దామెర్ల బదిరి నారాయణరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

భారతదేశం గర్వించదగ్గ చిత్రకారులలో దామెర్ల బదిరి నారాయణరావు ( Damerla Badiri Narayanarao)ఒకరు. ఆయన అంత గొప్ప చిత్రకారుడని, పైగా తెలుగువ్యక్తి అనీ చాలామంది తెలుగువారికి తెలియదు. వీరిని అనేకులు బదిరి అని పిలిచేవారు.

దామెర్ల బదిరి నారాయణరావు
జననం1914 జూన్ 1
మద్రాసు
ప్రసిద్ధిచిత్రకారుడు

బాల్యం- తొలి జీవితం

[మార్చు]

వీరు మద్ర్రాసులో సైదాపేటలో జూన్ 1 1914 వ సం.లో జన్మించారు.బాల్యము బీహారు రాష్ట్రములో పూసా అనె గ్రామములో గడిచింది.

చిత్రకళ

[మార్చు]

తన చిత్ర కళాభ్యాసము చెన్నపురి లలితకళాశాలలో దేవీ ప్రసాదుచౌదరి చరణ సన్నిధిని జరిగింది. చిత్రకళ నేర్చుకొనే రోజులలోనే గురువులకు ప్రేమాస్పాదుడైనారు.శిల్ప విద్యకూడా గురుపాదుల సన్నిధినే జరిగింది.వీరు లలితకళాశాలలో విద్య పూర్తి చేసుకొని ఢిల్లీ చేరుకున్నారు. బీహారులో భూకంపము సంభవించుట వల్ల అచ్చటి ప్రభుత్వ వయవసాయ శాఖ ఢిల్లీ లో ఉంటూ ఉండేది. అందులో ప్రవేశించి చిత్రకారుడిగా పనిచేస్తూ ఉండేవారు. 1937 నాటికి ఈయన జీవితంలో ప్రవేశించి చిత్రకళలో నైరంతర కృషికి ఆరంభం చేశారు. అక్కడ ఉంటూ కలకత్తా లలితకళా పరిషత్తు ఆధ్వర్యంలో జరిగే చిత్రకళా ప్రదర్శనములలో తమ చిత్రములు ప్రదర్శిస్తూ ఉండేవారు.ఆరోజుల్లో పంజాబు లలితకళా పరిషత్తు యాజమాన్యములో జరిగిన చిత్రకళా ప్రదర్శనములో ఈయన చిత్రించిన ఆటవస్తువు నే చిత్రము ప్రభుత్వము ఏర్పరిచిన బహుమతి పొందినది. తరువాత భోపాల్ నవాబు వీరు చిత్రించిన ఆలోచన అనే చిత్రమును కొన్నారు. ఇంకా ఈయన కొడైకెనాన్, లాహోరు, సిమ్లా, మైసూర్, హైదరాబాద్, మద్రాసు పలు చిత్ర ప్రదర్శనలు జరిపేవారు.అంతర్జాతీయ చిత్రకళా ప్రదర్శనములలో వీరు చిత్రించిన రాగ్ పాందోళ్ అనే రేఖాచిత్రము ప్రధమబహుమతి పొందినది. దానినే లండన్ రాయల్ ఎకాడమి ప్రదర్సించి వీరిని గౌరవించింది. 1947లో డిల్లీలో ఈయన చిత్రించిన గృహోన్ముఖులు అన్న టెంపరాచిత్రము చాలా ఖ్యాతిగాంచినది. భారత ప్రభుత్వము వీరివి రెండు పెద్ద చిత్రాలు కొని ఒకటి జెకోస్లేవియా, అమెరికా భారత కార్యాలయములలో నుంచినది.

ఈయన సుశ్రేణికి చెందిన చిత్రకారుడు.రాయచౌదరి గారి చిత్రకళను అవగాహన చేసుకుంటె వారి శిష్యులు అనేకులు చేస్తున్న కృషిలోని మార్పులు, వృద్ధి చాలా వరకు తెలుసుకోవచ్చును.దేవీ ప్రసాదులు చిత్రకళలో స్వేచ్చాప్రియులు. ఆయన శిల్పంలో, చిత్రలేఖనములో అపారకృషి చేసినారన్నది లోకవిదితము. వీరి స్వేచ్ఛ్హాప్రియత్వము, నిరంతర అన్వేషణా నూతనపధగాములైన శిష్యులలోను కానవస్తుంది.

బదిరి గారి ప్రాచ్యశిల్పకళాదర్శము నెడల గౌరవము ఎక్కువ. శిల్పంలో, చిత్రలేఖనములో ప్రాచ్యప్రతీచి సంప్రదాయముల అన్నింటిని కూలకుషముగా అభ్యసించారు వీరు. భారతదేశంలో ప్రాచ్యశిల్పచిత్రకళా దర్సనములను ఆదుకొన్న సంస్థ ఆలిండియా ఫైను ఆర్ట్సు అండ్ క్రాఫ్ట్సుసొసైటి (All India Fine Arts & Crafts Society) లో వీరు సహాయకార్యదర్శిగా చాలా కాలము పనిచేసారు.

చిత్రమాలిక

[మార్చు]