దస్త్రం:Vyasam.jpg

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అసలు దస్త్రం(933 × 1,128 పిక్సెళ్ళు, ఫైలు పరిమాణం: 309 KB, MIME రకం: image/jpeg)

తెలంగాణ భాషా వారసత్వ కథా వారధి[1][మార్చు]

“జీవధ్భాష జీవనదిలాంటిది.జీవనది తన ప్రవాహంలో చిన్నచిన్న పిల్లకాలువలను కలుపుకుని జీవనదిగా గామిస్తుంది.అలాగే జీవధ్భాష కూడా ఇతరభాషా పదాలను సమూచితంగా తనలో కలిపేసుకుంటూ తన జీవలక్షణాలను కాపాడుకొంటూ ఉండాలి. ఏ భాషకైనా మార్పు సర్వసాధారణం” - రవీంద్రనాథ్ ఠాగూర్ తెలంగాణ కథల్లో జీవద్భాష వైవిధ్యం గొప్పది.కథాసాహిత్య వారసత్వం ప్రాచీనమైనది. తెలుగు కథ పుట్టుకకు వందని, వెయ్యేండ్లని తీర్మానించడం సబబు కాదు. ఆదిమకాలంనుండే తెలుగు కథ మనుగడలో ఉంది.మానవ నాగరికతకు ముందే,మాట పుట్టాక మానవసంబంధాలలో భాగంగా కథపుట్టింది. వేదాలకంటే ముందే ఆదిమ అస్థిత్వ కులపురాణం జాంబవపురాణం రూపంలో కథపుట్టుక తెలంగాణలో ఉంది.ఇది సబ్బండజాతుల సమాహారంగా వర్ధిల్లిన సాహిత్యం. గ్రీకు పురాణగాధలుగా హెల్లన్ చెప్పినట్టు, తెలంగాణాలో ఒక్కొక్క కులానికి ఒక్కో కులపురాణగాధ ఉంది.అవి చిన్నచిన్న కథలుగా ఉన్నాయి.వీటిని ఆశ్రితకులాలగాయకులు ఆయా జాతుల కులగాధలు, వాళ్ళ యుద్దాలు, పోరాటాలు,జీవన సంఘర్షణలకు ప్రతిబింబంగా కథలుగా చెప్పారు.అవి “విభిన్నశైలీ అల్లికతో వారసత్వం”గా ఈనాటికి ప్రజల నాలుకలపై మౌఖికంగా సజీవంగా ఉన్నాయి. ముచుకుందానదీ పరివాహప్రాంతం అచ్చమైన తెలంగాణ తెలుగుభాషానుడికారానికి,జీవద్భాష వైవిధ్యానికి, సాహిత్య వైభవానికి ముఖ్యమైన చిరునామా. కేంపుచెరువు(మూసిప్రాజెక్టు) కేంద్రంగా శీలం భద్రయ్య రాసిన “లొట్టపీసుపూలు” కథాసంపుటిలో అట్టి జీవద్భాషావారసత్వంను,వైవిధ్యాన్ని అందిపుచ్చుకున్నాయి.ఈ కథలద్వారా నల్గొండజిల్లా భాషానుడికారాన్ని,మూసి కథావైభవాన్ని తెలంగాణ పాఠకలోకానికి కానుకగా ఇచ్చాడు. “లొట్టపీసుపూలు” శీర్షికలోనే నిగూఢ అంతరార్ధం దాగుంది. తెలంగాణ మట్టిమీద పూలను కొలిచే సాంప్రదాయమున్నానిరాదరణకుగురైన పూలెన్నో ఉన్నాయి. సాహితీవేత్తలు సైతం విస్మరించిన పూలల్లో ఒకటి లొట్టపీసుపూలు. వీటికి కావ్యగౌరవం కల్పించడం ద్వారా రచయిత గౌరవం రెండింతలైంది. ఈ పుస్తకంలో ఉన్న పదిహేనుకథలలో ఇతివృత్తం,వస్తువు,నేపధ్యం విభిన్నంగా ఉన్నాయి.కథలలో సాధారణ పాఠకునికి ఆసక్తికరమైన కథనం ఉంటుంది.విమర్శకునికి విస్తృతచర్చకు అవకాశం ఉంటుంది.కథలు పాత కాలానివి.కథనం కొత్తది.వాడిన భాష మధురమైనది,సహజమైనది.ప్రతికథలో నాటికాలానికి చెందిన పాత్రల బానిసత్వపు సంకెల్లున్నాయి.అవి తెంచుకోడానికెత్తిన పురుటినొప్పుల పిడికిళ్ళున్నాయి.పాత్రల గొప్పతనాన్ని అల్లడంలో రచయిత తన లోకజ్ఞానాన్ని వినియోగించి కథలను అందించాడు. కథలు ఎలారాయాలనే సందేహానికి సమాధానంగా “అందొచ్చిన చేయికి పొందిక కుదిరినట్టు” ఈతరం కథకులుగా శీలం భద్రయ్య నిలబడతాడు. “ఇసపురుగు కథలో తక్కువ జాతిమహిళలపై గ్రామాల్లో ఆకృత్యాలకు ఒడికట్టినపుడు వాటిని తెలివిగా ఎలా తిప్పికొట్టారో ఉంటుంది. కేంపుచెర్వు కథలో ముంపుబాధితులుగా సబ్బండ వర్గాల ఆర్తనాదాలు, దొరతనం ఆకృత్యం ఇతివృత్తంతో ఉంటుంది.బంచెర్రాయి కథలో తెలంగాణమట్టిలో రజాకార్ల ఆకృత్యాలకు బలయిన గొడ్డు గోదా,రాజిరెడ్డి తిరుగుబాటు కనబడుతుంది.