Jump to content

దీపాల పిచ్చయ్యశాస్త్రి

వికీపీడియా నుండి

దీపాల పిచ్చయ్యశాస్త్రి (1894 - 1983) సుప్రసిద్ధ పండితులు.

వీరు గుంటూరు జిల్లా బొమ్మరాజుపల్లి గ్రామంలో జన్మించారు. మద్రాసు విశ్వవిద్యాలయం వారి పరీక్షలో ఉత్తములుగా ఉత్తీర్ణులై నెల్లూరు లోని వెంకటగిరి మహారాజా కళాశాలలో 19 సంవత్సరాలు తెలుగు పండితులుగా పనిచేశారు. వీరి కవితా గురువులు తిరుపతి వెంకట కవులు.

ఇతర విశేషాలు

[మార్చు]

వీరి సహాధ్యాయి, స్నేహితుడు అయిన ప్రసిద్ధ కవి గుర్రం జాషువాతో కలసి రచన వ్యాసంగం చేయాలని, జంట కవులుగా గుర్తింపు పొందాలని అనుకొనేవారని అయితే వీరి పేర్ల కలయిక కుదరక (జాషువా పిచ్చో, పిచ్చి జాషువా, దీపాల జాషువా అనో పెట్టడం ఇష్టం లేక) విరమించుకొన్నరని సినీ రచయిత ఓంకార్ తన వ్యాస పుస్తకంలో వివరించారు. ఆంధ్ర సారస్వత పరిషత్తు విమర్శకాగ్రేసర అనే బిరుదుతో సత్కరించింది.

  • ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ 1969లో విశిష్ట సభ్యత్వాన్ని ఇచ్చి గౌరవించింది.

పద్య రచనలు

[మార్చు]
  • భక్త కల్పద్రుమము
  • కాలము : కాల మహిమ, దేశ స్థితిగతులు మొదలైన విషయాలను వివరించేందుకు తానీ శతకాన్ని రాసినట్టు పిచ్చయ్యశాస్త్రి వివరించారు.
  • భారతి
  • సువర్ణ మేఖల
  • గాలివాన
  • ప్రణయ కుసుమము
  • వీరి రచనల జాబితా [1]
  • చాటు పద్య రత్నాకరము[2]

అనువాదాలు

[మార్చు]
  • మేఘదూతం
  • రఘువంశం
  • దశకుమార చరిత్ర

మూలాలు

[మార్చు]
  1. పిచ్చయ్యశాస్త్రి, దీపాల. వీరి రచనల జాబితా.
  2. పిచ్చయ్యశాస్త్రి, దీపాల. చాటుపద్య రత్నాకరము.