దాంపత్యాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

దాంపత్యాలు నవల రచయిత్రి కోమలాదేవి (కోమలా రత్నకుమారి) కర్నూలు జిల్లా ఆదోనిలో జననం. 1935 సం.న బి.ఏ. బి.ఈడి. పట్టభద్ర, బంగారు పంజరం (బహుమతి పొందినది), ఆరాధన, పునస్సమాగమం, ఉన్నత శిఖరాలు వగైరా నవలలతో ఆధునిక రచయిత్రులలో పేరు మోశారు. ఎమెస్కో పాఠకులకు "పూల తెరలు" నవల ద్వారా పరిచితులు, యువ దంపతులకు ఆవశ్య పఠనీయమైన ఈ కొత్త నవల ఈమె రచనా ప్రగతిలో మరో సోపానం.

  • ఈ నవలను రచయిత్రి అక్క సరళాదేవికి, బావగారు నాగభూషణానికి హృదయపూర్వకంగా అంకితమిచ్చింది. మొదటి సంపుటి డిసెంబరు, 1969 సం. న బాపు కవర్ డిజైన్, ఎం.శేషాచలం & కో పబ్లిషర్ల ద్వారా వెల్‌డన్ ప్రెస్, మదరాసు-21 నుండి ప్రచురిత మయినది. ఆంధ్ర ప్రదేశ్ బుక్ డిస్ట్రిబ్యూటర్స్, రాష్ట్రపతి రోడ్, సికింద్రాబాదు వారు పంపిణీదారులు. దీని వెల 2/- రూప్యములు.

మొదటి భాగం[మార్చు]

  • నవలలోని మొదటి వాక్యము మహీధర్ - వెంకటేశ్వరరావు స్నేహితులు. వాళ్ళిద్దరికీ స్నేహం కలవటం అందరకీ ఆశ్చర్యాన్ని కల్గించింది. ఎందుకంటారా . . . . . అని మొదలవుతుంది.

రెండవ భాగం[మార్చు]

  • ఈ భాగము పది రోజులు హడావిడిగా గడిచిపోయాయి అంటూ ప్రారంభమవుతుంది.

ఐదవ భాగం[మార్చు]

  • ఆడపిల్లల హాస్టల్ అన్నమాట విన్నాడేగాని అది ఏదో వివరంగా తెలీదు. యూనివర్సిటీ తెరవటానికి రెండు రోజులు వ్యవధి ఉంది. ఆ సాయంత్రమే కాస్త శ్రద్ధగా తయారై గదిలో పచార్లు చేస్తున్నాడు మహీధర్. నేహితునిలో మార్పు స్పష్తంగా కనపడుతూంది. రొజూ చూస్తుంటే భేదం కంపించదుగాని ఒకానొకనాడు అకస్మాత్తుగా గమనిస్తే అతడెంతగా పెరిగింది, ముఖంలోని చాపల్యం ---కుర్రకారు తనం - క్రమబద్దంగా పెరగని గెడ్డం వయసు ఎక్కే కొలది తుడుచుకు పెట్టుకొని పెట్టుకొని పోయినట్లు గనించాడు.

ఆరవ భాగం[మార్చు]

  • రెండవ రోజు కూడా మహీధర్ తిరిగి తిరిగి విసిగి వేసారి హాస్టల్ చేరాడు. ఆ ముఖం అడగకుండానే చెబుతూంది.

పదవ భాగం[మార్చు]

  • వెంకటేష్ తన పల్లె మెగలిచెరకు వెళ్ళాడు. క్రమంగా నూతన జీవితంలో నిండుగా, హుందాగా అర్ధాంగితో పాటు అడుగు పెట్టాడు.

కాంక్షలు - కోరికలు - ఆశలు - ఆశయాల చైతన్యస్రవంతిలో ఉత్సాహంగా పయనించబోతున్నాడు.

పదమూడవ భాగం[మార్చు]

  • రెండు రోజులు గడిచి పోయాయి. రావుగారు పొలాలు చూసి రావటానికి పల్లెకు వెళ్ళారు. సుచిత్రాదేవిని చూడటానికి వెంకటేశ్, రత్నం వెళ్ళారు. కాసేపు వాళ్ళతో ఉండి రత్నను అక్కడే ఉండమని తానొక్కడే మహీధర్ ఇంటికి వెళ్ళాడు.

మూలాలు[మార్చు]