కర్తవ్యం కథలో కాలువకిందికి పోయి ప్రాణాలు పోగొట్టుకున్న రాముడు తల్లిదండ్రుల ఆత్మఘోష వినబడుతుంది.లొట్టపీసుపూలు కథలో గిరిజనుడు శివుడుపై పడిన హత్యానేరానికి,అతని గుడిసె తగలబెట్టడం,కేసులపాలు చేయడం కన్నీరు తెప్పిస్తుంది.టముకుకథలో చేయనితప్పుకు వీరారెడ్డి చేతులలో చావుదెబ్బలుతిన్న మంగలి సర్వయ్యలాంటి వాళ్ళు ఊరొదిలిపెట్టి పోవడం సమాజంలో కనబడే దృశ్యాలు సహజంగా కన్పిస్తాయి.కాటికాపరి కులానికి చెందిన ఆనందరావు బాల్యంలో చదువుకోసంపడిన ఆరాటం వెలుగుచుక్కకథ ద్వారా తెలుస్తుంది. ప్రపంచీకరణ ఫలితంగాచెప్పుల కార్కానా మూతపడి వృద్దాప్యంలో వైద్యం లభించక విజయమ్మ,రామలింగంలు బతుకుదెరువుతోబాటు ప్రాణాలు పోగొట్టుకొంటారు.కోదండం కథలో రజాకార్లకు ఎదురునిలబడ్డ అణగారినవర్గాలకు చెందిన మహిళలు అక్కమ్మ,సాయమ్మలు,వారి పిల్లలు అంజయ్య నాటి తరం తిరుగుబాటుకు ప్రతినిధులు. కొత్తదొరలో దొరపోయినా దొరతనంకోటను ఇడిచిపెట్టకుండా పెంటయ్యనాయకునిలా రూపం మార్చుకోవడం అనేది ఇతివృత్తం.కొత్తదొర అధిక్షేపక ఉత్తమకథ.కోటగోడపై చనిపోయిన గబ్బిలం చైతన్యం కోల్పోయిన అణగారినవర్గాల ప్రతీక. “లత్త కథ”లో లింగమ్మ తలమీదున్న ఎగనాకుడు దరిద్రమనే అపోహను ఈనాటికి అక్కడక్కడ సమాజంలో ఉన్న మూడవిశ్వాసాన్ని కళ్ళకు కట్టారు. మాయబారి కథలో రజాకార్లను ఎదురొడ్డి గెలిచిన అన్నదమ్ములు ముత్తయ్య,పెదీరన్నలు.పుట్టిన గడ్డకు స్వాతంత్ర్యం సాధించడం ద్వారా కన్నతల్లికి,కన్న భూమికి మాయబారి చెల్లించారు.కరోనా నేపధ్యంలో రాసిన అగ్గువబతుకులుకథలో మేకలు కాసే రాములు,రాములమ్మ బతుకులు ఈకాలంలో ఎంత అగ్గువగా మారాయో చెప్పాడు. పరువుహత్య నేపధ్యంగా విధికి బలైన ప్రణయ్ లాంటి యువకుల జీవితాలు అగ్రవర్ణ దురహంకారంలో ఖూనీ కావడం హృద్యంగా మలిచాడు.శూర్పణఖ కథలో మీనాక్షి పాత్రపై సానుభూతి కలిగించేదిగా, ప్రేమకు అడ్డు పేదరికం నిలవడం కొత్తగా పురాణపాత్రలతో పోలిక చేసి కొత్తప్రయోగం చేశాడు.ఇలా కథల్లో వస్తువు నవ్యతతో ప్రతికథ వైవిధ్యంగా ఉంది. లొట్టపీసుపూలు రచయిత చిన్నకథల నుండి పెద్దకథల వరకు,నాటి నుండి నేటి వరకు అర్ధవంతంగా రాశాడు. యావత్ తెలంగాణ మెచ్చుకోదగ్గ “కథా శైలీరహో” అనేవిదంగా శైలీ అల్లిక వారసత్వంగా అందిపుచ్చుకుని, చేయితిరిగిన రచయితగా ఎదిగొచ్చిన శీలం భద్రయ్యను ప్రతిఒక్కరూ మరీమరీ మతిల తెలుసుకొని సాహితీ ఆలింగణం చేసుకోవలసిందే. ఇప్పటివరకు వస్తువునే శిల్పమని ఆంధ్రప్రాంత రచయితలు భావించారు. తెలంగాణలో కథ లేదని, భాష లేదని శిల్పంలేదని ఇంకా బుకాయించటం వందేండ్ల కథా తీర్మానం చెయ్యటం మూర్ఖత్వం. తెలంగాణ రాష్ట్రం సిద్దించినా ఇంకా అక్కడక్కడా ఆ సన్నాయి నొక్కులున్నాయి. సారవంతమైన సాహితీ సంపదను సాంస్కృతిక రూపాన్ని బలవంతంగా మార్చినారు. వీళ్ళను గల్లావట్టి బోనులో నిలబెట్టే తెలంగాణ కొత్తతరం రచయితల రంగప్రవేశం ఒక సంచలనం. శీలం భద్రయ్య “లొట్టపీసుపూలు” కథలు తెలంగాణ జీవద్భాష నిజానిర్దాణకు, అసలు సిసలు భాషానిర్మాణ నిరూపణకు ఒక సవాల్గా నిరూపిస్తాయి. తెలంగాణ భాషా వారసత్వ కథా వారధిగా సారధిగా నిలబెడుతాయి.శీలం భద్రయ్య తెలంగాణ భాషామట్టి కథలు వర్దిల్లు... కొత్తవస్తు శిల్పమై వర్దిల్లు దేశాన..

