దరువూరి వీరయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దరువూరి వీరయ్య

దరువూరి వీరయ్య బహుముఖ ప్రజ్ఞాశాలి, గాంధేయవాది, స్వాతంత్య్ర సమర యోధుడు, రచయిత, సంపాదకుడు, కర్షకోద్యమ నిర్మాత. గుంటూరు జిల్లా, ముప్పాళ్ళ మండలం, ఇరుకుపాలెంలో 1917 జూలై 17న జన్మించాడు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ తరఫున వెలువడిన కాంగ్రెస్ సేవాదళ్ అనే మాసపత్రికకు సంపాదకత్వం వహించాడు. అనేక సంవత్సరాలు గుంటూరు జిల్లా కాంగ్రెస్ ప్రచార, ప్రచురణల విభాగం కార్యదర్శిగా ఉన్నాడు. యువకర్షక ప్రచురణలు అనే సంస్థను ఏర్పరచి అనేక గ్రంథాలను ప్రచురించాడు.

రచనలు[మార్చు]

  1. శ్రామికజన బాంధవుడు - సర్దార్ గౌతు లచ్చన్న
  2. ఆచార్య రంగా జీవిత చరిత్ర
  3. గుంటూరు మండల సర్వస్వం[1] (సంపాదకత్వం)
  4. ఆచార్య రంగా ఉపన్యాసాలు

మూలాలు[మార్చు]