ది మూన్‌స్టోన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ది మూన్ స్టోన్
The Moonstone 1st ed.jpg
First "Pan" paperback edition cover
Authorవిల్కీ కోల్లిన్స్
Countryబ్రిటన్
Languageఆంగ్లము
GenreEpistolary, Mystery Novel,
Publisherటిన్స్లే
Publication date
1868
Media typePrint (Hardback & Paperback)
ISBNNA

ది మూన్ స్టోన్' (1868) అనేది విల్కీ కోల్లిన్స్ విరచిత నవల. సాధారణంగా దీనిని ఆంగ్ల భాషనందు మొదటి డిటెక్టివ్ నవలగా భావిస్తారు.

కథాంశము[మార్చు]

చెరుపు (స్పాయిలర్) హెచ్చరిక: నవల చదవ గోరిన వారు/సినిమా చూద్దామనుకున్న వారు ఈ క్రింది భాగాన్ని చదవ వద్దని మనవి. కథ వివరాలు తెలుపుతూ, ఉత్కంఠ లేకుండా చేసే అవకాశం ఉంది.

కథ ప్రధానంగా వెరిండర్ రాచెల్ అనే యువతి చుట్టూ తిరుగుతుంది. రాచెల్ వెరిండర్ తన పద్దెనిమిదవ పుట్టిన రోజునకు అంకుల్ నుండి ఓ భారతీయ వజ్రాన్ని వారసత్వంగా పొందుతుంది. ఈ అంకుల్ వెనకటికి భారతదేశంలోని బ్రిటీషు సైనికాధికారి, అవినీతిపరుడు అని పేరు! ఈ వజ్రం బహు విలువైనదీ, మరియూ మత ప్రాధాన్యత కలిగినది. ఈ వజ్రాన్ని భారత దేశంలోని ఓ హిందూ దేవాలయం నుండి దొంగిలించినారని, దానిని తిరిగి తీసుకొని వెళ్ళడానికి ముగ్గురు హిందూ యువకులు తమ జీవితాన్ని అంకితం చేస్తారని తరువాత తెల్పబడుతుంది.

కథాంశము నిజమైన కథలను, కథలుగా వ్యాప్తిలో ఉన్న హోప్ వజ్రం, (లేదా ఓర్లాఫ్ వజ్రం కథలను ఆధారం చేసుకోని వ్రాయబడినది.

రాచెల్ యొక్క పద్దెనిమిదవ పుట్టిన రోజు చాలా బ్రహ్మాండముగా జరపబడుతుంది. అతిథులలో అప్పులపాలయిన ఫ్ర్లాంక్లిన్ బ్లేక్ కూడా ఉంటాడు. ఆ రోజు సాయంత్రం అందరు చూడటానికి వీలుగా మూన్ స్టోన్ను తన దుస్తులతో ధరిస్తుంది. ఈ పార్టీలో అతిథుల సంతోషం కోసం ముగ్గురు ఇంద్రజాలికులను భారతదేశం నుండి పిలిపిస్తారు. ఆ రోజు రాత్రి, రాచెల్ పడక గది నుండి వజ్రం దొంగలించబడుతుంది!

రాచెల్ తనకు సాయం చేస్తానన్న ఫ్లాంక్లిన్ బ్లేక్ ను కాదని చాలా దుఃఖముతో లండన్ బయలుదేరి వెళ్ళిపోతుంది. చివరకు పోలీసులకు కూడా సమాధానం ఇవ్వదు. ఎవ్వరికీ ఈ వజ్రం ఎలా దొంగిలించబడినదో అర్థం కాదు. ఇంద్రజాలికులను అరెస్టు చేసి మరలా వదిలేస్తారు. మరో ప్రధానమైన అనుమానితురాలు బ్లేక్ ప్రియురాలు మరియూ పనిమనిషి. కానీ ఆమె కూడా ఆత్మహత్య చేసుకోవడంతో కథ మరిన్ని మలుపులు తిరుగుతుంది.

పాత్రలు[మార్చు]

 • రాచెల్ ; మూన్ స్టోన్ అని పిలవబడు పెద్ద భారతీయ వజ్రాన్ని వారసత్వంగా పొందుతుంది.
 • ఫ్రాంక్లిన్ బ్లేక్ ; రాచెల్ వెరిండర్ యొక్క కజిన్ మరియూ పెళ్ళి చేసుకోవాలని ప్రయత్నించేవాడు.
 • గాడ్ఫ్రే ఏబుల్వైట్ ; సంఘ సేవకుడు, రాచెల్ వెనిండర్ యొక్క కజిన్, పెండ్లి చేసుకోవాలని ఆశించేవాడు.
 • గ్యాబ్రియల్ బెట్టెరెడ్జె ; ప్రధాన సేవకుడు, మొదటి సేత
 • రొసన్నా స్పియరుమ్యాన్ ; రెండవ పనిమనిషి, పూర్వాశ్రమంలో ఓ దొంగ, అనుమానితురాలు, ఓ విషాదాంత పాత్ర
 • డ్రుసిల్లా క్లాక్ ; రాచెల్ వెనిండర్ యొక్క కజిన్, ద్వితియ సేత, మంచి అమ్మాయి.
 • బ్రఫ్ఫు ; కుటుంబ న్యాయవాది, తృతీయ సేత
 • సార్జంట్ కఫ్ ; ప్రముఖ నేరపరిశోధకుడు , గులాభీలంటే బహు ప్రీతి!
 • డాక్టర్ కాండీ ; కుటుంబ వైద్యుడు
 • ఎజ్రా జెన్నింగ్స్ ; డాక్టరు క్యాండీ సేవకుడు, క్యాన్సరుతో బాధపడుతుంటాదు, ఓపియం వాడుతుంటాడు.
 • ముగ్గురు హిందూ ఇంద్రజాలికులు; భారతదేశం నుండి వచ్చిన వినోద కారులు.

మూస:Endspoiller

బయటి లింకులు[మార్చు]