Jump to content

దేవిశెట్టి చలపతిరావు

వికీపీడియా నుండి
దేవిశెట్టి చలపతిరావు
వ్యక్తిగతం
జననం(1946-09-12)1946 సెప్టెంబరు 12
మతంహిందూ మతం
Philosophy"అద్వైత వేదాంత"
Senior posting
Literary worksసామాజిక రచయిత, ఆధ్యాత్మికవేత్త.ఆధ్యాత్మిక జ్ఞానపీఠ మఠం వ్యవస్థాపకులు.

దేవిశెట్టి చలపతిరావు తెలుగు రచయిత,[1] ఒక ఆధ్యాత్మిక గురువు.[2]

బాల్యం, విద్య, తల్లిదండ్రులు

[మార్చు]

1946 సెప్టెంబర్ 12వ తేదీన గుంటూరు జిల్లా తుర్లపాడు గ్రామంలో జన్మించాడు. తండ్రి వీరరాఘవయ్య, తల్లి పుల్లమ్మ. వీరి నివాసం చిలకలూరిపేట. ప్రాధమికవిద్య తుర్లపాడు గ్రామంలోను, ఉన్నత విద్య చిలకలూరిపేటలోను అభ్యసించి, బాపట్ల వ్యవసాయకళాశాల నుండి బి.ఎస్.సి(వ్యవసాయం) ప్రధమశ్రేణిలో ఉత్తీర్ణులయ్యాడు.

రచనలు

[మార్చు]

1994లో వేదాంత విషయాలు సులభంగా అర్థమయ్యేరీతిలో ‘కర్మసిద్ధాంతం’ అనే గ్రంధాన్ని రచించి ప్రచురింపజేశాడు. తిరిగి 2002లోను, 2008లోను, 2009లోను, 2013లోను, 2015లోను, 2018లోను ముద్రణ జరిగింది. 1998లో శుక్లయజుర్వేదము నందలి ‘ఈశావాస్యోపనిషత్తు’ గ్రంధం అందరికి అర్ధమయ్యే విధంగా సరళమైన, వాడుకభాషలో ఈ గ్రంధం వ్రాసి ప్రచురింపజేశాడు[3].

ఇవిగాక ‘శ్రీ నారదభక్తిసూత్రాలు’, శంకరాచార్యుల ‘ఆత్మబోధ’, ‘శ్రీ దక్షిణామూర్తిస్తోత్రం’ పై ఎంతో వివరణాత్మకంగా, సోదాహరణంగా, విపులమైన వ్యాఖ్యను వ్రాసి ప్రచురింపచేశాడు. 2013లో సదాశివబ్రహ్మేంద్రసరస్వతి స్వామి ‘ఆత్మవిద్యావిలాసం’, భగవద్గీత 3, 4, 5 అధ్యాయములను ప్రచురింపచేశాడు. 2015 లో ముండకోపనిషత్తు, కఠోపనిషత్తు, భగవద్గీత 6 నుండి 18 అధ్యాయములు ప్రచురింపజేశాడు. 2017 లో బ్రహ్మసూత్రములపై వ్యాఖ్యను ప్రచురింపజేశాడు. 2019లో వివేకచూడామణిపై విపులమైన వ్యాఖ్యను 8 గ్రంధముల భాగాలుగా ప్రచురింపజేశాడు. 2020లో శ్రీగురుగీతను 3 గ్రంధముల భాగాలుగా ప్రచురింపజేశాడు. అలాగే 108వ ఉపనిషత్తు ముక్తికోపనిషత్తును ప్రచురింపజేశాడు. ఇవిగాక విజయవాడ నుండి వెలువడే ధ్యానమాలిక మాసపత్రికలో 2008 నుండి భగవద్గీతను, 2009 నుండి మహాభారతమును ధారావాహికంగా ప్రచురిస్తున్నాడు[4].

ఆధ్యాత్మికం

[మార్చు]

1994 లో ‘ఆధ్యాత్మిక జ్ఞానపీఠాన్ని’ స్థాపించి, ప్రసన్న బండ్లమాంబ రాజమాతాదేవిచే ప్రారంభింపజేశాడు. అప్పటి నుండి ప్రతిరోజూ సత్సంగము, ప్రతినెల గీతాపారాయణలతోపాటు శ్రీకృష్ణ జన్మాష్టమి, గీతాజయంతి, శంకరాచార్యజయంతి, రమణమహర్షి జయంతి, ఆషాఢ - కార్తీక - మాఘ - వైశాఖ పౌర్ణమిల యందు ఆధ్యాత్మిక సదస్సులు, జన్మదినోత్సవం, విజ్ఞానయాత్రలు, వనసమారాధనలు, ధ్యానతరగతులు, వార్షికోత్సవం మొదలగు అనేక కార్యక్రమాలను జరుపుకొనుటలోను, నిరంతర జప, ధ్యాన, ఆత్మవిచారణ, సాక్షీభావన, బ్రహ్మనిష్ఠ మొ||న సాధనలతో, పూర్తి ఆధ్యాత్మిక జీవితం గడుపుచున్నాడు.

మూలాలు

[మార్చు]
  1. "చలపతిరావు పుస్తకాలు".{{cite web}}: CS1 maint: url-status (link)
  2. "చలపతిరావు మరిన్ని వివరాలు".{{cite web}}: CS1 maint: url-status (link)
  3. "దేవిశెట్టి చలపతిరావు పుస్తకాలు".{{cite web}}: CS1 maint: url-status (link)
  4. స్వామీజీ, దేవి శెట్టి చలపతిరావు. "పరంజ్యోతి".