ది బర్త్‌డే బాయ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ది బర్త్‌డే బాయ్
దర్శకత్వంవిస్కీ
రచనవిస్కీ
నిర్మాతభరత్ ఇమ్మలరాజు
తారాగణం
ఛాయాగ్రహణంరాహుల్ సంకీర్త్
కూర్పునరేష్ అడుప
సంగీతంప్రశాంత్ శ్రీనివాస్
నిర్మాణ
సంస్థ
బొమ్మ బొరుసా
విడుదల తేదీ
19 జూలై 2024 (2024-07-19)
సినిమా నిడివి
119 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

ది బర్త్‌డే బాయ్ 2024లో తెలుగులో విడుదలైన సినిమా. బొమ్మ బొరుసా బ్యానర్‌పై భరత్ ఇమ్మలరాజు నిర్మించిన ఈ సినిమాకు విస్కీ దర్శకత్వం వహించాడు. ర‌వికృష్ణ‌, స‌మీర్ మ‌ళ్లా, రాజీవ్‌క‌న‌కాల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను జూలై 10న విడుదల చేసి,[1] సినిమాను జూలై 19న విడుదల చేశారు.[2]

ఉన్న‌త చ‌దువుల కోసం విదేశాల‌కు వెళ్లిన ఓ ఐదుగురు స్నేహితులలో ఒక‌రి బ‌ర్త్‌డే వేడుక‌ను ఎంజాయ్ చేయాల‌నే ఉద్దేశంతో పార్టీని ఏర్పాటు చేసుకుంటారు. ఈ పార్టీలో మ‌ద్యం సేవించిన ఫ్రెండ్స్, బ‌ర్త్‌డే బాయ్‌ని ఆట‌ప‌ట్టిస్తుంటారు. అయితే, అనుకోని విధంగా బ‌ర్త్‌డే బాయ్ మ‌ర‌ణించ‌డంతో, మిగ‌తా ఫ్రెండ్స్ భ‌యాందోళ‌న‌కు గురవుతారు. వారు త‌మ కెరీర్‌ను కాపాడుకునేందుకు ఏం చేశారు.. వారికి ఈ విష‌యంలో ఎవ‌రు సాయం చేశారు.. బ‌ర్త్‌డే బాయ్ మృతికి అస‌లు కార‌ణం ఏమిటి.. అనేది సినిమా కథ.[3]

నటీనటులు

[మార్చు]
  • ర‌వికృష్ణ‌
  • స‌మీర్ మ‌ళ్లా
  • రాజీవ్‌ క‌న‌కాల
  • విక్రాంత్
  • మణి
  • రాజా అశోక్
  • రాహుల్
  • సాయి అరుణ్‌
  • ప్ర‌మోదిని
  • వాకా మ‌ని
  • వెంక‌టేష్

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: బొమ్మ బొరుసా
  • నిర్మాత: భరత్ ఇమ్మలరాజు [4]
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విస్కీ [5]
  • సంగీతం: ప్రశాంత్ శ్రీనివాస్
  • సినిమాటోగ్రఫీ: సంకీర్త్ రాహుల్
  • ఎడిటర్: నరేష్ అడుప

విడుదల, స్పందన

[మార్చు]

బొమ్మ బొరుసా బ్యానర్‌పై భరత్ ఇమ్మలరాజు నిర్మించిన ఈ సినిమాకు విస్కీ దర్శకత్వం వహించాడు. ర‌వికృష్ణ‌, స‌మీర్ మ‌ళ్లా, రాజీవ్‌క‌న‌కాల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా జూలై 19న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో విడుదలయింది. కథను నమ్ముకొని వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ లు అందుకుంటున్నాయి. అలా కథను నమ్ముకొని వచ్చిన సినిమానే 'ది బ‌ర్త్‌డే బాయ్' ఓ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ క‌థ‌గా యూత్‌ఫుల్ కంటెంట్‌తో ప్రేక్ష‌కులను మెప్పిస్తుంది. [6][7][8][9][10][11]

రేటింగ్

  • 123తెలుగు.కామ్: 2.5/5
  • సాక్షి: 2.75/5
  • 10 టీవీ: 2.75/5
  • N టీవీ: 2.75/5
  • నమస్తే తెలంగాణ : 2.75/5

మూలాలు

[మార్చు]
  1. Cinema Express (10 July 2024). "The Birthday Boy trailer: Celebrations go fatally wrong in this upcoming thriller" (in ఇంగ్లీష్). Archived from the original on 21 July 2024. Retrieved 21 July 2024.
  2. The Hindu (18 July 2024). "Telugu film 'The Birthday Boy', sparked by real incidents that turned birthday revelry awry" (in Indian English). Archived from the original on 21 July 2024. Retrieved 21 July 2024.
  3. "The Birthday Boy Movie Review in Telugu" (in అమెరికన్ ఇంగ్లీష్). 2024-07-19. Retrieved 2024-08-05.
  4. Chitrajyothy (17 July 2024). "నా జీవితంలో జరిగిన రియల్‌స్టోరీ 'ది బర్త్‌డే బాయ్‌'.. నా కుక్క పేరు నేను పెట్టుకున్నా". Archived from the original on 21 July 2024. Retrieved 21 July 2024.
  5. NT News (21 July 2024). "అంచనాలు నిజమయ్యాయి". Archived from the original on 21 July 2024. Retrieved 21 July 2024.
  6. "'ద బర్త్ డే బాయ్' మూవీ రివ్యూ | The Birthday Boy Movie Review And Rating Telugu | Sakshi". www.sakshi.com. Retrieved 2024-08-05.
  7. Telugu, 10TV; Nill, Saketh (2024-07-19). "'ది బర్త్‌డే బాయ్‌' మూవీ రివ్యూ.. సినిమా చూస్తే బర్త్ డే పార్టీ చేయాలంటే భయపడతారు." 10TV Telugu (in Telugu). Retrieved 2024-08-05.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  8. "filmi beat".
  9. Telugu, ntv (2024-07-19). "The Birthday Boy Review: 'ది బర్త్ డే బాయ్' ఎలా ఉన్నాడంటే?". NTV Telugu. Retrieved 2024-08-05.
  10. telugu, NT News (2024-07-19). "The Birthday Boy Review | ఆలోచింపజేసే థ్రిల్లర్ : 'ది బర్త్‌డే బాయ్‌' రివ్యూ". www.ntnews.com. Retrieved 2024-08-05.
  11. Kumar, Sanjiv. "The Birthday Boy: కడుపుబ్బా నవ్విస్తున్న ది బర్త్ డే బాయ్ టీజర్.. రిలీజ్ చేసిన డైరెక్టర్ మెహర్ రమేష్". Hindustantimes Telugu. Retrieved 2024-08-05.