దుబ్బు(చర్మ వాయిద్యం )

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రపంచ జానపద దినోత్సవ వేడుకల్లో భాగంగా 2019 ఆగస్టు 31న రవీంద్ర భారతిలో తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ నిర్వహించిన జానపద జాతర సాంస్కృతిక కార్యక్రమంలో దుబ్బుల కొలువు కళాకారుల ప్రదర్శన.
2019 జానపద జాతర సాంస్కృతిక కార్యక్రమంలో వివిధ వాయిద్యాలతో దుబ్బుల కొలువు కళాకారులు


తెలంగాణ, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలలో కనిపించే అరుదైన వాద్యం దుబ్బు. దీన్ని కూర్చొని వాయిస్తారు. దుబ్బుకి గజ్జెలు కడతారు. వాయించే కళాకారుడు కూడా కాలుకి గజ్జెలు కట్టుకొని దరువుకి అనుగుణంగా గజ్జెల సవ్వడి వచ్చేలా కాలు ఊపుతాడు. ఈ వాద్యం వాయించే కళాకారులు కనకదుర్గమ్మ కథలు చెబుతారు. తెలంగాణలో బహుజన కులాలవారు ఈ వాద్యాన్ని తమ కథాగానాల్లో ఉపయోగిస్తారు.[1]

వాయిద్యం ఆకారం

[మార్చు]

దుబ్బు వాద్యం జానెడున్నర లేదా రెండు జానల పొడవు ఉంటుంది. పొడవుకన్నా కొద్దిగా అటు ఇటుగా వెడల్పు ఉంటుంది. చర్మాన్ని బిగించి కట్టడం వల్ల శబ్దం స్పష్టంగా, అనుకున్న పద్ధతిలో వెలువడుతుంది.[2]

తయారీ

[మార్చు]

దుబ్బును గుమ్మడి టేకు అనే కలప, మేక లేదా బర్రె చర్మంతో తయారు చేస్తారు. గుమ్మడి టేకును రింగులా సంగడి పట్టించి, రెండువైపులా ఏడు రంధ్రాలు చేస్తారు. ఈ రెండు వైపులను మేక లేదా బర్రె చర్మంతో మూసేస్తారు. పైన మువ్వలు కడతారు.

వాయించే విధానం

[మార్చు]

దీనిని ఒకవైపు వంకర తిరిగిన పుల్లతో కొడతారు. రెండోవైపు చేత్తో వాయిస్తారు. 'డుడుండూ' అంటూ దుబ్బు చేసే శబ్దం ఆకర్షణీయంగా ఉంటుంది. అందుకు అనుగుణంగా వీరు కనకదుర్గమ్మ కథలు పాడతారు.[3]

దుర్గమ్మ కొలుపులు చేస్తారు

[మార్చు]

ఈ వాయిద్యాన్ని వాయిస్తూ వివిధ కులాలకు చెందిన వారి ఇళ్ళలో కొలుపులు చేస్తారు. వీరిని దుబ్బులోళ్లు, కొలుపులోళ్లు, దుర్గమ్మలోళ్లు అని పిలుస్తారు. వీరు ఆకులతో అల్లే తొట్లె చాలా బాగుంటుంది. ఈ వాయిద్యాన్నిఎక్కువగా మధ్యప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలలో ఆదివాసీలు వాయిస్తారు. వీరు చేసే దుర్గమ్మ కొలుపు’నకు చాలా ప్రాధాన్యం ఉంది. ఇంట్లో శుభకార్యాలు జరిగేటప్పుడు, దుర్గమ్మకు మొక్కులు అప్పగించడానికి ‘దుర్గమ్మ కొలుపు’ నిర్వహిస్తారు. ‘దుర్గమ్మ కొలుపు’తో మొక్కు చెల్లిస్తే, అంతా మంచి జరుగుతుందని ప్రజల నమ్మకం. అర్ధరాత్రి ప్రారంభమయ్యే ఈ కొలుపు, తెల్లవారేదాకా నిర్విరామంగా సాగుతుంది. అనర్గళంగా, గంటల తరబడి కథ చెప్పగల నైపుణ్యం దుబ్బులోళ్ల సొంతం.[4]

మూలాలు

[మార్చు]
  1. "అడవులు, పల్లెల నుంచి వెల్లువెత్తిన 'మూలధ్వని' | జాతర | www.NavaTelangana.com". m.navatelangana.com. Retrieved 2022-03-19.
  2. జయధీర్, తిరుమలరావు; గూడూరి, మనోజ (2019). మూలధ్వని (జానపద గిరిజన సంగీత వాద్యాల సామజిక చరిత్ర ).
  3. telugu, NT News. "Dubbula kolupu Durgamma puja Archives". Namasthe Telangana. Retrieved 2022-03-19.
  4. "దుర్గమ్మ మేల్కొలుపు.. దుబ్బు కొలుపు".