దుగ్గినేని వెంకట్రావమ్మ
Jump to navigation
Jump to search
దుగ్గినేని వెంకట్రావమ్మ | |||
ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం 1972 – 1978 | |||
ముందు | దుగ్గినేని వెంకయ్య | ||
---|---|---|---|
తరువాత | బండారు ప్రసాదరావు | ||
నియోజకవర్గం | మధిర నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1950 ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం | ||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ పార్టీ | ||
జీవిత భాగస్వామి | దుగ్గినేని వెంకయ్య | ||
నివాసం | హైదరాబాద్ |
దుగ్గినేని వెంకట్రావమ్మ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 1972లో మధిర నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించింది.[1]
రాజకీయ జీవితం
[మార్చు]దుగ్గినేని వెంకట్రావమ్మ భర్త దుగ్గినేని వెంకయ్య మరణాంతరం 1972 జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మధిర నియోజకవర్గం నుండి కాంగ్రెస్ తరపున పోటీ చేసి సీపీఎం అభ్యర్థి బోడేపూడి వెంకటేశ్వరరావు పై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగుపెట్టింది. 1977లో ఎన్నికలు జరగాల్సి ఉండగా దేశంలో ఎమెర్జెన్సీ విదించడంతో శాననసభను మరో సంవత్సరం పొడగించడంతో ఆమె ఆరు సంవత్సరాలపాటు మధిర ఎమ్మెల్యేగా పనిచేసింది.[2] ఆమెకు ఈ ఎన్నికల్లో 40,799ఓట్లు రాగా, ప్రత్యర్థి అభ్యర్థి బోడేపూడికి 23,457 ఓట్లు వచ్చాయి. దీంతో ఆమె 17,342 ఓట్ల మెజార్టీతో గెలిచి మొట్టమొదటిసారిగా మధిర నియోజకవర్గం నుండి మహిళ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించింది.[3]
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (28 October 2018). "ఆరేళ్ల అసెంబ్లీ ఇదొక్కటే!". Archived from the original on 2020-07-12. Retrieved 18 April 2022.
- ↑ Andhra Jyothy (30 October 2018). "ఆరేళ్లూ.. ఎమ్మెల్యే". Archived from the original on 18 April 2022. Retrieved 18 April 2022.
- ↑ Sakshi (22 November 2018). "రెండుసార్లు పోటీ.. ఒకసారి గెలుపు". Archived from the original on 18 April 2022. Retrieved 18 April 2022.