ద్విసభ్య నియోజకవర్గం
ఇద్దరేసి సభ్యులు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాలను ద్విసభ్య నియోజకవర్గాలు అంటారు. ఈ నియోజకవర్గాలు పార్లమెంటుకే కాక, వివిధ రాష్ట్ర శాసనసభలకూ ఉండేవి. బ్రిటిషు వారి కాలంలో ప్రవేశపెట్టిన ఈ వ్యవస్థ స్వాతంత్ర్యం తరువాత కూడా కొనసాగింది. ఈ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యే ఇద్దరు అభ్యర్థుల్లో ఒకరు జనరల్ వర్గానికి చెందినవారు కాగా, రెండవవారు ఎస్సీ-ఎస్టీ వర్గానికి చెందినవారు.
1957లో వి.వి.గిరి పార్వతీపురం ద్విసభ్య నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయాడు. ప్రత్యర్థి కంటే అతనికి వోట్లు ఎక్కువ వచ్చినా అతను ఓడిపోయాడు. ఎందుకంటే అప్పుడు పోటీ చేసిన రిజర్వుడు అభ్యర్థులిద్దరికీ అతని కంటే ఎక్కువ వోట్లు వచ్చాయి. వివి గిరి దీనిపై కోర్టుకు వెళ్ళినప్పటికీ ఫలితం లేకపోయింది. దానితో కాంగ్రెసు పార్టీ పూనుకుని, 1961లో ఈ ద్విసభ్య వ్యవస్థను రద్దు చేసింది.[1] కొన్ని నియోజకవర్గాలను అచ్చంగా రిజర్వుడు వర్గాలకే కేటాయించింది.[2]
చట్టసభల్లో స్త్రీలకు రిజర్వేషను ఉండాలనే ప్రతిపాదన నెగ్గకపోవడంతో భారతీయ స్త్రీ శక్తి అనే సంస్థ 2009లో, ద్విసభ్య నియోజకవర్గాలను తిరిగి సృష్టించాలని ప్రతిపాదన చేసింది. లోక్‌సభ, శసనసభల్లోని అన్ని నియోజకవర్గాలనూ ద్విసభ్య నియోజకవర్గాలుగా చేసి, ప్రతి నియోజకవర్గం నుండి ఒక మహిళను ఎన్నుకునేలా రాజ్యాంగ సవరన చెయ్యాలని డిమాండు చేసింది. అయితే ఇది అమలు కాలేదు.[3]
తొలి లోక్‌సభ ఎన్నికలు (1951)
[మార్చు]1951 -52లో స్వతంత్ర భారతదేశ లోక్‌సభకు తొలి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో హైదరాబాదు రాష్ట్రంలో 21 నియోజక వర్గాలుండేవి. వాటిలో 4 ద్విసభ్య నియోజకవర్గాలు. అవి: మహబూబ్ నగర్, కరీం నగర్, నల్గొండ, నాందేడ్ (ప్రస్తుతం మహారాష్ట్రలో ఉంది).[4] అప్పట్లో మద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉన్న ఆంధ్ర ప్రాంతంలో మొత్తం 23 నియోజకవర్గాలుండగా వాటిలో 5 ద్విసభ్య నియోజకవర్గాలు. అవి: విశాఖపట్నం, రాజమండ్రి, ఏలూరు, ఒంగోలు, చిత్తూరు.
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో, ద్విసభ్య నియోజకవర్గాలతో వివిధ నియోజకవర్గాల సంఖ్యలు కింది పట్టికలో చూడవచ్చు.[5]
క్ర.సం | రాష్ట్రం/కేం.పా.పా | మొత్తం పార్లమెంటు
నియోజక వర్గాలు |
జనరల్ | ఎస్.సి | ఎస్.టి | మొత్తం సీట్లు | ||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
ఏక సభ్య | ద్విసభ్య | మొత్తం | ఏక సభ్య | ద్విసభ్య | మొత్తం | ఏక సభ్య | ద్విసభ్య | మొత్తం | మొత్తం సీట్లు | |||
1 | అసోం | 10 | 8 | 2 | 10 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 12 |
2 | బీహార్ | 44 | 31 | 11 | 42 | 0 | 0 | 0 | 2 | 0 | 2 | 55 |
3 | బాంబే | 37 | 29 | 8 | 37 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 45 |
4 | మధ్య ప్రదేశ్ | 23 | 16 | 6 | 22 | 0 | 0 | 0 | 1 | 0 | 1 | 29 |
5 | మద్రాసు | 62 | 49 | 13 | 62 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 75 |
6 | ఒరిస్సా | 16 | 9 | 4 | 13 | 0 | 0 | 0 | 3 | 0 | 3 | 20 |
7 | పంజాబు | 15 | 12 | 3 | 15 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 18 |
8 | ఉత్తర ప్రదేశ్ | 69 | 52 | 17 | 69 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 86 |
9 | పశ్చిమ బెంగాల్ | 25 | 19 | 6 | 25 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 34 |
10 | హైదరాబాద్ | 21 | 17 | 4 | 21 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 25 |
11 | మధ్య భారత్ | 9 | 6 | 2 | 8 | 0 | 0 | 0 | 1 | 0 | 1 | 11 |
12 | మైసూరు | 9 | 7 | 2 | 9 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 11 |
13 | పటియాలా అండ్ ఈస్ట్ పంజాబ్
స్టేట్స్ యూనియన్ |
4 | 3 | 1 | 4 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 5 |
14 | రాజస్థాన్ | 18 | 15 | 2 | 17 | 0 | 0 | 0 | 1 | 0 | 1 | 20 |
15 | సౌరాష్ట్ర | 6 | 6 | 0 | 6 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 6 |
16 | తిరువాన్కూరు కొచ్చిన్ | 11 | 10 | 1 | 11 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 12 |
