Jump to content

దీపక్ బైజ్

వికీపీడియా నుండి
దీపక్ బైజ్

ఛత్తీస్‌గఢ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
12 జూలై 2023 (2023-07-12)
ముందు మోహన్ మార్కం

మోహన్ మార్కం
పదవీ కాలం
6 జూన్ 2019 – 4 జూన్ 2024
ముందు దినేష్ కశ్యప్
తరువాత మహేష్ కశ్యప్
నియోజకవర్గం బస్తర్

పదవీ కాలం
8 డిసెంబర్ 2008 – 6 జూన్ 2019
తరువాత రాజ్‌మన్ వెంజమ్
నియోజకవర్గం చిత్రకోట్

వ్యక్తిగత వివరాలు

జననం (1981-07-14) 1981 జూలై 14 (వయసు 43)
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
మూలం [1]

దీపక్ బైజ్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బస్తర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

దీపక్ కుమార్ బైజ్ ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం, బస్తర్ జిల్లా, గధియా గ్రామంలో 14 జూలై 1981న బి.ఆర్. బైజ్, లక్ష్మీ బాయి దంపతులకు జన్మించాడు. ఆయన డబుల్ ఎంఏ (పొలిటికల్ సైన్స్ అండ్ ఎకనామిక్స్, ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

దీపక్ బైజ్ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2008 నుండి 2019 వరకు చిత్రకోట్ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత 2019లో బస్తర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి బైదురామ్ కశ్యప్ పై ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై పార్లమెంట్‌లో 13 సెప్టెంబర్ 2019 నుండి 12 సెప్టెంబర్ 2020 వరకు విదేశీ వ్యవహారాల స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా, రసాయన & ఎరువులపై స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని సలహా కమిటీ సభ్యుడిగా పని చేశాడు.

దీపక్ కుమార్ బైజ్ 2023 శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి వినాయక్ గోయల్ చేతిలో ఓడిపోయాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. "Chhattisgarh Assembly Elections: Congress MP Deepak Baij aims for a hat-trick from Chitrakot". 7 November 2023. Archived from the original on 31 July 2024. Retrieved 31 July 2024.
  2. The Indian Express (12 July 2023). "Congress appoints MP Deepak Baij as its Chhattisgarh unit chief ahead of Assembly polls" (in ఇంగ్లీష్). Archived from the original on 31 July 2024. Retrieved 31 July 2024.
  3. TV9 Bharatvarsh (30 November 2023). "दीपक बैजः युवा नेता, छत्तीसगढ़ में कांग्रेस का बड़ा चेहरा, चित्रकूट सीट पर अब हैट्रिक जीत पर नजर". Archived from the original on 31 July 2024. Retrieved 31 July 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)