Jump to content

ద్వారం మల్లికార్జున్ రెడ్డి

వికీపీడియా నుండి
ద్వారం మల్లికార్జున్ రెడ్డి

పదవీ కాలం
2014 – 2019
ముందు ఆశిష్ జైస్వాల్
తరువాత ఆశిష్ జైస్వాల్
నియోజకవర్గం రాంటెక్

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
వృత్తి రాజకీయ నాయకుడు

ద్వారం మల్లికార్జున్ రెడ్డి మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో రాంటెక్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

ద్వారం మల్లికార్జున్ రెడ్డి రాజకీయాల పట్ల ఆసక్తితో 2009 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో నాగపూర్ ఈస్ట్ శాసనసభ నియోజకవర్గం నుండి గోండ్వానా గణతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి మూడో స్థానంలో నిలిచాడు.ఆయన మహారాష్ట్రలో రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్టర్ గా స్థిరపడ్డాడు. 2014లో ప్రభుత్వ కాంట్రాక్టర్లు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించబడినందున నామినేషన్లు దాఖలు చేయడానికి ముందు తన సంస్థకు రాజీనామా చేశాడు.[1] ద్వారం మల్లికార్జున్ రెడ్డి ఆ తరువాత భారతీయ జనతా పార్టీలో చేరి 2014 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్ది శివసేన అభ్యర్థి ఆశిష్ జైస్వాల్‌పై ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2]

ద్వారం మల్లికార్జున్ రెడ్డి 2019 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్ది శివసేన అభ్యర్థి స్వతంత్ర అభ్యర్థి ఆశిష్ జైస్వాల్‌ చేతిలో 24,413 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. The Times of India (1 October 2014). "Jolt to BJP as Saoner candidate disqualified". Archived from the original on 7 December 2024. Retrieved 7 December 2024.
  2. India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
  3. The Times of India (23 November 2024). "Ramtek Constituency Election Results 2024: Ramtek Assembly Seat Details, MLA Candidates & Winner" (in ఇంగ్లీష్). Archived from the original on 7 December 2024. Retrieved 7 December 2024.