ది ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ (పుస్తకం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ది ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అనేది వినాయక్ దామోదర్ సావర్కర్ రచించిన పుస్తకం. తొలి ఉద్యమం 1857 సిపాయిల తిరుగుబాటు ఆధారంగా మొదట 1909లో[1][2] ప్రచురించారు.

ది ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ (పుస్తకం)
రచయిత(లు)వినాయక్ దామోదర్ సావర్కర్
దేశంభారతదేశం
భాషమరాఠీ, ఇంగ్లీష్
శైలిజాతీయవాద చరిత్ర
ప్రచురణ సంస్థ1909
ప్రచురణ కర్తసేథాని కంపెనీ, ముంబాయి (పునర్ముద్రణ, భారతదేశం)
ప్రచురించిన తేది
19 9 , 1949 (పునర్ముద్రణ, భారతదేశం)

మూలం[మార్చు]

1857లో జరిగిన భారత సిపాయిల తిరుగుబాటు 50వ వార్షికోత్సవం సందర్భంగా గ్రేట్ బ్రిటన్‌లో జరిగిన వేడుకల సందర్భంలో మరాఠీలో ఈ పుస్తకాన్ని సావర్కర్ రాశారు. దీనికి మేడమ్ కామా, వివిఎస్ అయ్యర్, ఎం.పి.టి ఆచార్య వంటి బ్రిటన్ లోని భారతీయ జాతీయవాదుల నుండి మద్దతు లభించింది. అలాగే భారతీయ విద్యార్థుల కృషి కూడా ఉంది.[3] ఇది బ్రిటన్‌లో భారతీయ ఉద్యమాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు భారతదేశంలో జాతీయవాద ఉద్యమాలను ప్రేరేపించడానికి ఉద్దేశించబడింది. సావర్కర్ లండన్‌లో ఇండియా హౌస్‌లో ఉన్నప్పుడు 'ది ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్' ప్రచురించబడింది.

ప్రేరణ[మార్చు]

మహాత్తర విజయాల భారత్[4], ఫ్రెంచ్ విప్లవం, అమెరికన్ విప్లవం వంటి చరిత్రల ద్వారా ప్రభావితమైంది. అదనంగా, కార్ల్ మార్క్స్ 1857లో న్యూయార్క్ ట్రిబ్యూన్‌లో "ది ఇండియన్ రివోల్ట్" అనే కథనాన్ని ప్రచురించాడు. తరువాత  "ది ఫస్ట్ ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ 1857-58" పుస్తకాన్ని రాసాడు. సావర్కర్ తన పుస్తకాన్ని 1909లో మార్క్స్ రచనల మాదిరిగానే ప్రచురించాడు.[5]

బైబిల్ గా[మార్చు]

బ్రిటిష్ అధికారానికి వ్యతిరేకంగా 1857 నాటి భారత తిరుగుబాటును ఏకీకృత, జాతీయ తిరుగుబాటుగా వర్ణించే ఈ పుస్తకం అత్యంత ఉద్వేగభరితమైనది.[6]   బ్రిటిష్ ఇండియాలో మరాఠీ ఎడిషన్ ప్రచురణకు ముందే నిషేధించబడింది.[7] ఆంగ్ల అనువాద ప్రచురణను హోం ఆఫీస్ హెచ్చరికలమేరకు ప్రింటర్లు, ప్రచురణ సంస్థలు ముద్రించలేదు. అలాగే బ్రిటీష్ విదేశీ కార్యాలయం పారిస్ నుండి ప్రచురణను నిరోధించడానికి ఫ్రెంచ్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చింది. ఇది చివరికి 1909లో నెదర్లాండ్స్‌లో ముద్రించబడింది. అప్పటికికానీ బ్రిటిష్ ప్రభుత్వం దీనిని గుర్తించలేదు.[8] చిత్తుకాగితాలపై ముద్రించబడ్డ ఈ పుస్తకం పెద్ద సంఖ్యలో భారతదేశానికి రవాణా చేయబడ్డాయి. అనతికాలంలోనే ఉద్యమకారులకు ఒక రాజకీయ బైబిల్‌గా సంతరించుకుంది. బ్రిటిష్ లైబ్రరీ కేటలాగ్ నుండి ఈ పుస్తకాన్ని తొలగించి భారతీయ విద్యార్థులకు అందుబాటులో లేకుండా చూసింది. భారతదేశంలో నలభై సంవత్సరాల వరకు ఈ పుస్తకం నిషేధించబడింది.

భారతదేశ చరిత్ర, జాతీయవాద రచనలలో అత్యంత ప్రభావవంతమైనది  'ది ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్' పరిగణించబడుతుంది.[9] హిందూ మతం ఆలోచనలను రూపొందించడంలో,  అభివృద్ధి పరచడంలో అత్యంత ప్రభావవంతమైన రచనలలో ఇది ఒకటి.[10][11][12]

మూలాలు[మార్చు]

  1. Savarkar, Vinayak Damodar (10 May 1909). The Indian War of Independence of 1857. London. Retrieved 9 November 2017.{{cite book}}: CS1 maint: location missing publisher (link)
  2. Vohra 2000, p. 70
  3. Yadav 1992, p. 14
  4. Visana, Vikram. "Savarkar before Hindutva: Sovereignty, Republicanism, and Populism in India, c.1900–1920". Modern Intellectual History (in ఇంగ్లీష్): 1–24. doi:10.1017/S1479244320000384. ISSN 1479-2443.
  5. "V.D. Savarkar and The Indian War of Independence, 1857". University of California, Irvine. Retrieved 2008-06-20.
  6. Misra 2004, p. 184
  7. Hopkirk 2001, p. 45
  8. "Mutiny at the Margins". University of Edinburgh. Archived from the original on 2008-05-18. Retrieved 2008-06-20.
  9. Dirks 2001, p. 127
  10. Bannerjee 2005, p. 50
  11. Hasan 1998, p. 149
  12. Nanda 1965, p. 701