దేవకీనందన శతకము
This article needs more links to other articles to help integrate it into the encyclopedia. (అక్టోబరు 2016) |
| దేవకీనందన శతకము | |
|---|---|
| కవి పేరు | వెన్నెలకంటి జన్నయ్య |
| మొదటి ప్రచురణ తేదీ | 1450 |
| దేశం | భారతదేశం |
| భాష | తెలుగు |
| మకుటం | కృష్ణా దేవకీనందనా! |
| విషయము(లు) | భక్తి |
| పద్యం/గద్యం | పద్యం |
| ఛందస్సు | శార్దూల మత్తేభములు |
| ప్రచురణ కర్త | గద్వాల మహారాణి |
| ప్రచురణ తేదీ | 1929బ్ |
| మొత్తం పద్యముల సంఖ్య | 108 |
ఈ శతకములో కృష్ణా దేవకీనందనా అనే మకుటముతో 108 పద్యాలు ఉన్నాయి[1]. నామమాత్రము విశిష్టమై మఱుగున పడి ఉన్న ఈ శతకాన్ని గద్వాల సంస్థానములోని పుస్తక భాండాగారములో తాళపత్ర లిఖితమై ఉండుట చూచి గద్వాల మహారాణి ముద్రింపించి ప్రకటించింది. ఈ శతకము ద్రాక్షాపాకములో, వైదర్భీరీతిలో, పండిత పామరుల హృదయంగమంగా ఉంది.
కొన్ని పద్యాలు
[మార్చు]శా|| పాత్రాపాత్రవివేకముల్ సమసె పాపం బెచ్చెఁబుణ్యంబులే
మిత్రఘ్నత్వము కల్లలాడుటలు స్వామిద్రోహమున్ కొండెమున్
ధాత్రిం బూజ్యములయ్యె సాధువుల చందంబెట్లు రక్షించెదో
సత్రాజిచిత్తనయామనోరమణకృష్ణా, దేవకీనందనా!
శా|| అందెల్ చిన్ని పసిండి గజ్జెలును మ్రోయన్ మేఖలా ఘంటికల్
క్రందై తోఁపఁగ రావిరేకు నుదుటన్ గన్పింప గోపాంగనా
నందంబొందఁగ వెన్నముద్దలకునై వర్తించు నీ బాల్యపున్
చందంబాది విజుల్ నుతింపఁదగుఁగృష్ణా, దేవకీనందనా!
శా|| నీడల్ దేరెడు చెక్కుటద్దములతో నిద్దంపునెమ్మోముతో
కూడీకూడని చిప్పకూఁకటులతో గోపార్భక శ్రేణితో
వ్రీడాశూన్య కటేరమండలముతో వ్రేపల్లెలో నీవు నాఁ
డాడేశైశవమూర్తినేఁ దలఁతుఁగృష్ణా, దేవకీనందనా!
మ|| అమరుల్ పద్మజువ్రాఁత దాఁట రెవఁడొక్కబ్దంబు పెడయ్యె దు
ర్దమదోర్దండ పటు ప్రతాపనిజసంరంభామరానిక వి
క్రమ దుర్వారగజాసుర ప్రళయమింకం జేసిన ట్టీశ్వరున్
సమరక్షోణిజయించు నర్జునుఁడు కృష్ణా, దేవకీనందనా!
మూలాలు
[మార్చు]- ↑ Archived 2016-03-05 at the Wayback Machine భారతి మాసపత్రిక ఫిబ్రవరి 1930 సంచికలో బులుసు నరసింహశాస్త్రి సమీక్ష