Jump to content

దులపర బుల్లోడో

వికీపీడియా నుండి


దులపర బుల్లోడో హోయ్ హోయ్
దులపర బుల్లోడో దుమ్ము దులపర బుల్లోడో
పిల్లి కళ్ళతో షికార్లు కొట్టే
మలపు రాములను పిలక బట్టుకొని
one two three చెప్పి...(దులపర)

సిరిగల చుక్కల చీర కట్టుకొని
జవాది కలిపిన బొట్టు పెట్టుకొని(సిరిగల)
వరాల బొమ్మ ముద్దులగుమ్మ
కాలేజికి కదిలిందంటే వెకిలివెకిలిగా
వెర్రివెర్రిగా వెంటపడే
రౌడిల పట్టుకొని...పట్టుకొని
తళాంగు తధిగిణ తక తోం తోం అని(2)(దులపర)

సంప్రదాయమగు చక్కని పిల్ల
సాయంకాలం సినిమాకొస్తే..వస్తే
ఇదే సమయమని ఇంతే చాలునని
పక్క సీటులో బైటాయించుకొని ఎట్టా
చీకటి మరుగున చేతులు వేసే
శిఖండిగాళ్ళను ఒడిసి పట్టుకొని
చింతబరికెను చేత పట్టుకొని

రోడ్డు పట్టని కారులున్నవని
మూడంతస్తుల మేడలున్నవని
డబ్బు చూచి ఎటువంటి ఆడది
తప్పకుండ తమ వల్లో పడునని
ఈలలు వేసి సైగలు చేసే
గోల చేయు సోగ్గాళ్ళను బట్టి పట్టి
వీపుకు బాగా సున్నం పెట్టి

మాయామర్మం తెలియని చిన్నది
మంగళగిరి తిరనాళ్ళకు పొతే...పొతే
జనం ఒత్తిడికి సతమతమవుతూ
దిక్కుతోచక తికమక పడితే అయ్యయ్యో
సందు చూసుకొని సరసాలకు దిగు
గ్రంధసాంగులను కాపు వేసుకొని
రమా రమణ గోవిందా...