లొట్టపీసు పూలుతెలంగాణ కథలు
వేముల ఎల్లయ్య


                                                                                                                                                                                                         నల్గొండ

  1. "తెలంగాణ భాషా వారసత్వ కథా వారధి | దర్వాజ | www.NavaTelangana.com". NavaTelangana. Retrieved 2021-11-06.

సారాంశం

వివరణ
తెలుగు: లొట్టపీసు పూలు కథలపై వ్యాసం
తేదీ
మూలం స్వంత కృతి
కర్త రచయిత

లైసెన్సింగ్

నేను, ఈ కృతి యొక్క కాపీహక్కుదారుని, దీన్ని ఈ లైసెన్సు క్రింద ఇందుమూలముగా ప్రచురిస్తున్నాను:
w:en:Creative Commons
ఆపాదింపు share alike
This file is licensed under the Creative Commons Attribution-Share Alike 4.0 International license.
ఇలా చేసేందుకు మీకు స్వేచ్ఛ ఉంది:
  • పంచుకోడానికి – ఈ కృతిని కాపీ చేసుకోవచ్చు, పంపిణీ చేయవచ్చు, ప్రసారమూ చేయవచ్చు
  • రీమిక్స్ చేయడానికి – కృతిని అనుకరించడానికి
క్రింది షరతులకు లోబడి:
  • ఆపాదింపు – సముచితమైన శ్రేయస్సును ఇవ్వాలి, లైసెన్సుకు లింకు ఇవ్వాలి, మార్పులేమైనా చేస్తే వాటిని సూచించాలి. అందుకు సముచితమైన పద్ధతి దేన్నైనా అవలంబించవచ్చు. కానీ మీకూ మీ వాడుకకూ హక్కుదారు అనుమతించారు అనే అర్థం వచ్చేటట్లుగా మాత్రం కాదు.
  • share alike – మీరు ఈ కృతిని అనుకరిస్తే, మారిస్తే, లేదా మెరుగుపరిస్తే తత్ఫలిత కృతిని ఇదే లైసెన్సు లేదా దీనికి అనుగుణ్యమైన లైసెన్సు క్రింద మాత్రమే పంపిణీ చేయాలి.

Captions

Add a one-line explanation of what this file represents

Items portrayed in this file

చిత్రణ

copyright status ఇంగ్లీష్

copyrighted ఇంగ్లీష్

source of file ఇంగ్లీష్

original creation by uploader ఇంగ్లీష్

media type ఇంగ్లీష్

image/jpeg

ఫైలు చరితం

తేదీ/సమయం ను నొక్కి ఆ సమయాన ఫైలు ఎలా ఉండేదో చూడవచ్చు.

తేదీ/సమయంనఖచిత్రంకొలతలువాడుకరివ్యాఖ్య
ప్రస్తుత06:52, 6 నవంబరు 202106:52, 6 నవంబరు 2021 నాటి కూర్పు నఖచిత్రం933 × 1,128 (309 KB)రచయితCross-wiki upload from te.wikipedia.org

ఈ ఫైలును వాడుతున్న పేజీలు లేవు.

మెటాడేటా