Jump to content

దొంతులమ్మ

వికీపీడియా నుండి

దొంతులమ్మ ఆంధ్ర యోగిని, అవధూత. ఆమె అరవైయేళ్ళ వయసులో కూడా నెత్తిమీద నీళ్ళ కుండల్ని దొంతలుగా పెట్టుకొని మోస్తూ ఉండేది. అందువల్ల ఆ ప్రాంత జనం ఆమెను "దొంతులమ్మ" అని పిలిచేవారు. ఆమె తన అరువది యేళ్ల వయసుకో కృష్ణా జిల్లా మచిలీపట్నం చేరింది. ఒక యోగి ఆమెకు దర్శనం ఇచ్చి సంసార బంధాలను వదిలెయ మని ఆదేశిస్తే, భర్త అనుమతితో ఇల్లు వదిలి వచ్చేసింది . దీక్ష నిచ్చి పంపాడు యోగి .ఆమె అవధూతగా మారి ఏంతో దూరం నడచి శ్రీ శైలం చేరింది .దిగంబరంగా తిరిగేది .బాహ్య స్పృహ ఉండేది కాదు .నిరంతరం సమాధి స్థితిలో ఉండేది .

మహిమలు

[మార్చు]

ఆమె బందరు చేరి జగన్నాధపురంలో ఉండేది. ఆమెను కర్రతో కొట్టబోయిన బోయిన వాడి చేయి చచ్చుపడిపోయింది. తర్వాత ఆమె అనుగ్రహంతో బాగయిపోయింది. ఒకరోజు ఆమె ఒక న్యాయవాది అరుగుపై కూర్చుని ఉండగా ఆయన కోపంతో ఆమె బట్టల మూటను కాలితో తన్నాడు. ఆమె నవ్వుతూ వెళ్ళిపోయింది. తరువాత ఆయన కాలు మంటలకు గురై చాలా బాధపడ్డాడు. ఇటువంటి అనేక మహిమలు ఆ ప్రాంతంలో జరిగాయి. ఈ మహిమలు క్రమంగా అంతటా వ్యాప్తి చెందాయి. ఒకరోజు ఆమె బందరు రోడ్డు ప్రక్క ఒక అరుగుపై ముటలతో కూర్చుని ఉంది. ముగ్గురు చల్లపల్లికి చెందిన దేవాంగ కులస్తులు అయిన వర్తకులు బందరులో బట్టల వ్యాపారం కోసం వచ్చి రాత్రి ఆమె ఉండే ప్రదేశానికీ చేరారు. వారు ఈ దొంతులమ్మ ఏదైనా చేస్తుందేమోనని భయపడ్డారు. కానీ ఆమె కళ్ళనుండి సూర్యకిరణాలు వెలువడినవి. వాటిని చూసి ఆ వర్తకులు ఆశ్చర్యానికి లోనయి

ఆమె శిష్యులైనారు. ఆమె వారికి పిలిచి కారం ముద్దను వారి నోటికి అందించింది. అది తీపి పదార్ధంగా మధురంగా మారినది. వారు బందరు వచ్చినప్పుడల్లా అమెను కలుసుకొని వెళ్ళేవారు.

ఆమె మిరపకాలయలు, ఉల్లి పాయలు, ఉప్పు తన గోనే సంచి కింద దాచి ప్రసాదంగా పెట్టేది .అవి అతి మధురాలయ్యేవి .ఆమె యే కొట్టు దగ్గర నిలబడితే ఆ కొట్టు ఆ రోజు విపరీతంగా లాభాలు గడించటం అందరికి అనుభవం .బ్రతి మాలి రప్పించు కొనే వారు .సర్కిల్ పేటలో చోడవరపు సుబ్బమ్మ అనే వితంతువు దత్త పుత్రుడు అమ్మ చెప్పినట్లే చని పోయాడు .ఈ విషయం ఆమెకు చెప్పటానికి వెళ్తే అమ్మ మండ్ర గబ్బల మీద కూర్చున్న దృశ్యం చూసి చకితురాలై ఆమె మహిమ అపరిమితం అని గ్రహించింది .ఆమెకు దత్త పుత్రుని మరణంతో పరీక్షించి వైరాగ్యం బోధించి శిష్యురాలిని చేసుకొన్నది .

