Jump to content

దూద్‌పత్రి

వికీపీడియా నుండి
దూద్‌పత్రి
హిల్ స్టేషన్
దూద్‌పత్రి డెవలప్‌మెంట్ అథారిటీ

దూద్‌పత్రి ప్రకృతి దృశ్యం
Nickname: 
వ్యాలీ ఆఫ్ మిల్క్
Motto(s): 
వి సర్వ్, వి ఇన్వైట్ యు టు విజిట్ అజ్
దేశం భారతదేశం
రీజియన్జమ్మూ కాశ్మీర్
జిల్లాబుద్గాం జిల్లా
తాలూకాఖాన్ సాహిబ్
Named forనీటి తెల్లని స్వరూపం
Government
 • Bodyదూద్‌పత్రి డెవలప్‌మెంట్ అథారిటీ
Elevation
2,730 మీ (8,960 అ.)
భాషలు
 • అధికారకాశ్మీరీ, ఉర్దూ, హిందీ, డోగ్రి, ఇంగ్లీష్[1][2]
భాషలు
 • ప్రాంతీయకాశ్మీరీ, గుజారీ, పహాడీ
Time zoneUTC+5:30 (IST)
Pin Code
191111
Vehicle registrationJK04

దూద్‌పత్రి దీనిని వ్యాలీ ఆఫ్ మిల్క్ అని కూడ అంటారు. ఇది భారతదేశం, జమ్మూ కాశ్మీర్‌, బుద్గాం జిల్లా, ఖాన్ సాహిబ్ తాలూకాలో ఉంది. దూద్‌పత్రి, జమ్మూ కాశ్మీర్‌లోని పర్యాటక ప్రదేశం, హిల్ స్టేషన్. ఇది సముద్ర మట్టానికి 2,730 మీటర్లు (8,960 అడుగులు) ఎత్తులో ఉంది.[3]

చరిత్ర

[మార్చు]

దూద్‌పత్రి అంటే "పాల లోయ" అని అర్థం. కాశ్మీర్‌లోని ప్రసిద్ధ సాధువు, షేక్ ఉల్ ఆలం షేక్ నూర్ దిన్ నూరానీ ఇక్కడ ప్రార్థన చేయడానికి పచ్చిక బయళ్లలో నీటి కోసం వెతుకుతున్నప్పుడు, అతను కర్రతో నేలను పొడిచాడు. అపుడు నీళ్లకు బదులు పాలు బయటకు వచ్చాయి. అయితే పాలు తాగడానికి మాత్రమే ఉపయోగపడుతాయని, అభ్యంగన స్నానం చేయడానికి పనికి రావని అన్నాడు. ఇది విన్న పాలు ఒక్కసారిగా తన స్థితిని నీరుగా మార్చడం వలన ఈ పచ్చికభూమికి దూద్‌పత్రి అని పేరు వచ్చింది.[4]

భౌగోళికం

[మార్చు]

ఇది సముద్ర మట్టానికి 2,730 మీ (8,957 అడుగులు) ఎత్తులో హిమాలయాలలోని పీర్ పంజాల్ శ్రేణిలో గిన్నె ఆకారంలో ఉన్న లోయలో ఉంది. ఇక్కడ మంచుతో కప్పబడిన పర్వతాలు, పైన్, ఫిర్, దేవదారు వంటి చెట్లు ఉంటాయి. ఇక్కడ శీతాకాలంలో పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటుంది, వసంత ఋతువు, వేసవి కాలంలో డైసీలు, మరపు-నా-నాట్స్, బటర్‌కప్‌ల వంటి అడవి పువ్వుల పెరుగుతాయి. ఏడాది పొడవునా ఇక్కడ చాలా చలిగా ఉంటుంది. విశాలమైన పచ్చిక బయళ్లపై పచ్చటి గడ్డి, భారీ బండరాళ్ల మీదుగా ప్రవహించే వాగులు దూద్‌పత్రి అందాన్నిపెంచుతాయి. ప్రసిద్ధ తోసమైదాన్ దూద్‌పత్రికి పశ్చిమాన ఉంది.[5]

జనాభా గణాంకాలు

[మార్చు]

దూద్‌పత్రిలో శాశ్వత నివాసాలు లేవు, చలికాలంలో తీవ్రమైన హిమపాతం కారణంగా ఇక్కడ ఎవరు ఉండరు. బుద్గాం జిల్లాలోని మైదాన ప్రాంతాల నుండి గొర్రెల కాపరులు వేసవిలో తమ పశువులను మేత కోసం దూద్‌పత్రికి తీసుకువస్తారు, వారు దాదాపు ఆరు నెలల పాటు కాలానుగుణంగా ఇక్కడ ఉంటారు.

రవాణా

[మార్చు]

ధూత్‌పత్రికి, శ్రీనగర్ లేదా శ్రీనగర్ విమానాశ్రయం నుండి 2-3 గంటల్లో కారు లేదా బస్సు ద్వారా సులభంగా చేరుకోవచ్చు. ఇక్కడికి చేరుకోవడానికి శ్రీనగర్-పట్గాం-ఖాన్సాహిబ్-ఇరాయార్ మీదుగా మొత్తం 42 కిమీ (26 మైళ్ళు) ప్రయాణించాలి, మరొక మార్గం శ్రీనగర్ నుండి గుల్మార్గ్ రహదారి వరకు, ఈ మార్గం శ్రీనగర్-మాగం-బీర్వా- జైంగం-అరిజల్ మీదుగా దూద్‌పత్రి వరకు మొత్తం 50 కిమీ (31 మైళ్ళు) దూరం ఉంటుంది.[6] [7] [8]

మూలాలు

[మార్చు]
  1. "The Jammu and Kashmir Official Languages Act, 2020" (PDF). The Gazette of India. 27 September 2020. Retrieved 27 September 2020.
  2. "Parliament passes JK Official Languages Bill, 2020". Rising Kashmir. 23 September 2020. Archived from the original on 24 సెప్టెంబరు 2020. Retrieved 30 May 2021. {{cite news}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  3. "Doodhpathri | District Budgam , Government of Jammu & Kashmir | India". Retrieved 2023-06-24.
  4. "Doodhpathri - Kashmir Travels". kashmirtravels.com. Archived from the original on 2023-05-04. Retrieved 2023-06-24.
  5. "The unexplored wealth of Doodhpathri". www.greaterkashmir.com. Retrieved 2015-10-13.
  6. "Doodhpathri". www.daletravels.net. Archived from the original on 2015-08-17. Retrieved 2015-10-13. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  7. "Unexplored Doodhpathri". kashmirscan.net. Archived from the original on 2013-12-16. Retrieved 2015-10-13. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  8. "Doodhpathri". budgam.nic.in. Retrieved 14 January 2021.