దగదుషేత్ హల్వాయి వినాయక దేవాలయం
Dagadusheth Halwai Ganapati Temple | |
---|---|
స్థానం | |
దేశం: | India |
రాష్ట్రం: | Maharashtra |
జిల్లా: | Pune district |
ప్రదేశం: | Pune City |
భౌగోళికాంశాలు: | 18°30′59″N 73°51′22″E / 18.51639°N 73.85611°E |
చరిత్ర | |
దేవాలయ బోర్డు: | శ్రీమంత్ దగదుశేత్ హల్వాయి గణపతి ట్రస్ట్ |
వెబ్‌సైటు: | దేవాలయ వెబ్సైటు |
దగదుషేత్ హల్వాయి వినాయక దేవాలయం, మహారాష్ట్రలోని పూణేలో ఉన్న వినాయకుడి దేవాలయం. ప్రతి సంవత్సరం ఈ దేవాలయాన్ని దాదాపు లక్షమంది యాత్రికులు సందర్శిస్తుంటారు.[1] దేవాలయ భక్తులలో ప్రముఖులు, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు పది రోజుల గణేషోత్సవ పండుగ సందర్భంగా సందర్శిస్తారు.[2] ప్రధాన వినాయక విగ్రహం ₹10 మిలియను (US$1,30,000)కు బీమా చేయబడింది.[3] 130 సంవత్సరాల పురాతనమైన ఈ దేవాలయం, 2017లో 125 సంవత్సరాల వేడకను జరుపుకుంది.[4]
దేవాలయ ట్రస్ట్
[మార్చు]శ్రీమంత్ దగదుశేత్ హల్వాయి గణపతి ట్రస్ట్ విరాళాల ద్వారా వచ్చినదానితో దాతృత్వ కార్యక్రమాలను నిర్వహిస్తుంది.[5] ట్రస్ట్ పూణేలోని కోంద్వాలో పితశ్రీ అనే వృద్ధాశ్రమాన్ని కూడా నిర్వహిస్తోంది. ₹15 మిలియను (US$1,90,000) వ్యయంతో నిర్మించబడిన ఇల్లు 2003 మే నెలలో ప్రారంభించబడింది.[6] అదే భవనంలో ట్రస్ట్ 400 మంది నిరుపేద పిల్లలకు వసతితోపాటు విద్యను అందిస్తుంది.[5] పూణే జిల్లాలోని గిరిజన ప్రాంతాలలో పేదలకోసం క్లినిక్‌లను కూడా అందిస్తోంది.[7]
ఈ దేవాలయంలో వినాయక చవితి, వినాయక జయంతి మొదలైన పండుగలు జరుగుతాయి.
కోవిడ్-19లో కేసుల సంఖ్య పెరగడంతో భక్తులు, ఉద్యోగుల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం దేవాలయాల్లో ఆంక్షలు ప్రవేశపెట్టింది. 2021 ఏప్రిల్ 9 వరకు మూసివేయబడింది.[8] 2021 అక్టోబరులో తిరిగి తెరవబడింది.[9]
మూలాలు
[మార్చు]- ↑ Zore, Prasanna D (1997). "Pune's Dagedu Sheth Halwai dresses up for Ganeshotsva". Rediff. Retrieved 4 December 2008.
- ↑ Rabade, Parag (9 July 2007). "Pune leads the community". Deccan Herald. Archived from the original on 21 November 2008. Retrieved 4 December 2008.
- ↑ "Ganesh clears obstacles for women reciting Atharvasheersha". Hindustan Times. 4 September 2008. Archived from the original on 31 May 2012. Retrieved 5 December 2008.
- ↑ "Dagdusheth Ganpati" (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 25 November 2002.
- ↑ 5.0 5.1 Damle, Manjiri (6 July 2006). "Topper has 'mandal' effect to thank for". Times of India. Retrieved 4 December 2008.
- ↑ "CM to inaugurate charitable old-age home on Sunday". Times of India. 24 May 2003. Retrieved 4 December 2008.
- ↑ "Social activities". Dagadusheth Ganapati Trust. Archived from the original on 5 April 2010. Retrieved 4 December 2008.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ "Religious places to remain shut as COVID-19 restrictions tightened in Pune".
{{cite news}}
: CS1 maint: url-status (link) - ↑ Banerjee, Shoumojit (2021-10-07). "COVID-19: Religious places in Maharashtra open doors after more than a year". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2021-10-08.