దయాల్‌దాస్ బాఘేల్
దయాల్‌దాస్ బాఘేల్ | |||
| |||
సహకార శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 22 మే 2015 – 11 డిసెంబర్ 2018 | |||
ముందు | పున్నూలాల్ మోల్ | ||
---|---|---|---|
తరువాత | ప్రేమ్ సాయి సింగ్ టేకం | ||
పర్యాటక & సాంస్కృతిక శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 22 మే 2015 – 11 డిసెంబర్ 2018 | |||
ముందు | అజయ్ చంద్రకర్ | ||
తరువాత | తామ్రధ్వాజ్ సాహు (పర్యాటక) మర్జీత్ భగత్(సాంస్కృతిక) | ||
ఎమ్మెల్యే
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 3 డిసెంబర్ 2023 | |||
ముందు | గురుదయాళ్ సింగ్ బంజరే | ||
నియోజకవర్గం | నవగఢ్ | ||
పదవీ కాలం 2008 – 2018 | |||
ముందు | నియోజకవర్గం ఏర్పాటు చేశారు | ||
తరువాత | గురుదయాళ్ సింగ్ బంజరే | ||
నియోజకవర్గం | నవగఢ్ | ||
పదవీ కాలం 2003 – 2008 | |||
ముందు | దేర్హు ప్రసాద్ ధృత్లహ్రే | ||
తరువాత | నియోజకవర్గం రద్దు చేయబడింది | ||
నియోజకవర్గం | మరో | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | కున్వార, నవగఢ్, దుర్గ్ జిల్లా, మధ్యప్రదేశ్ (ప్రస్తుతం బెమెతర జిల్లా, చత్తీస్‌గఢ్) | 1954 జూలై 1||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
జీవిత భాగస్వామి | అమలా బాగెల్ | ||
సంతానం | 2 కుమారులు & 4 కుమార్తెలు | ||
నివాసం | రాయ్‌పూర్ | ||
పూర్వ విద్యార్థి | పదవ తరగతి | ||
మూలం | https://cgvidhansabha.gov.in/sadasya%20parichay_2008/dayaldas%20baghel.pdf |
దయాల్‌దాస్ బాఘేల్ ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన నాలుగుసార్లు నవగఢ్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి, 2023 డిసెంబరు 22న విష్ణు దేవ్ సాయ్ మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణస్వీకారం చేశాడు.[1]
వ్యక్తిగత జీవితం
[మార్చు]దయాల్‌దాస్ బాఘేల్ బెమెతరా జిల్లా, కుంరా గ్రామంలో 1954 జూలై 1న జన్మించాడు. ఆయన అమలను వివాహమాడాడు. వారికీ ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు.
రాజకీయ జీవితం
[మార్చు]దయాల్‌దాస్ బాఘేల్ కుంరా గ్రామ సర్పంచ్ గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన ఆ తరువాత 2003లో నవగఢ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. దయాల్‌దాస్ బాఘేల్ ఆ తర్వాత 2008, 2013లో వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికై 2008లో షెడ్యూల్డ్ క్యాస్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ వైస్ చైర్మన్‌గా, రమణ్ సింగ్ మంత్రివర్గంలో వాణిజ్యం, పరిశ్రమలు, సహకార సంస్కృతి, పర్యాటక శాఖల మంత్రిగా పనిచేశాడు.[2]
దయాల్‌దాస్ బాఘేల్ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గురు రుద్ర కుమార్‌పై గెలిచి 2023 డిసెంబరు 22న విష్ణు దేవ్ సాయ్ మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణస్వీకారం చేశాడు.[3][4]
మూలాలు
[మార్చు]- ↑ The Hindu (22 December 2023). "Chhattisgarh Cabinet expansion: Nine BJP MLAs sworn in as Ministers". Archived from the original on 23 December 2023. Retrieved 23 December 2023.
- ↑ The Economic Times (22 May 2015). "3 new ministers inducted in Chhattisgarh cabinet expansion". Archived from the original on 29 December 2023. Retrieved 29 December 2023.
- ↑ The New Indian Express (22 December 2023). "Chhattisgarh cabinet expansion: Nine BJP MLAs sworn in as ministers". Archived from the original on 29 December 2023. Retrieved 29 December 2023.
- ↑ India Today (4 January 2024). "Chhattisgarh Chief Minister allocates portfolios, ex-IAS O P Choudhary gets finance". Archived from the original on 4 January 2024. Retrieved 4 January 2024.