దొప్పలపూడి మల్లిఖార్జునరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

దొప్పలపూడి మల్లిఖార్జునరావు వైద్యుడు, కమ్యూనిస్టు సీనియర్‌ నాయకుడు. వైద్యసేవలే నామమాత్రంగా ఉన్న రోజుల్లో ఉచిత వైద్యసేవలందించి ఒక ఆదర్శ ప్రజావైద్యుడిగా పేరు సంపాదించాడు.[1]

జీవిత విశేషాలు

[మార్చు]

ఉన్నత ఆశయాలతో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని భావితరాలకు అందించేందుకు అతను కృషి చేసాడు. సిద్ధాంతాన్ని ప్రచారం చేసేందుకు స్వగృహంలోనే అనేక శాస్త్రవేత్తల విగ్రహాలను, సైన్స్‌ మ్యూజియాన్ని ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలోనే ఒక ప్రత్యేక గుర్తింపును ఆయన తెచ్చుకోగలిగాడు.

అతను వృత్తిరీత్యా డాక్టర్ అయినా, భవిష్యత్తు తరాలకు శాస్త్రీయ విజ్ఞానాన్ని అందించటానికి తన సంపాదన అంతా ఖర్చు పెట్టి, బాపట్ల పట్టణంలోని తన ఇంటి ఆవరణలో, "ఛార్లెస్ డార్విన్ సైన్స్ మ్యూజియం" ఏర్పాటు చేసాడు. ఈ మ్యూజియంలో ప్రముఖ శాస్త్రవేత్తల కాంస్య విగ్రహాలను, విశ్వం, సౌర్య కుటుంబం, గ్రహాలు, జీవ పరిణామం, డార్విన్ సిద్ధాంతాన్ని వివరించే ఛాయా చిత్రాలను ఏర్పాటు చేసారు. హోం థియేటరులో భూమి, ఇతర గ్రహాల పుట్టుక, విశానికి సంబంధించిన పలు సైన్స్ వీడియోలు ప్రదర్శించుచున్నారు. ఈ మ్యూజియం, ఈ ప్రాంతంలో విద్యార్ధులకు బాగా ఉపయోగపడుతున్నది. [2]

అతనికి సైన్స్ అన్నా, ఆవిష్కర్త అన్నా ఎనలేని ప్రేమ. అందుకే 2005 డిసెంబరులో బాపట్ల విజయలక్ష్మీ పురంలోని తన స్వగృహాన్ని ఏకంగా ఒక సైన్స్ మ్యూజియంగా మార్చాడు. ఇంటి ఆవరణలో మానవుడి జీవపరిణామ క్రమాన్ని వివరించే విగ్రహాలను ఏర్పాటు చేసి దానిని డార్విన్ ఉద్యానవనం అని పేరు పెట్టాడు. ఖగోళ శాస్త్రంపై అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో ఆ ఇంట్లో 2009 నుంచి హోం థియేటర్ సాయంతో విద్యార్థులకు వివం, సౌరకుటుంబం, బూమి ఆవిర్భావం, జీవరాశి పుట్టుక తదితర అంశాలను వీడియోలు చిత్రాల ద్వారా వివరించేవాడు.

వీటితో పాటు ఇంటి ఆవరణలో సౌర కుటుంబం, గ్రహాలు, ఉపగ్రహాల భ్రమణం, జీవ పరిణామ సిద్ధాంతం, జయు సిద్ధాంతం, గమన నియమాలు, శక్తి సమతుల్యత నియమాల ద్వారా సైన్స్, శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధికి కృషిచేసిన శాస్త్రవేత్తలు, తత్వవేత్తలు కోపర్నికస్, కారల్ మార్క్స్, డార్విన్, గెలీలియోం హిప్పోక్రటిస్, కెప్లర్, న్యూటన్, లామార్క్, గ్రెగర్ మెండల్, ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ కంస్య విగ్రహాలను ఏర్పాటు చేసాడు. విగహాల కింద గ్రానైట్ స్తూపాలు నిర్మించి శాస్త్రవేత్తల పుట్టిన తేదీలు, వారి ఆవిష్కరణల వివరాలు పొందు పరిచాడు.

10 మంది శాస్త్రవేత్తల విగ్రహాలు ఏర్పాటు చేయడానికి సుమారు 10 లక్షలు ఖర్చు చేసాడు. భవిషత్తులో ఈ మ్యూజియం నిర్వహణ, అభివృద్ది కోసం "ఛార్లెస్ డార్విన్ ట్రస్టు" ను ఏర్పాటు చేసి 50 లక్షల రూపాయలను డిపోజిట్ చేసాడు.

అతను 2019 జనవరి 14న మరణించాడు.

మూలాలు

[మార్చు]
  1. "పేదల గుండె చప్పుడు దొప్పలపూడి - Andhra Pradesh". Dailyhunt (in ఇంగ్లీష్). Retrieved 2020-07-02.
  2. ఈనాడు గుంటూరు రూరల్; 2014,ఏప్రిల్-12;6వపేజీ

బాహ్య లంకెలు

[మార్చు]