దాడిశెట్టి రాజా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దాడిశెట్టి రామలింగేశ్వర రావు

పదవీ కాలం
2022 ఏప్రిల్ 11 – ప్రస్తుతం
తరువాత దివ్య యనమాల

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2014 - 3 జూన్ 2024
నియోజకవర్గం తుని నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 19 జులై 1975
ఎస్. అన్నవరం, తుని మండలం, కాకినాడ జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు ప్రజారాజ్యం పార్టీ
తల్లిదండ్రులు శంకర్రావు, సత్యనారాయణమ్మ
జీవిత భాగస్వామి లక్ష్మీ చైతన్య
సంతానం శంకర్‌ మల్లిక్, ఆశ్రిత

దాడిశెట్టి రామలింగేశ్వర రావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తుని నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

దాడిశెట్టి రాజా 19 జులై 1975లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తూర్పు గోదావరి జిల్లా; తుని మండలం, ఎస్. అన్నవరం లో శంకర్ రావు, సత్యనారాయణమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన బీఏ వరకు చదువుకున్నాడు.[2]

రాజకీయ జీవితం

[మార్చు]

దాడిశెట్టి రాజా విద్యార్థి దశ నుంచే సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన 2008లో ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీ జనరల్‌ సెక్రటరీగా నియమితుడయ్యాడు. ఆయన 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తుని నియోజకవర్గం టికెట్ ఆశించిన దక్కలేదు. దాడిశెట్టి రాజా 2011లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా తుని నియోజకవర్గం పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి యనమల కృష్ణుడు పై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగుపెట్టాడు.[3] ఆయన 2019లో తుని నియోజకవర్గం నుండి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[4] ఆయన 2022 ఏప్రిల్ 11న జరిగిన మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణలో భాగంగా వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు.[5]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (2019). "2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల జాబితా". Archived from the original on 8 November 2021. Retrieved 8 November 2021.
  2. Sakshi (18 March 2019). "తూర్పు గోదావరి వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ప్రొఫైల్స్‌". Archived from the original on 9 December 2021. Retrieved 9 December 2021. {{cite news}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 8 డిసెంబరు 2021 suggested (help)
  3. Sakshi (16 May 2014). "ఆంధ్రప్రదేశ్ విజేతలు". Archived from the original on 6 November 2021. Retrieved 6 November 2021.
  4. Sakshi (2019). "వైఎస్సార్సీపీ". Archived from the original on 2 November 2021. Retrieved 8 November 2021.
  5. Sakshi (11 April 2022). "ఏపీ మంత్రులకు శాఖల కేటాయింపులు". Archived from the original on 11 April 2022. Retrieved 11 April 2022.