ది ఈవిల్ డెడ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ద ఈవిల్ డెడ్
ఒరిజినల్ థియేట్రికల్ ట్రైలర్ పోస్టర్
దర్శకత్వంశామ్ రైమీ
రచనశామ్ రైమీ
నిర్మాతరాబర్ట్ టపెర్ట్
తారాగణంబ్రూస్ క్యాంప్ బెల్
ఎలెన్ శాండ్వైస్
హాల్ డెల్రిచ్
బెట్సీ బాకెర్
సారా యార్క్
ఛాయాగ్రహణంటాం ఫిలో
కూర్పుఎడ్నా రూత్ పాల్
సంగీతంజోసెఫ్ లోడుకా
నిర్మాణ
సంస్థ
రినైజన్స్ పిక్చర్స్
పంపిణీదార్లున్యూలైన్ సినిమా
విడుదల తేదీs
1981 అక్టోబరు 15 (1981-10-15)(premiere)
జనవరి 17, 1983 (United Kingdom)
సినిమా నిడివి
85 నిమిషాలు[1]
దేశంయునైటెడ్ స్టేట్స్
భాషఇంగ్లీష్
బడ్జెట్$350,000–400,000[2][3]
బాక్సాఫీసు$2.6 మిలియన్లు[4][5]

ది ఈవిల్ డెడ్ అన్నది శాం రైమి, బ్రూస్ క్యాంప్ బెల్ నిర్మాతలుగా, శాం రైమి రచన దర్శకత్వంలో ఎలెన్ శాండ్వైస్, బెట్సీ బాకర్ నటించిన 1981 నాటి అమెరికన్ అధిభౌతిక హారర్ చిత్రం. బయటి ప్రపంచానికి దూరంగా చెట్ల మధ్యలోని ఓ క్యాబిన్లో సెలవులు గడిపేందుకు వచ్చిన ఐదుగురు కాలేజి విద్యార్థుల కథ ఇది. దెయ్యాలు, ఆత్మల గుంపును విడుదల చేసే ఆడియో టేప్ కనిపెట్టాకా కాలేజి బృంద సభ్యులకు దెయ్యం పడుతుంది, ఇది రక్తపాతానికి, హింసకు దారితీస్తుంది. రైమీ, నటవర్గం కలిసి ప్రోటోటైప్ అనదగ్గ షార్ట్ ఫిలిం విత్ ఇన్ ద వుడ్స్ తీశారు. దీని ద్వారా నిర్మాణానికి డబ్బు పెట్టగల నిర్మాతలను ఆకర్షించే ప్రయత్నం చేసి విజయం సాధించారు. తద్వారా 90వేల అమెరికన్ డాలర్లు రైమీ పొందగలిగారు. మొరిస్టౌన్, టెన్నీస్ ప్రాంతంలో ఉన్న ఓ మారుమూల క్యాబిన్లో సినిమాను తీశారు. తారాగణం, సాంకేతిక బృందం చాలా అసౌకర్యంగా, ఇబ్బందికరంగా భావించిన ఓ చిత్రీకరణ విధానంలో సినిమాను తీశారు.

ఈ చిన్న బడ్జెట్ హారర్ చిత్రం నిర్మాత ఇర్విన్ షాపిరోను ఆకర్షించింది, దాంతో ఆయన 1982లో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో సినిమాను ప్రదర్శించేందుకు అవకాశం దక్కేలా సాయం చేశారు. హారర్ రచయిత స్టీఫెన్ కింగ్ ఈ సినిమాని అత్యంత ఆసక్తిదాయకంగా సమీక్షించారు, న్యూలైన్ సినిమా వారు దీని పంపిణీదారులుగా ముందుకు వచ్చేందుకు అది ఉపకరించింది. అమెరికాలో ఓ మాదిరి వాణిజ్య విజయాన్నే సాధించినా, ప్రపంచ వ్యాప్తంగా పంపిణీ చేసినప్పుడు దాని పెట్టుబడి తిరిగి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా 2.4 మిలియన్ డాలర్లు థియేటర్లలో ప్రదర్శనల సమయంలో సాధించింది. తొలినాటి సమీక్షలు, తర్వాత్తర్వాత వెలువడ్డ సమీక్షలు కూడా విశ్వవ్యాప్తంగా అనుకూలంగా వచ్చాయి, విడుదలైన దశాబ్దాల తర్వాత కూడా అనుకూల సమీక్షలు పొందుతోంది. కల్ట్ సినిమాల్లో గొప్పదిగా ఈవిల్ డెడ్ పేరొందింది, సార్వకాలికంగా అతిగొప్ప హారర్ సినిమాగా కీర్తి గడించింది. ది ఈవిల్ డెడ్ సినిమాతో క్యాంప్ బెల్, రైమీలు సినిమా రంగంలోకి ప్రవేశించారు, సంవత్సరాల కాలంలో మరిన్ని సినిమాలు కలిసి చేశారు, వాటిలో రైమీ  స్పైడర్-మాన్ ట్రయాలజీ కూడా ఉన్నాయి.

ఈ సినిమా తర్వాత మరో రెండు సీక్వెల్స్ వచ్చి మీడియా ఫ్రాంచైజ్ గా ఎదిగింది. 1987లో ఈవిల్ డెడ్ II, 1992లో ఆర్మీ ఆఫ్ డార్క్ నెస్ రైమీ రచన దర్శకత్వంలో వెలువడడమే కాక వీడియో గేమ్ లు, కామిక్ పుస్తకాలు, టెలివిజన్ సీరీస్ లు కూడా వచ్చాయి. సినిమాలోని ప్రధాన పాత్ర ఆష్ విలియమ్స్ (క్యాంప్ బెల్) కల్ట్ ఐకాన్ గా గుర్తింపు పొందాడు. నాలుగవ సినిమా రీమేక్ గానూ, రీబూట్ గానూ, సీక్వెల్ గా కూడా పరిగణించేలా అదే పేరుతో ఈవిల్ డెడ్ గా 2013లో విడుదలైంది. రైమీ, క్యాంప్ బెల్ తో, ఫ్రాంచైజ్ నిర్మాత రాబర్ట్ టాపెర్ట్ తో కలిసి సహ నిర్మాతగా వ్యవహరించారు. మిగిలిన సినిమాల్లానే సినిమాకు అనుసరణ టెలివిజన్ సీరీస్ ఆష్ వర్సెస్ ఈవిల్ డెడ్ శాం, ఇవాన్ రైమీలు నిర్మాతలుగా, క్యాంప్ బెల్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా నిర్మితమైంది.

మూలాలు[మార్చు]

  1. "THE EVIL DEAD (X) (!)". British Board of Film Classification. 1982-10-04. Retrieved 2013-03-28.
  2. Gettell, Oliver (2013-04-05). "'Evil Dead': Blood-soaked remake scares up mixed reviews". Los Angeles Times. Retrieved 2015-07-10.
  3. Collins, Andrew. "EMPIRE ESSAY: Evil Dead II". Empire. Retrieved 2015-07-10.
  4. "The Evil Dead (1983) – Box Office Mojo".
  5. "The Evil Dead (1983) – International Box Office Results – Box Office Mojo".