దర్భా వెంకట కృష్ణమూర్తి
దర్భా వెంకట కృష్ణమూర్తి | |
---|---|
జననం | బృందావనం, కృష్ణా జిల్లా | 1902 అక్టోబరు 9
సుపరిచితుడు/ సుపరిచితురాలు | రచయిత |
తల్లిదండ్రులు |
|
దర్భా వెంకట కృష్ణమూర్తి తెలుగు రచయిత.
జననం, విద్య
[మార్చు]ఇతడు 1902 అక్టోబరు 9న కృష్ణా జిల్లా, బృందావనం గ్రామంలో జన్మించాడు, తల్లి వేంకటసుబ్బమ్మ, తండ్రి గంగాధరశాస్త్రి. బృందావనంలో 8 సంవత్సరాలు సాహిత్యచక్రవర్తి దుర్గానాగేశ్వరశాస్త్రి వద్ద సంస్కృత వ్యాకరణం, తర్కవేదాంతలు చదివాడు.
వృత్తిజీవితం
[మార్చు]బందరు నోబుల్ కళాశాలలో డిగ్రీ పట్టా సాధించాడు. 1927-44 మధ్య మదనపల్లి కళాశాలలో ప్రాచ్యభాషల శాఖకు హెడ్ గా ఉన్నాడు. 1944 లో నెల్లూరు వీ.ఆర్. కళాశాలలో తెలుగు హెడ్ గా చేరి 1963 లో పదవీ విరమణ చేశాడు. ఇతను కొద్దికాలం నెల్లూరు జిల్లా వ్యక్తులు నిర్మించిన ఒక తెలుగు సినిమాకు రచన చేశాడు, సినిమా విజయవంతం కాలేదు.
రచనలు
[మార్చు]ఇతని ముద్రిత గ్రంథాలు
[మార్చు]1. శ్రీ వేంకటేశ్వర శతకం, 2. గురుదక్షిణ, 3.శుకనాశోపదేశం,4. విషాద తిమ్మరుసు, 5. నయప్రదీప విమర్శనము 6. శ్రీ బలిజేపల్లి నాటక కవిత్వ తత్వము.
అముద్రిత రచనలు
[మార్చు]1. భక్త మార్కండేయ (నాటకం) 2. సతీ అహల్య 3. విషాద తిమ్మరుసు, 4. శ్రీ కృష్ణ రాయబారము 5. నలదమయంతులు 7. శ్రీ నీలకంఠ విజయం (చంపు కావ్యం), 8. ప్రాస్తావికము, 9. ఉపమావళి, 10. ప్రశ్నోత్తర మాల 11. గంగాధర శతకం, 12. మానస బోధ శతకము, 13. నాటక పరిభాషెందు శేఖరము, పోతన కవిత్వ తత్వము.
మూలాలు
[మార్చు]- 1. దర్భా వెంకట కృష్ణమూర్తి ముద్రిత రచనలు,
- 2. విక్రమసింహపురి మండల సర్వస్వం, నెల్లూరు జిల్లా పరిషద్ ప్రచురణ, 1964.