దండపాణి దేశికర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎం.ఎం.దండపాణి దేశికర్
దండపాణి దేశికర్
జననం(1908-08-27)1908 ఆగస్టు 27
మద్రాసు ప్రెసిడెన్సీ, తిరుచెంగట్టన్‌గుడి
మరణం1972 జూన్ 26(1972-06-26) (వయసు 63)
వృత్తికర్ణాటక సంగీత విద్వాంసుడు, సినిమా నటుడు

ఎం.ఎం.దండపాణి దేశికర్ (ఆగష్టు 27, 1908 – జూన్ 26, 1972) ఒక కర్ణాటక సంగీత గాత్రవిద్యాంసుడు, స్వరకర్త.

విశేషాలు[మార్చు]

దండపాణి దేశికర్ మద్రాసు ప్రెసిడెన్సీలోని తిరుచెంగట్టన్‌గుడి గ్రామంలో 1908, ఆగష్టు 27న జన్మించాడు. ఇతడు తన సంగీతాన్ని, తేవరం స్తోత్రాలను తన తండ్రి ముత్తయ్య దేశికర్ వద్ద నేర్చుకున్నాడు. తరువాత ఇతడు మాణిక్య దేశికర్, సత్తయ్యప్ప నయనాకరర్, కుంభకోణం రాజమాణిక్యం పిళ్ళై వద్ద సంగీతంలో సంపూర్ణ శిక్షణను పొందాడు. ఇతడు తన మొదటి ప్రదర్శనను తిరుమరుగళ్‌లో ఇచ్చాడు. అన్నామలై విశ్వవిద్యాలయం సంగీత విభాగంలో ఇతడు 15 సంవత్సరాలు ప్రొఫెసర్‌గా పనిచేశాడు.

ఇతడికి "ఇసై అరసు", "పందిసై పులవర్ కోనె", "తేవర మణి", "సంగీత సాహిత్య శిరోమణి","సంగీత కళా శిఖామణి" "తిరుమురై కళానిధి", "తందక వెందు", "పన్నిసై వెంధం", "ఇసై పులవర్", "కళైమామణి", "ఇసై పేరిరజ్ఱర్" మొదలైన బిరుదులు ఉన్నాయి.

సినిమాలు[మార్చు]

ఇతడు 1935 నాటి సంసార నౌక అనే కన్నడ సినిమాలో ఒక తమిళ పాటను పాడాడు. ఇతడు ఆరు తమిళ సినిమాలలో ముఖ్య పాత్రలను ధరించాడు.

సినిమా విడుదలైన సంవత్సరం పాత్ర దర్శకుడు నిర్మాత వివరాలు
పట్టినాథర్ 1936 పట్టినాథర్ ఇది పట్టినాథర్ అనే సన్యాసి జీవిత కథ.
వల్లాల మహారాజ 1938 వల్లాల మహారాజు
తాయుమనవర్ 1938 తాయుమనవర్ టి.ఆర్.సుందరం టి.ఆర్.సుందరం తాయుమనవర్ జీవిత కథ
మాణిక్య వాచకర్ 1939 మాణిక్య వాచకర్ టి.ఆర్.సుందరం వి.ఎస్.ఎం.గోపాలకృష్ణ అయ్యర్ మాణిక్య వాచకర్ జీవిత కథ
నందనార్ 1942 నందనార్ మురుగదాస ఎస్.ఎస్.వాసన్ ఇది హరిజన భక్తుడు నందనార్ కథ.
తిరుమలిసై ఆళ్వార్ 1948

మూలాలు[మార్చు]

  • Rangan, Baradwaj (19 March 2016). "A musical bridge across eras". The Hindu. Kasturi & Sons. Retrieved 29 July 2018.

బయటి లింకులు[మార్చు]