థ్రిల్లర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
థ్రిల్లర్
దర్శకత్వంరామ్ గోపాల్ వర్మ
రచనరామ్ గోపాల్ వర్మ
నిర్మాతరామ్ గోపాల్ వర్మ
తారాగణంఅప్సర రాణి, రాక్ కచ్చి
విడుదల తేదీ
14 ఆగస్టు 2020 (2020-08-14)
దేశంభారతదేశం
భాషతెలుగు

థ్రిల్లర్ 2020లో తెలుగులో విడుదలైన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ సస్పెన్స్, థ్రిల్లర్ సినిమా. ఎ సౌత్ ప్లస్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రామ్ గోపాల్ వర్మ నిర్మించి దర్శకత్వం వహించాడు. అప్సర రాణి, రాక్ కచ్చి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను జులై 30న విడుదల చేసి[1], సినిమాను తెలుగు, తమిళం, మలయాళం, మరాఠీ, భోజ్‌పురి, ఒడియా, హిందీ, గుజరాతీలతో సహా తొమ్మిది భాషల్లో ఆగస్టు 14న రూ.200 చెల్లించి చూసేలా ఓటీటీ ఫార్మాట్‌లో ఆర్జీవీ వరల్డ్ థియేటర్ (RGV World Theatre), శ్రేయాస్ ఈటీ యాప్‌ (Shreyas ET App)లో విడుదల చేశాడు.[2]

సమీర్ అలియాస్ సామ్ (రాక్ కచ్చి), మేఘ (అప్సర రాణి) ప్రేమించుకుంటారు. విశాల్ అనే స్నేహితుడితో కలిసి అర్థరాత్రి దాకా పార్టీ వీళ్ళిద్దరూ చేసుకొని పార్టీ ముగిశాక ఇంటికి తిరిగే క్రమంలో మధ్యలో మేఘను ఇంటి వద్ద డ్రాప్ చేయాలని సమీర్ భావిస్తాడు. ఆ సమయంలో మేఘతో రొమాన్స్ చేయడానికి, కోరిక తీర్చుకోవాలని ప్రయత్నిస్తాడు. కానీ పెళ్లి తర్వాతే నీ కోరిక తీరుస్తా అని మేఘా చెప్పడం ఇక మేఘ తన ఇంట్లోకి ఎంటరయ్యాక ఊహించని సంఘటనలు ఎదురుకావడం, ఇంతలో ప్రియుడు సమీర్‌ను మేఘ చంపేస్తుంది. మేఘ ఎందుకలా చేసింది? అనేదే మిగతా సినిమా కథ.

నటీనటులు

[మార్చు]
  • అప్సర రాణి
  • రాక్ కాచి

మూలాలు

[మార్చు]
  1. Zee News Telugu (30 July 2020). "థ్రిల్లర్ ట్రైలర్.. హాట్ సీన్లతోనే కథ!". Archived from the original on 4 May 2022. Retrieved 4 May 2022.
  2. Zee News Telugu (14 August 2020). "థ్రిల్లర్ మూవీ నేడే విడుదల.. టికెట్లు ఎలా బుక్ చేయాలంటే!". Archived from the original on 4 May 2022. Retrieved 4 May 2022.

బయటి లింకులు

[మార్చు]