దీక్షా జోషి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దీక్షా జోషి
జననం
విద్యాసంస్థసెయింట్ జేవియర్స్ కళాశాల, అహ్మదాబాద్‌
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2017–ప్రస్తుతం

దీక్షా జోషి గుజరాత్‌కు చెందిన సినిమా నటి. 2017లో శుభ్ ఆరంభ్ సినిమాలో తొలిసారిగా నటించింది. ఆ తర్వాత కర్సందాస్ పే & యూజ్ (2017), షరతో లగు (2018), ధుంకీ (2019) సినిమాలలో వివిధ పాత్రలు పోషించింది.

జననం, విద్య[మార్చు]

దీక్షా జోషి ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం లక్నో నగరంలో హేమ్ జోషి - రష్మీ జోషిల దంపతులకు జన్మించింది. అహ్మదాబాద్‌లోని ఏకలవ్య స్కూల్‌లో పాఠశాల విద్యను, సెయింట్ జేవియర్స్ కళాశాల నుండి ఆంగ్ల సాహిత్యాన్ని అభ్యసించింది.[1]

సినిమారంగం[మార్చు]

2017లో అమిత్ బారోట్ దర్శకత్వం వహించిన శుభ ఆరంభ్ సినిమాతో సినిమారంగంలోకి అడుగుపెట్టింది. అదే సంవత్సరంలో కర్సందాస్ పే & యూజ్, కలర్‌బాజ్ అనే ఇతర రెండు సినిమాలలో నటించింది.[2] కర్సందాస్ పే & యూజ్ సినిమా విజయవంతమయింది.

మల్హర్ థక్కర్‌తో కలిసి నటించిన షరతో లాగు సినిమా కూడా కమర్షియల్‌గా విజయం సాధించింది. 2018లో షరతో లగులో తన పాత్రకు గుజరాతీ ఐకానిక్ ఫిల్మ్ అవార్డ్స్ (గిఫా) ఉత్తమ నటి అవార్డును కూడా గెలుచుకుంది. ప్రతీక్ గాంధీతో నటించిన ధుంకీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది.[3] 2020లో ధుంకీ సినిమాలోని నటనలకు క్రిటిక్స్ ఛాయిస్ ఫిల్మ్ అవార్డ్స్ లో ఉత్తమ నటి (గుజరాతీ) అవార్డును అందుకుంది. 2020లో విడుదలైన దుర్గేష్ తన్నా దర్శకత్వం వహించిన రొమాంటిక్ కామెడీ సినిమా లువ్ నీ లవ్ స్టోరీస్‌లో దీక్ష టైటిల్ రోల్ చేసింది.[4][5]

దివ్యాంగ్ థక్కర్ దర్శకత్వం వహించిన రణవీర్ సింగ్ నటించిన జయేష్ భాయ్ జోర్దార్ సినిమాతో హిందీ సినిమారంగంలోకి అడుగుపెట్టింది.[6]

సినిమాలు[మార్చు]

సంవత్సరం సినిమా పాత్ర దర్శకుడు భాష ఇతర వివరాలు
2017 శుభ్ ఆరంభ్ రిద్ధిమా అమిత్ బరోట్ గుజరాతీ తొలిచిత్రం
కర్సందాస్ పే యూజ్ జయ కృష్ణదేవ్ యాగ్నిక్
వాహ్లామ్ జావో నే గుజరాతీ [7]
కలర్‌బాజ్ తన్వి జానానే రాజ్‌సింగ్
2018 షరతో లగు సావిత్రి నీరజ్ జోషి
2019 ధుంకి శ్రేయ అనిష్ షా
2020 లవ్ నీ లవ్ స్టోరీస్ ప్రీతి దుర్గేష్ తన్నా
376 డి[8] సంధ్య గన్వీన్ కౌర్ & రాబిన్ సికార్వార్ హిందీ బాలీవుడ్‌లో అరంగేట్రం
2022 ప్రేమ్ ప్రకరణ్ చంద్రేష్ భట్ గుజరాతీ
జయేష్ భాయ్ జోర్దార్ ప్రీతి దివ్యాంగ్ ఠక్కర్ హిందీ [9]
ఫక్త్ మహిళా మాతే స్నేహ జై బోదాస్ గుజరాతీ [10]
2022 వాహ్లామ్ జావో నే గుజరాతీ [7]
2023 లకిరో రిచా దర్శన్ అశ్విన్ త్రివేది గుజరాతీ [11]

అవార్డులు[మార్చు]

సంవత్సరం అవార్డు విబాగం సినిమా ఫలితం మూలాలు
2018 గుజరాతీ ఐకానిక్ ఫిల్మ్ అవార్డ్స్ (గిఫా) ఉత్తమ నటి షరతో లగు విజేత [12]
అంతర్జాతీయ గుజరాతీ ఫిల్మ్ ఫెస్టివల్ ఉత్తమ నటి కర్సందాస్ పే అండ్ యూజ్ విజేత
2020 క్రిటిక్స్ ఛాయిస్ ఫిల్మ్ అవార్డ్స్ ఉత్తమ నటి (గుజరాతీ) ధుంకి విజేత

మూలాలు[మార్చు]

 1. "I never felt the need to bunk in college: Deeksha Joshi". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2023-01-10.
 2. "It's the end of the road for formula films, fresh content will thrive in 2020: Deeksha Joshi". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2023-01-10.
 3. "Deeksha Joshi shares the motion poster of her upcoming film 'Dhunki'". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2023-01-10.
 4. "Photos: Deeksha Joshi, Vyoma Nandi and Shraddha Dangar gear up for 'Love Ni Love Storys' promotion". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2023-01-10.
 5. "Casting director Avani Soni talks about discovering the best talents from the Gujarati entertainment industry". mid-day (in ఇంగ్లీష్). 2019-12-21. Retrieved 2023-01-10.
 6. Hungama, Bollywood (2019-12-04). "The first look of Ranveer Singh starrer Jayeshbhai Jordaar justifies the title of the film! : Bollywood News - Bollywood Hungama" (in ఇంగ్లీష్). Retrieved 2023-01-10.
 7. 7.0 7.1 Scroll Staff. "'Vaahlam Jaao Ne' trailer: Pratik Gandhi and Deeksha Joshi in Gujarati romcom". Scroll.in. Retrieved 2023-01-10.
 8. "Exclusive! Deeksha Joshi: '376 D' is a courtroom drama that deals with a law that doesn't exist - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2023-01-10.
 9. "BREAKING: Yash Raj Films announces theatrical release dates for Bunty Aur Babli 2, Prithviraj, Jayeshbhai Jordaar and Shamshera!". Bollywood Hungama. 26 September 2021. Retrieved 2023-01-10.
 10. "Fakt Mahilao Mate Movie: Showtimes, Review, Trailer, Posters, News & Videos | eTimes".
 11. "Filmmaker Darshan Ashwin Trivedi unveils the poster of 'Lakiro' - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2023-01-10.
 12. GIFA 2018 (in ఇంగ్లీష్), retrieved 2023-01-10

బయటి లింకులు[మార్చు]