దూదిపాల జ్యోతిరెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

దూదిపాల జ్యోతిరెడ్డి ఒక మహిళా పారిశ్రామికవేత్త, 'కీ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్' కంపెనీ ముఖ్య కార్య నిర్వహణ అధికారి.[1][2][3][4][5]

జీవిత విశేషాలు[మార్చు]

జ్యోతిరెడ్డి 1970లో భారతదేశం,తెలంగాణ రాష్ట్రం, వరంగల్ సమీపంలోని నర్సిమూలగూడెంలో ఒక పేద కుటుంబంలో జన్మించారు. ఇంట్లో చదివించడానికి స్తోమత లేనందున ఆమెకు, ఆమె చెల్లిని ఓ సెమీ ఆర్ఫాన్ స్కూల్ జాయిన్ చేశారు. కొంతకాలం అచ్చటే ఉన్నాఅమె ఆ ఆర్ఫాన్ స్కూల్ లో ఉండలేక జ్యోతిరెడ్డి వాళ్ల చెల్లి ఇంటికి తిరిగి వెళ్లిపోయారు. ఎలాగోలా పదవతరగతి పూర్తి చేశారు. చదువుకుంటానని ఎంత మొత్తుకున్నా ఇంట్లో పెద్దోళ్లు వినలేదు. ఇంటర్మీడియెట్ జాయిన్ అయినా పట్టించుకోకుండా పెళ్ళి చేసేసారు. ఇద్దరు పిల్లలు. ఉమ్మడి కుటుంబానికి తోడైన పేదరికం. ఈ పరిస్థితుల్లో రోజూ వ్యవసాయం పనులకోసం పొలానికి వెళ్లడమే జ్యోతిరెడ్డి దినచర్య. సాయంకాలానికి ఇంటికి చేరి పిల్లలతో గడపడమే తెలుసు. ఆ తర్వాత ఉమ్మడి కుటుంబం వేరుపడింది.[6]

ఉద్యోగం[మార్చు]

భర్త ఇంటి బాధ్యతలనుండి తప్పుకున్న కారణంగా ఆమె చంటి పిల్లలతో ఇంటి బాధ్యత ఎత్తుకోవలసి వచ్చింది. అప్పుడు నెహ్రూ యువ కేంద్ర అనే ఓ స్వచ్ఛంద సంస్థ ద్వారా దారి కనపడింది. ఆ సంస్థ పల్లెల్లో నైట్ స్కూళ్లు ఏర్పాటు చేసింది. దాంట్లో టీచర్ గా అవకాశం వచ్చింది. అప్పుడు జ్యోతి రెడ్డి జీతం నెలకి 120 రూపాయలు. ఆ తర్వాత అదే సంస్థలో ప్రమోషన్. ఉన్న ఊరు మారాల్సి వచ్చింది. జ్యోతిరెడ్డి కుటుంబం హన్మకొండకు వెళ్లిపోవాల్సి వచ్చింది. కానీ ఈ మార్పు ఆమె భర్తకు నచ్చకుండానే జరిగింది. హన్మకొండ నుంచి వేరు వేరు ఊళ్లకు ప్రయాణించడంలో తన జీవిత ప్రయాణం వెతుకున్నారు జ్యోతి. అప్పుడే ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ పాసయ్యారు. ఆ తర్వాత టీచర్ ఉద్యోగం వచ్చింది. జీవితంలో పెద్ద మార్పంటూ వచ్చింది అక్కడే. ట్రెయిన్లో చీరలు అమ్మారు. స్కూల్ టీచర్ గా తన కెరీర్ కొనసాగించారు.[7]

అమెరికా అవకాశం[మార్చు]