ఒకాయన ఉపదేశం కోసం వస్తే అర్ధ రాత్రి శ్మశానానికి రమ్మన్నది .అతడు అలానే వెళ్లాడు .ఆమె పెద్ద పులి రూపంలో కని పించి భయ పెట్టింది .ఆయన పారి పోయాడని తెలుస్తోంది .పరీక్షించ కుండా ఎవరికి దీక్షనిచ్చేది కాదు చెరుకూరి పద్మ నాభ ప్రసాద్ బహాద్దర్ పక్ష వాతంతో కుడికాలు చచ్చు పడింది .ఆ కుటుంబం అమ్మ దగ్గరకు వచ్చి శరణు వేడింది .అమ్మ తన కాలును ఆతని కాలుతో గుడ్డ పేలికతో కట్టింది .కాసేపు అయిన తర్వాత ఆయన పక్షవాతం మాయ మైంది .అప్పట్నించి ఆ కుటుంబానికి ఆమె రక్ష .వాళ్లకు ఒక కూతురుండేది .ఆమెను అమ్మ ‘’రాణీ ‘’అని సంబోధించేది .ఆమెను చల్ల పల్లి జమీందార్ యార్ల గడ్డ శివ రామ ప్రసాద్ బహాద్దర్ గారికి ఇచ్చి వివాహం చేయాలని పద్మ నాభ ప్రసాద్ గారు భావించారు .కాని రాజా గారికి చేసుకోవటం ఇష్టం లేదు .కాని అమ్మ ధైర్యం చెప్పింది .ఈ పిల్లను మర్నాడే ముక్త్యాల జమీందార్ దత్తత తీసుకొని చల్ల పల్లి రాజా గారికిచ్చి వివాహం చేశారు .చల్ల పల్లి కోటలో దొంతులమ్మ అమ్మ వారికి ఘన సన్మానం చేశారు .

కారు మూరి కృష్ణ మూర్తి అనే ఆయన అమ్మ దగ్గర దీక్ష కోసం వచ్చాడు .ఆయన రామ తారక మంత్రాన్ని25 లక్షల సార్లు ,బాల మంత్రాన్ని ఏడు లక్షల సార్లు ,ప్రసన్నాంజనేయ మంత్రాన్ని నాలుగు లక్షల సార్లు జపించిన మహా పురుషుడు .అనేక సమారాధనలు ,అన్న సంతర్పణలు చేసిన కర్మిష్టి ..చీమల కోసం అయిదు మణుగుల పంచదార ను పోసిన భూత దయా పరుడు .అమ్మ అనుగ్రహం పొంది ఉపదేశం పొంది శిష్యుడై ఆమె తల పెట్టిన అనే సత్కార్యాలు నిర్వహించిన ఘనుడు కృష్ణ మూర్తి .బాబా మస్తాన్ అనే మహనీయుడు అమ్మతో అర్ధ రాత్రి దాకా తత్వ విచారణ చేసే వాడు .జొన్న విత్తుల శేష గిరి రావు అనే సంగీత కళా కారుడు నటుడు గురువు దండిస్తాడని భయ పడి అమ్మ పంచ చేరాడు .ఆమె అతన్ని మహా విద్వామ్శుడిని చేసింది .కుర్తాళం సిద్దేశ్వర పీఠానికి అది పతి అయిన కాను కొల్లు త్రివిక్రమ రావు గారు అమ్మ వద్ద జ్ఞాన భిక్ష పొంది ,ఆ తర్వాత సన్య సించి ఆ పీఠ ది పతి అయారు .ఆయనే విశ్వనాధ గారికి గురువు కూడా .మనశ్శాంతి లేని వారు అమ్మను దర్శిస్తే ,చల్లని చూపు తో మానసిక ప్రశాంతత నిచ్చేది అని గ్రంధాలు తెలియ జేస్తున్నాయి .ఆమె ఎప్పుడు ‘’వికల్ప సమాధి ‘’లో ఉండేదని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. అంటే మనస్సునకు ఆత్మ శక్తి స్వరూప అవస్థ కలగటం చేత సమాధి స్థితిలో –వికల్పాలు నష్టపోకుండా, చిత్తాన్ని బ్రహ్మలో లయం చేసి కేవల పర బ్రహ్మలో నిలిపి ఉంచటం అన్న మాట .

నిర్యాణము

[మార్చు]

ఆమె ఫిబ్రవరి 9 1932 రాత్రి పదకొండున్నరకు దేహాన్ని చాలించింది . ఆమె జననం1807 గా భావిస్తారు .దొంతులమ్మ ఉత్స వాలు బందరులో ఘనంగా నిర్వహిస్తారు .మాఘ మాసంలో పద కొండు రోజులు ఆరాధ నా ఉత్సవాలు ఘనంగా జరుగు తాయి .ఆమె విగ్రహం లంబాడి దుస్తులతో అలంకరించి ఉంటుంది ..జీవితం చాలించినా సమాధి నుండి భక్తుల కోర్కెలు తీరుస్తుంద నే నమ్మకం ఉంది .

మూలాలు

[మార్చు]

ఇతర లింకులు

[మార్చు]