దూసి రామమూర్తి శాస్త్రి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

దూసి రామమూర్తి శాస్త్రి గారు సంస్కృతాంద్ర పండితులుగా ప్రసిద్ధులు: విద్వాన్ దూసి రామ మూర్థి శాస్త్రి గారు విజయనగర మహా రాజా వారి సంస్కృత కళాశాలలో ఆంధ్ర పండితులుగా పనిచేశారు. వీరు వర్ఘుల శీతారామ శాత్రిగారి శిష్యులు. భారతి వంటి ఎన్నో పత్రికలలో సాహిత్య సంభందమైన ప్రామాణిక గ్రంథాలు వ్రాసారు. చిన్నయసూరి గారి బాల వ్యాకరణానికి సారస్య సర్వస్య పేటిక అనే వ్యాఖ్యాన గ్రంథం వ్రాశారు.[[1] 'ఉదయ సుందరి ' సోడ్డల కవి గ్రంథానికి అను వాదం.

తెలుగులో బౌధ్ద సాహిత్యం

[మార్చు]

తెలుగులో బౌద్ధ సాహిత్యం చాల ఎక్కువగానె వచ్చింది. అది అనేక సాహిత్య ప్రక్రియల్లోనే కాకుడా బౌద్ధ శిల్పం, కళల గురించి అనేక రచనలు వెలువడ్డాయి. బౌద్ధం ప్రచారం చేసిన అష్టాంగ మార్గం, త్రిపిటకాలు, బోల్ధనలు, మొదలగునవి అనువాద రూపలో అచ్చయ్యాయి. వందలాది నాటికలు, గేయాలు, కథలు, పద్యాలు బౌద్ధ మత ప్రాశస్త్యం గురించి తెలుగులో అచ్చాయ్యాయి.

దూసి రామమూర్తి గారి గ్రంథం

[మార్చు]

దూసి రామ మూర్తి గారు గౌతమ బుద్ధుని జీవితము అనే గ్రంథాన్ని 24 ఏప్రిల్ 1929 వ్రాశారు. కాని కొన్ని కారణాంతార వలన అది అచ్చుకు నోచుకోలేదు. రాజ మండ్రి వాస్తవ్యువులు శ్రీ విశ్వ నాథ గోపాల కృష్ణ గారు గౌతమీ విద్యా పీఠం ప్రాచ్య కళాశాల, ప్రధానోపాధ్యాయులుగా వున్నప్పుడు ఆ గ్రంథ ప్రతిని వెలుగులోకి తెచ్చారు. అన్ని విధాల సమగ్రముగా నున్న ఈ గ్రంథం మంజరీ ద్విపదలో రచించారు. ఈ గ్రంథంలో సమయోచిత సంభాషణలు, సందర్భాను సారమైన వర్ణనలు ఉన్నాయి.

ప్రచురణ

[మార్చు]

ఈ గ్రంథాన్ని గౌతమ బుద్ధుని జీవితము ... ద్విపద కావ్యం అనేపేరుతో 'ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రాచ్య లిఖిత గ్రంథాలయం, పరిశోధనాలయం వారఉ ' 2006 లో ప్రచురించారు.

మూలాలు

[మార్చు]
  1. https://archive.org/details/balavyakaranam014578mbp ఆర్కీవు.కాం లో దూసివారి బాలవ్యాకరణ వ్యాఖ్య.]

{మూలం} జయధీర్ తిరుమల రావు, డైరెక్టర్, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రాచ్య లిఖిత గ్రంథాలయం, పరిశోధనాలయం వారు గ్రంథానికి వ్రాసిన ముందు మాట: