుత్వం' లేదా స్థానికంగా రాష్ట్ర ప్రభుత్వం అని పిలువబడే త్రిపుర ప్రభుత్వం, త్రిపుర దాని 8 జిల్లాలకు అత్యున్నత పాలక అధికారం సాగించే సంస్థ. ఇందులో త్రిపుర గవర్నరు నేతృత్వంలోని కార్యనిర్వాహక వర్గం, న్యాయవ్యవస్థ, శాసనశాఖ ఉంటాయి.

భారతదేశం లోని ఇతర రాష్ట్రాల మాదిరిగానే, త్రిపుర రాష్ట్ర అధిపతి గవర్నరు, కేంద్రప్రభుత్వ సలహా మేరకు భారత రాష్ట్రపతి నియమిస్తాడు. గవర్నరు పదవి ఎక్కువగా ఆచారబద్ధమైనది. ముఖ్యమంత్రి ప్రభుత్వానికి ప్రధాన అధిపతి. చాలా వరకు కార్యనిర్వాహక అధికారాలు ముఖ్యమంత్రి వద్ద ఉంటాయి. అగర్తలా నగరం త్రిపుర రాజధాని. ఇక్కడ శాసనసభ, సచివాలయం అగర్తలా లోనే ఉన్నాయి.. అగర్తలాలో ఉన్న త్రిపుర హైకోర్టు, త్రిపుర రాష్ట్రంలో తలెత్తే కేసులకు సంబంధించి అధికార పరిధిని, అధికారాలను అమలు చేస్తుంది.[3]

ప్రస్తుత త్రిపుర శాసనసభ ఏకసభ. ఇందులో 60 మంది శాసనసభ సభ్యులు (ఎంఎల్ఎ) ఉన్నారు. ఏదేని పరిస్థితులలో గవర్నరు ముందుగానే రద్దు చేయకపోతే దీని పదవీకాలం 5 సంవత్సరాలు ఉంటుంది.[4]

రాష్ట్ర ప్రభుత్వం, ఎన్జీఓ వంటి ప్రజా సేవలను అందించే ఇతర సంస్థలలో పనిచేసే సిబ్బందికి శిక్షణను స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ద్వారా అందిస్తుంది.ఇది స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థ. దీని కార్యనిర్వాహక బృందంలో రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన సీనియర్ అధికారులు ఉన్నారు.[5]

మంత్రివర్గం

[మార్చు]

Second Saha ministry

మూలాలు

[మార్చు]
  1. "Tripura State portal".
  2. "Tripura Chief Secretary Kumar Alok transferred, J K Sinha new acting CS". Retrieved 10 March 2023.
  3. "Jurisdiction and Seats of Indian High Courts". Eastern Book Company. Retrieved 2008-05-12.
  4. "Tripura Legislative Assembly". Legislative Bodies in India. National Informatics Centre, Government of India. Retrieved 2008-05-10.
  5. "SIPARD administrative set up". Retrieved 1 May 2024.

వెలుపలి లంకెలు

[మార్చు]