Jump to content

త్రిమితీయ ముద్రణ

వికీపీడియా నుండి
(త్రీ డీ ప్రింటింగ్ నుండి దారిమార్పు చెందింది)

వస్తువుల నిజమైన రూపం ఎలా ఉంటుందో అలాగే ముద్రించుటను త్రీ డీ ప్రింటింగ్ లేదా త్రిమితీయ ముద్రణ అంటారు. ఈ ప్రింటింగ్ విధానం 1986లో అందుబాటులోకి వచ్చింది, అయినా 1990 వరకు పెద్దగా వినియోగించలేదు.సాధారణ ప్రింటర్ 2డీ రకానికి చెందింది. పొడవూ వెడల్పూ మాత్రమే ఉంటాయి. అదే త్రీడీలో ఎత్తూ తోడవుతుంది. అంటే, ఓ పరిపూర్ణ ఆకారానికి సరిపడా కోణాలన్నీ వచ్చేసినట్టే ఈ ప్రింటర్ లో సిరాకు బదులు ప్లాస్టిక్, పాలీయుథెరిన్, ఎపాక్సీ, మెటల్ పౌడరును వాడుతారు. దీనిలో ముద్రించే ముద్రణ రూపాన్ని కంప్యూటరులో కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ (క్యాడ్) ఫైల్ గా రూపొందించి, కంప్యూటరుతో అనుసంధానమైన త్రీడి ప్రింటర్ ద్వారా ముద్రిస్తారు. 3D ముద్రణలో వస్తువు యొక్క నిర్మాణం పొరలు పొరలుగా నిర్మితమవుతుంది. 3D ప్రింటింగ్ సాధారణంగా పదార్థ ప్రింటర్ తో చేయబడుతుంది. మునుపు కంటే 2003 నుండి మెటీరియల్స్ ప్రింటర్లు ఎక్కువగా అమ్ముడయ్యాయి. అలాగే త్రీడి ప్రింటర్ల యొక్క ధర తగ్గుతూ ఉంది.

వైద్య రంగంలో

[మార్చు]

డెస్క్‌టాప్ ఫ్యాబ్రికేషన్‌గా పిలవబడే ఈ ప్రక్రియ వైద్యరంగంలో ప్రాధాన్యాన్ని సంతరించుకుంటుంది. ఉదాహరణకు శరీరంలోని వివిధ భాగాలు ఏ ఆకృతిలో ఉంటాయో అలాంటి ఆకృతులలో ముద్రణలు తీసుకోవచ్చు. డీ ప్రింటింగ్ టెక్నాలజీ వైద్యరంగంలో పెను మార్పులకు కారణం అవుతోంది. శాస్త్రవేత్తలు త్రీడీ బయో ప్రింటరు సాయంతో కృత్రిమ గుండెను కూడా తయారు చేశారు. అంతేనా, ఈ పరిజ్ఞానంతో విరిగిపోయిన దంతాల్ని పునరుద్ధరించుకోవచ్చు.తెగిపోయిన ముక్కూ చెవుల స్థానంలో కొత్తవి అతికించుకోవచ్చు. కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ వైద్యశాస్త్రంలో సరికొత్త మార్పులకు కారణం కాబోతోంది. త్రీడీ ప్రింటరుతో నేరుగా ఒంటిమీదే చర్మాన్ని ప్రింట్ చేసుకునే ఏర్పాట్లు కూడా మొదలయ్యాయి. లండన్ వైద్యనిపుణులు ...ఓ మహిళకు సహజమైన పుర్రె స్థానంలో త్రీడీ పుర్రె బిగించారు. జర్మనీ శాస్త్రవేత్తలు త్రీడీ టెక్నాలజీతో రోబో చేతుల్నీ కాళ్లనూ తయారు చేస్తున్నారు వేళ్లలో కదలిక ఉంటుంది, ఆకృతిని బట్టి పరిమాణాన్నీ ఛాయను బట్టి రంగునూ మార్చుకునే వీలుంది. త్రీడీ ప్రింటరు ద్వారా గర్భస్థశిశువు ప్రతిరూపాన్ని తీసుకునే అవకాశమూ ఉందిప్పుడు.దీంతో వైద్యులు పిండాన్ని మరింత క్షుణ్నంగా పరీక్షించవచ్చు.

చిత్రమాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]
  • సాక్షి దినపత్రిక - 07-08-2014 (త్రీ డీ ప్రింటింగ్ అంటే..)