Jump to content

థైరోట్రోపిన్ ఆల్ఫా

వికీపీడియా నుండి
థైరోట్రోపిన్ ఆల్ఫా
Clinical data
వాణిజ్య పేర్లు Thyrogen
ప్రెగ్నన్సీ వర్గం ?
చట్టపరమైన స్థితి -only (US) Rx-only (EU)
Identifiers
CAS number 194100-83-9
ATC code H01AB01
UNII AVX3D5A4LM
Chemical data
Formula ?

థైరోట్రోపిన్ ఆల్ఫా, అనేది థైరోజెన్ బ్రాండ్ పేరుతో విక్రయించబడే ఔషధం. శస్త్రచికిత్స తర్వాత మిగిలిన థైరాయిడ్ కణజాలాన్ని కనుగొనడానికి ఉపయోగిస్తారు.[1] ప్రత్యేకంగా ఇది థైరోగ్లోబులిన్ పరీక్షతో పాటు థైరాయిడ్ క్యాన్సర్‌లో ఉపయోగించబడుతుంది.[2] ఇది కండరాలలోకి ఇంజెక్షన్ ద్వారా ఇవ్వబడుతుంది.[2]

వికారం, తలనొప్పి వంటి సాధారణ దుష్ప్రభావాలు ఉంటాయి.[2] ఫంక్షనల్ థైరాయిడ్ కణజాలం, స్ట్రోక్, పెరిగిన థైరాయిడ్ కణితి పరిమాణం ఉన్నవారిలో అధిక థైరాయిడ్ వంటివి కూడా కలిగి ఉండవచ్చు.[2] ఇది థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ తయారీ రూపం.[2]

థైరోట్రోపిన్ ఆల్ఫా 1998లో యునైటెడ్ స్టేట్స్‌లో, 2000లో యూరప్‌లో వైద్యపరమైన ఉపయోగం కోసం ఆమోదించబడింది.[2][3] యునైటెడ్ స్టేట్స్‌లో చికిత్స కోర్సు కోసం సుమారు 3,700 అమెరికన్ డాలర్లు ఖర్చు అవుతుంది.[4] యునైటెడ్ కింగ్‌డమ్‌లో ఈ మొత్తం NHSకి దాదాపు £580 ఖర్చవుతుంది.[1]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 BNF (80 ed.). BMJ Group and the Pharmaceutical Press. September 2020 – March 2021. p. 813. ISBN 978-0-85711-369-6.{{cite book}}: CS1 maint: date format (link)
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 "Thyrotropin Alfa Monograph for Professionals". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 4 March 2021. Retrieved 4 October 2021.
  3. "Thyrogen". Archived from the original on 10 April 2021. Retrieved 5 October 2021.
  4. "Thyrogen Prices, Coupons & Patient Assistance Programs". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 27 January 2021. Retrieved 5 October 2021.