దత్త ముక్తి క్షేత్రం
శ్రీ దత్త ముక్త్రి క్షేత్రం, రాజమండ్రి, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రం గోదావరి నదీ తీరంలో గౌతమీ ఘాట్ లో ఉంది. ఈ క్షేత్రంలో శ్రీ గణపతి ప్రతిష్ఠ, శ్రీ దత్తత్రేయ ప్రతిష్ఠ, మరకత దత్త పాదుకా ప్రతిష్ఠ, కుంభాభిషేకము శ్రీ శ్రీ శ్రీ గణపతి సఛ్ఛిదానంద స్వామీజీ వారు 2008 వ సంవత్సరము జనవరి మాసము 19, 20వ తేదీలలో నిర్వహించారు.
ఈ క్షేత్ర ప్రతిష్ట ఉద్దేశ్యము
[మార్చు]శ్రీ దత్త ముక్తి క్షేత్ర ప్రతిష్ఠ ప్రదానోద్దేసం భక్తులందరూ కర్మలు నాశనము చేసుకొనుటకు వీలుగా, శివ కేశ వులకు భేదము లేదని సదా శివ స్పటిక లింగము, బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్వరూపుడైన ఆది గురుమూర్తి శ్రీ దత్తాత్రేయుని శ్రీ దత్త ముక్తీస్వరునిగా ఇద్దరినీ మూలా వీరట్లుగా ఒక గర్భ గుడిలోను, సర్వ విగ్నములు తోలిగించుటకు ఏక దంత గణపతిని, నిర్గుణ మరకత దత్త పదుక్లులను ప్రతిష్ఠించడం అయినది. పిత్రు దేవతలనకు ప్రీతి కరమైన ఆమావాస్య తిధిని ఈ క్షేత్ర ప్రధాన పర్వదినముగా చేయడమినది. ఆ రోజునీ శ్రీ దత్త ముక్తీస్వరునికి ఎకదాస వార క్షీర రుద్రా అబిషేకం, భోగము జరుగును. మిగిలిన అన్ని రోజులలో ఏక దంత గణపతికి సదా శివునకు అబిషేకంలు అర్చనలు భోగమ సమర్పణ జరుగును. కేవలం దత్త ముక్తీస్వరునికి బియ్యం నివేదన జరుగును. ఈ క్షేత్రములో అమావాస్య రోజున చేసీ అన్నదానము విశేషమైన ఫలితమునిచును.[1]
ఈ క్షేత్ర ప్రశస్తి
[మార్చు]
ఇహాంధ్రదేశ మండనే పవిత్ర గౌతమీ తటే
మహర్షి గౌతమస్య వై తపస్థలే వరీయసి|
ప్రశస్త సర్వ జిత్యతో సహస్య మాసి మంగళే
సితార్థమాసగే శుభే త్రయోదశీ దినే ధ్రువమ్||
శివేన చైకి దంతినా సహ ప్రతిష్ఠితో రయిం
స సత్తదేవ ఇష్టదః స్తనోతు సచ్చిదాత్మికామ్|
అశేష పాప సంచయాత్ భవైక పాప సంకూలాత్
నిజాశ్రితాంశ్చ తత్పితౄన్ విమోచయే దిహాగతాన్||
- తాత్పర్యము
ఆంధ్ర ప్రదేశ్ కే అలంకారమైన పవిత్ర గోదావరీ తీరమందు గౌతమ మహర్షి తపస్థలమైన ఈ శ్రేష్ఠ ప్రదేశములో స్వస్తిశ్రీ సర్వజిత్ సంవత్సర పుష్య శుద్ధ త్రయోదశి నాడు సదాశివ-ఏకదంత గణపతి సమేతుడైన శ్రీ దత్తాత్రేయ స్వామి యొక్క ప్రతిష్ఠ జరిగింది. ఈ దత్త స్వామి మన కోరికలను తీరుస్తూ సచ్చిదానందమనే శాశ్వత సంపద నిచ్చుగాక.
సూచికలు
[మార్చు]- ↑ "దత్త ముక్తి క్షేత్ర విశేషాలు". Archived from the original on 2016-02-21. Retrieved 2013-08-17.