అమెరికా నుంచి తెలిసిన వాళ్ల అమ్మాయి హన్మకొండ వచ్చారు. ఆ అమ్మాయి ప్రోత్సాహంతో ఆమె అమెరికాకు ప్రయానమయ్యింది. ఆ స్నేహితురాలి మాటలు జ్యోతిరెడ్డి జీవితాన్ని మర్చేసింది. అప్పటికే హైదరాబాదులోని హిమాయత్ నగర్లో కంప్యూటర్ కోర్స్ లో జాయిన్ అయ్యారు. పాస్ పోర్ట్ కూడా అప్లై చేశారు. అమెరికా వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ మొదటిసారి వీసా రిజెక్ట్ అయింది. ప్రయత్నంలో లోపం లేదు కనక మరోసారి ప్రయత్నించడంలో తప్పులేదని అనుకున్నారు. కానీ విజిటింగ్ వీసాలో అమెరికా పంపడానికి తెలిసిన వాళ్లు ఒప్పుకున్నారు. అమెరికాలో ఒక క్యాసెట్ షాప్ లో సేల్ గాళ్ గా జాయిన్ అయ్యారు. రోజుకి 5 డాలర్ల ఉద్యోగం. అలా జ్యోతి అమెరికా కెరీర్ ప్రారంభమైంది. ఆ షాప్ కి వచ్చిన ఓ వరంగల్ ఎన్నారై ఆమెను చూసి మీరు టీచర్ కదా అని అడిగారు. మీరిక్కడ ఏం చేస్తున్నారు.. మీ స్కిల్ కి ఇది తగిన ఉద్యోగం కాదని చెప్పేసి వెళ్లిపోయారు. కొన్ని రోజుల తర్వాత ఆ వ్యక్తి జ్యోతిరెడ్డికి ఫోన్ చేసి రిక్రూటర్ ఉద్యోగం యిప్పించాడు. సాఫీగా సాగుతున్న ఉద్యోగం. ఇంతలో 5 వేల డాలర్ల ఆఫర్ వచ్చింది. ఓ రిక్రూట్మెంట్ కంపెనీలో 50 శాతం షేర్ ఇస్తామన్నారు. ఎలాంటి ఆలోచన చేయకుండా ఉద్యోగానికి రిజైన్ చేసి అక్కడకి వెళ్లిపోయారు. కానీ ఆ ఉద్యోగంలో చేరాక తెలిసింది. ఆ కంపెనీ వాళ్లు లాభాల్లో యాభై శాతం అన్నారు. దీంతో డీల్ వర్కవుట్ కాలేదు. అప్పటికి వర్జీనియాలో నెలకి 5వేల డాలర్ల ఉద్యోగం పోయి, ఇటు డీల్ జరక్క ఏం చేయాలో పాలుపోలేదట ఇక ఆ తర్వాత ఉద్యోగ ప్రయత్నాలు ఫలించలేదు. జీవితం చీకట్లోకి వెళ్లిపోయింది.

ఫినిక్స్ ప్రారంభం[మార్చు]

ఆమె ఫినిక్స్ లో కీ సాఫ్ట్ వేర్ సొల్యూషన్స్ (Key Software Solution) అనే సంస్థను ప్రారంభించింది. ఆ తర్వాత తిరిగి చూసుకోలేదు. ఏటికేడు ప్రయాణం.. ఒక్కో మజిలీ దాటుతూ వచ్చింది. ఇప్పుడు Key Software మిలియన్ డాలర్ల కంపెనీగా అవతరించింది. పూర్తిస్థాయి సేవకార్యక్రమాలకు జ్యోతి టైం కేటాయిస్తున్నారు. ఆర్ఫాన్ స్కూళ్ల ఏర్పాటుపై పోరాటం చేస్తున్నారు. తనతో కలసి వచ్చేవారికి ఆహ్వానం పలుకున్నారు.

పురస్కారాలు[మార్చు]

కంపెనీ పెట్టిన తర్వాత ఎన్నో అవార్డులు, రివార్డులు వచ్చాయి. ఎన్నారై సంఘాల్లో ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఆమెకు తెలంగాణ ప్రభుత్వం నుండి శాంతిదూత అవార్డు వచ్చింది.[8]

మూలాలు[మార్చు]

 9. http://hersaga.com/jyothi-reddy-story/ Archived 2020-07-13 at the Wayback Machine   
10. http://www.ficciflo.com/events/life-stories-true-tales-dr-jyothi-reddy-screening-movie-kajal/    
11. https://www.bhaskar.com/national-news/success-story-of-jyothi-reddy-founder-of-keys-software-solutions-5955027.html    
12. https://telanganatoday.com/covid-19-nri-jyothi-reddy-donates-rs-1-lakh-to-cmrf

ఇతర లింకులు[మార్చు]