దుర్గం చెరువు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
దుర్గం చెరువు పడమటి కొస నుండి

దుర్గం చెరువు హైదరాబాద్ , నగరంలో మాధాపూర్ మరియు జూబ్లీహిల్స్ సరిహద్దుల్లో ఉన్న చెరువు. నగరం సైబరాబాద్ గా విస్తరించకముందు ఈ చెరువు లోయలో, కొండల మధ్య సుందరంగా ఉండి, ఎక్కువమందికి ఎరుక లేకుండా కేవలం కొద్ది మంది ఉత్సాహవంతులకు, ప్రేమికులకు, సాహసికులకు మాత్రమే తెలిసి ఉండేది. అందువల్ల సీక్రెట్ లేక్, లేదా రహస్య చెరువు అని మారు పేరు ఉంది. ఇప్పటికీ తస సౌందర్యాన్ని కోల్పోకుండా పర్యాటకులను కనువిందు చేస్తుంది. నీరు మురికిగా మారాయి అందువల్ల బోటింగ్, హోటల్ వంటివి విజయవంతం కాలేదు. కానీ చూపులకు దూరం నుండి అందంగానే ఉంది.

జూబ్లీ హిల్స్, మాదాపూర్ ప్రాంతానికి మధ్యలో దాగి ఉండడం వల్ల ఈ సరస్సు ని రహస్యపు సరస్సుగా కూడా పిలుస్తారు. హైదరాబాద్ ప్రజలలో ఈ సరస్సుకి అత్యంత చారిత్రక ప్రాముఖ్యత కలిగినది. ఖుతుబ్ షా సామ్రాజ్యంలో, గోల్కొండ కోటలో ఇంకా కోట సమీపంలో ఉన్న ప్రజలకి మంచి నీటి సదుపాయం ఈ సరస్సు కల్పించింది. రైతులు వ్యవసాయంలో నీటి పారుదల కోసం ఈ సరస్సుని ఉపయోగించేవారు. ప్రధాన పర్యాటక ఆకర్షణ గా ఈ సరస్సుని తయారు చెయ్యడం కోసం 2001 లో రాష్ట్ర ప్రభుత్వం ఈ సరస్సుని అభివృద్ధి చెయ్యాలని నిర్ణయించింది. కొద్ది కాలంలోనే ఈ సరస్సు ఏంతో ప్రాచుర్యం పొందింది. ఇక్కడ చేపలు పట్టేందుకు అనువుగా ఉంటుంది. ఎంతో మంది సరదాగా చేపలు పట్టడం కోసం ఇక్కడికి వస్తారు. ఈ ప్రాంతాన్ని ప్రధాన పర్యాటక ఆకర్షణగా మలిచేందుకు వెలుగులు, రాక్ గార్డెన్, ఫ్లోటింగ్ ఫౌంటెన్ అలాగే కృతిమ జలపాతాల వంటి ఎన్నో ఆకర్షణలని ఇక్కడ జోడించారు. ట్రెక్కింగ్, రాక్ క్లైంబింగ్ ఇంకా రాపెల్లింగ్ వంటి వివిధ వినోద కార్యక్రమాలు ఇక్కడ ఎన్నో ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఈ చెరువుపై వేలాడే వంతెనను నిర్మిస్తున్నది.[1]

మూలాలు[మార్చు]

  1. నమస్తే తెలంగాణ, అల్వాల్ చెరువు (15 October 2017). "నగరంలో చెరువులు.. పర్యాటక నెలవులు". Retrieved 12 December 2017.