ఐపోమియా కార్నియా
(లొట్టపీసు పూలు నుండి దారిమార్పు చెందింది)
ఐపొమియా కార్నియా అనేది జలాశయాల ఒడ్డున, తేమ ఉన్న ప్రాంతాల్లో విరివిగా పెరిగే ఔషద మొక్క. దీన్ని లొట్టపీసు చెట్లు అంటారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవి విస్తరించి ఉన్నాయి. ఇది ఉదయమే పుష్పించడం చేత దీనిని ఆంగ్లంలో మార్నింగ్ గ్లోరి (ఉదయపు గులాబి) అని అంటారు. ఈ మొక్క కాండం బోలుగా ఉంటుంది. దీని ఆకులు, కాండం తెల్లని నూగు వంటి పూతను, లోపల పాల వంటి లేటెక్స్ ను కలిగి ఉంటుంది.
Ipomia carnea | |
---|---|
Leaves of Ipomoea carnea plant | |
దస్త్రం:FLOWERS OF IPOMEA | |
Flower siimai oonan | |
Scientific classification | |
Kingdom: | Plantae
|
(unranked): | Angiosperms
|
(unranked): | Udicats
|
Order: | |
Family: | |
Genus: | |
Species: | Carnea
|
వర్గీకరణ
[మార్చు]- కింగ్ డమ్ -ప్లాంటే
- ఆర్దెర్ - సొలానం
- పాంమీలి -కాన్ వాల్వ్ లేసి
- జీనస్ -ఇపొమియా
- స్పిసియస్ - కార్నియా
వివరణ
[మార్చు]- ఇపొమియ కార్నియా గులాబి ఉదయం కీర్తి.ఇది పుష్పించే మొక్క.
- , దీని ఆకులు 6-9 అంగుళాలు పొడవు కలిగి గుండే ఆకారంలో వుంటాయి.
- ఇది సులభంగా విషాన్నీ కలిగిన విత్తనాలు నుండి పెరిగిన మొక్క.ఇది పశువులకు ప్రమాదకరంగా ఉంటుంది.
- ఇపొమియా కార్నియా అనే మొక్క ఆకులు, సెలినీయం జాతులు ఎక్కువగా విత్తనాలకు సంబంధించింది.
- ఇవి బైఆక్యులేషన్ సలేనీయం స్పిసియస్ ఆకులు ఎక్కువగా విత్తనాల వలే ఉంటాయి.
- ఇపొమియా కార్నియాకి ఇంకొక ఫేరు బష్ మార్నింగ్ గ్లోరి.దీని ఉష్ణోగ్రత పరిస్థితులకనుకూలంగా ఉంటుంది.
ఉపయోగాలు
[మార్చు]ఇపొమియా కార్నియా కాండాన్ని కాగితం తయారీకి ఉపయోగిస్తారు. ఈ మొక్కలు ఔషధ విలువలను కలిగి ఉంటాయి. ఇది బోలు పొగాకు చుట్టలు తయారుచేసేందుకు ఉపయోగిస్తారు.
తెలంగాణలో అనేకపేరు
[మార్చు]తెలంగాణాలో దీనికి అనేక పేర్లు ఉన్నాయి. అవి:
క్ర.సం | జిల్లా | వ్యవహారం |
1. | నల్లగొండ, యాదాద్రి, సూర్యాపేట | లొట్టపీసు పూలు |
2. | కరీంనగర్, జనగామ | పిచ్చి పూలు, పాలసముద్రం పూలు |
3. | జగిత్యాల, మెట్టుపల్లి | పాలసముద్రం పూలు, పిచ్చి చెట్లు |
4. | సిద్ధిపేట | లొట్టపీసుపూలు, తూటు పూలు, రబ్బరు పూలు |
5. | ఖమ్మం | తూటి బరిగె, పిచ్చి బరిగె |
6. | మహబూబాబాద్ | సలీంద్ర పూలు |
7. | వరంగల్ | రబ్బరు పూలు/ లబ్బరి పూలు, గడ్డ గరుగుడు పూలు |
8. | పాలమూరు | లొట్టపీసుపూలు |
9. | మెదక్ | తూటి పూలు |
10. | రంగారెడ్డి | లొట్టపీసు పూలు |
11. | ములుగు | సలేంద్ర పూలు, లబ్బరు చెట్లు |
12. | మహబూబ్ నగర్ | లొట్టపీసు పూలు |
13. | మంచిర్యాల | పాల సముద్రం |
14. | అదిలాబాదు | భేషరం పూలు, సిగ్గుమాలిన పూలు |
15. | ఉత్తర తెలంగాణాలో కొన్ని చోట్ల | సొంగ పూలు |
16. | కామారెడ్డి | శబాస్ పూలు, బద్మాష్ పూలు, లొట్టపీసు పూలు, సిగ్గుమల్లె |
17. | భాగ్యనగరం | లొట్టపీసు పూలు |
18. | పెద్దపల్లి, సిరిసిల్ల | పాల సముద్రం పూలు |
19. | సంగారెడ్డి | తూటి పూలు |
20. | నిజామాబాద్ | భేషరం పూలు |