దమ్మలి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

దమ్మలి : ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన కులాల జాబితా బీసీ-ఏ గ్రూప్‌ లోని 22వ కులం. పెద్దమ్మవాళ్ళు, దేవరవాళ్ళు, ఎల్లమ్మవాళ్ళు, ముత్యాలమ్మవాళ్ళు, దమ్మలి, దమ్మల, దమ్ముల, దామల, పెద్దమ్మలవాండ్లు అనే పేర్లతో కూడా పిలుస్తారు. ఈ కులానికి సంబంధించిన కులధృవీకరణ పత్రాలను గతంలో శ్రీకాకుళం జిల్లాలో మాత్రమే ఇచ్చేవారు ఇకపై అన్ని జిల్లాల్లో ఇస్తారు.

సంస్కృతి, వేషధారణ[మార్చు]

భయంకరమైన డప్పుల శబ్ధంతో చెళ్లు చెళ్లున కొరడాలతో కొట్టుకుంటూ తిరిగే మనుషులు. ఓ విచిత్రమైన భయానక వాతావరణాన్ని సృష్టించి యాచన చేసే వీరిని పెద్దమ్మలవాండ్లు అంటారు. మన సమాజం నాగరికంగా ఎంత ఎదిగినా వీరు మాత్రం నేటికీ అనాగరికంగా బతకడం వ్యవస్థలోని లోపానికి అద్దం పడుతోంది. లక్షా యాభై వేల జనాభా ఉంది. పెద్దమ్మలవాండ్ల వేషధారణ, యాచించే విధానం విచిత్రంగా ఉంటే, వారి హావభావాలు భయభ్రాంతులను చేస్తా యి. ఇక వారి వాయిద్య రొద కర్ణకఠోరంగా ఉంటుంది. కనుకనే చాలా మంది వీరిని తమ గుమ్మం ముందు నుంచి సాగనంపేందుకు ఎంతోకొంత ధర్మం చేసి పంపిం చేయాలనుకుంటారు. మగవారు నిక్కరు, టీషర్టు వేసు కుని కొరడాతో ఛళ్లున చరుచుకుంటూ గడపగడపకూ తిరుగుతుంటాడు. భిక్ష వేయటం ఆలస్యమైతే కత్తితో తమ చేతికి గాయం చేసుకుంటారు. ఇలా తమని తాము హింసించుకుంటూ నాలుగు డబ్బులు సంపాదించడానికి ఈ కులంలోని పురుషులు తిరుగుతుంటే, వారి వెనకాల డోలు వాయిస్తూ బిక్షాటనలో పాలుపంచుకుంటారు మహిళలు. ఇదే కులంలోని కొందరు మహిళలు పెద్దమ్మతల్లి బొమ్మను నెత్తిన పెట్టుకునో, పాలుతాగే బిడ్డను చేటలో పెట్టుకునో అడుక్కుంటారు. రకరకాల వేషధారణలతో వీరు మనకు కనిపిస్తారు.

సామాజిక జీవనం, వృత్తి[మార్చు]

సహజంగా వీరిని చూసి ప్రజలు భయపడతారు. వాస్తవానికి వీరికే ప్రజలను చూస్తే భయం. వీరి నివాస ప్రాంతానికి ఎవరు వెళ్లినా వారేం చేస్తారోననే భయంతో నోరు మెదపటాకిని కూడా ఇష్టపడరు. యాచక వృత్తికి వెళ్లని రోజున వేటకు వెళ్లి సమీన అడవులలో చిన్న చిన్న జంతువులను వేటాడతారు. పట్టణాలలోని పిల్లులు, ఉడతలను పట్టుకుని కాల్చుకు తింటారు. ఆధునిక సమాజంలో తీవ్రమార్పులు వచ్చినప్పటికీ వీరిలో ఇంకా అనాగరిక లక్షణాలే ఎక్కువ. పెద్దమ్మలవాండ్లలో బాల్య వివాహాలు ఎక్కువ. కుటుంబ నియంత్రణ పాటించరు. బహు భార్యత్వం కూడా అమలు జరుగుతోంది. నేటికీ వీరు గ్రామాలకి దూరంగా బతుకుతున్నారు. మిగతా యాచకవృత్తుల వారితో పోల్చుకుంటే వీరి సం పాదన ఎక్కువే. రోజుకు నాలుగు కేజీల బియ్యం, రెండు వంద రూపాయలకు పైగా చిల్లరడబ్బులు చేతికందు తాయి. అయినా తిండితినరు. దాచుకున్న సొమ్మంతా దాచి ఎవరికో ఒకరికి ఇచ్చి మొత్తం పోగొట్టుకుంటారు. ప్రజల్లో దానగుణం తగ్గిందంటారు పెద్దమ్మలవాళ్లు. కనుకనే ఈ వృత్తికి స్వస్తి పలికేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గ్రామీణ ప్రాంతాలలో బతకలేక పట్టణాలకు వలస వస్తున్నారు. హైదరాబాదు‌ లో జి.హెచ్‌.ఎం.సి. చెత్తబండ్లు లాగే పనిలో వీరు ఎక్కువగా కనిపిస్తారు. పెద్దమ్మలవాండ్లు జీవితంలో మార్పు వచ్చింది. యాచక వృత్తి నుంచి గాడిద పాల వ్యాపారులుగా మారారు. దగ్గు, ఉబ్బసం వంటి వ్యాధులకు గురైన పిల్లలకు గాడిదపాలు పట్టించేవారి సంఖ్య పెరిగింది. చర్మవ్యాధుల నుండి రక్షణకు కూడా పెద్దలు ఈ పాలు తాగుతున్నారు. ఈ డిమాండ్‌ని దృష్టిలో పెట్టుకొని హైదరాబాదు‌కు వీరు గాడిదలను తోలుకువచ్చి, కావాల్సిన వ్యక్తి ఎదురుగా గాడిదపాలు పిండి ఇస్తారు. జండూబామ్‌ సీసా సైజ్‌ పాల ఖరీదు పది రూపాయల వంతున హైదరాబాదు‌లో అమ్మితే, ఇతర ప్రాంతాలలో ఐదు రూపాయలకే అమ్ముతారు. గాడిద మాంసానికి కూడా గిరాకీ పెరిగింది. పలు వ్యాధులు తగ్గుతాయనే నమ్మకం ప్రజల్లో ఉండటంతో కిలో 80 రూపాయలకు అమ్ముడుపోతోంది.

మూలాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=దమ్మలి&oldid=2951346" నుండి వెలికితీశారు