17 | అజ్మీర్ | 2 | 2 | 0 | 2 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 2 |
18 | భోపాల్ | 2 | 2 | 0 | 2 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 2 |
19 | బిలాస్‌పూర్ | 1 | 1 | 0 | 1 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 1 |
20 | కూర్గ్ | 1 | 1 | 0 | 1 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 1 |
21 | ఢిల్లీ | 3 | 2 | 1 | 3 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 4 |
22 | హిమాచల్ ప్రదేశ్ | 2 | 1 | 1 | 2 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 3 |
23 | కచ్ | 2 | 2 | 0 | 2 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 2 |
24 | మణిపూర్ | 2 | 2 | 0 | 2 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 2 |
25 | త్రిపుర | 2 | 2 | 0 | 2 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 2 |
26 | వింధ్య ప్రదేశ్ | 4 | 2 | 2 | 4 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 6 |
మొత్తం | 306 | 86 | 392 | 0 | 0 | 0 | 8 | 0 | 8 | 400 | 489 |
రెండవ లోక్‌సభ ఎన్నికలు (1957)
[మార్చు]1957 లో జరిగిన రెండవ లోక్‌సభ ఎన్నికల నాటికి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరిగింది. 1956 లో ఆంధ్రరాష్ట్రం, హైదరాబాదు రాష్ట్రం లోని తెలుగు మాట్లాడే తెలంగాణ ప్రాంతాలన్నిటినీ కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పరచారు. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 35 పార్లమెంటు నియోజకవర్గాలుండగా వాటిలో 8 ద్విసభ్య నియోజకవర్గాలు. అవి: పార్వతీపురం, గోలుగొండ, కాకినాడ, నెల్లూరు, చిత్తూరు, మహబూబ్ నగర్, కరీంనగర్, నల్గొండ.[6]
వివిధ రాష్ట్రాల్లోని నియోజకవర్గాల జాబితా ఇది.[7]
క్ర.సం | రాష్ట్రం/కేం.పా.పా | మొత్తం పార్లమెంటు
నియోజక వర్గాలు |
జనరల్ | ఎస్.సి | ఎస్.టి | మొత్తం సీట్లు | ||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
ఏక సభ్య | ద్విసభ్య | మొత్తం | ఏక సభ్య | ద్విసభ్య | మొత్తం | ఏక సభ్య | ద్విసభ్య | మొత్తం | మొత్తం సీట్లు | |||
1 | ఆంధ్రప్రదేశ్ | 35 | 27 | 8 | 35 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 43 |
2 | అస్సాం | 10 | 7 | 2 | 9 | 0 | 0 | 0 | 1 | 0 | 1 | 12 |
3 | బీహార్ | 45 | 33 | 8 | 41 | 0 | 0 | 0 | 4 | 0 | 4 | 53 |
4 | బాంబే | 58 | 46 | 8 | 54 | 0 | 0 | 0 | 4 | 0 | 4 | 66 |
5 | కేరళ | 16 | 14 | 2 | 16 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 18 |
6 | మధ్య ప్రదేశ్ | 27 | 15 | 9 | 24 | 0 | 0 | 0 | 3 | 0 | 3 | 36 |
7 | మద్రాసు | 34 | 27 | 7 | 34 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 41 |
8 | మైసూరు | 23 | 20 | 3 | 23 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 26 |
9 | ఒరిస్సా | 14 | 6 | 6 | 12 | 0 | 0 | 0 | 2 | 0 | 2 | 20 |
10 | పంజాబ్ | 17 | 12 | 5 | 17 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 22 |
11 | రాజస్థాన్ | 18 | 13 | 4 | 17 | 0 | 0 | 0 | 1 | 0 | 1 | 22 |
12 | ఉత్తర ప్రదేశ్ | 68 | 50 | 18 | 68 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 86 |
13 | పశ్చిమ బెంగాల్ | 28 | 20 | 8 | 28 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 36 |
14 | ఢిల్లీ | 4 | 3 | 1 | 4 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 5 |
15 | హిమాచల్ ప్రదేశ్ | 3 | 2 | 1 | 3 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 4 |
16 | మణిపూర్ | 2 | 1 | 0 | 1 | 0 | 0 | 0 | 1 | 0 | 1 | 2 |
17 | b | 1 | 0 | 1 | 1 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 2 |
మొత్తం | 296 | 91 | 387 | 0 | 0 | 0 | 16 | 0 | 16 | 403 | 494 |
1952లో మద్రాసు రాష్ట్ర శాసనసభలో ఆంధ్ర ప్రాంతపు ద్విసభ్య నియోజకవర్గాలు
[మార్చు]1952 లో మద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉన్న ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు ఎన్నికలు జరిగాయి. అప్పుడు మొత్తం నియోజకవర్గాలు 118 కాగా (ఈ సంఖ్యలో తిరుత్తణిని చేర్చలేదు. తిరుత్తణి మద్రాసు రాష్ట్రంలోని తమిళ ప్రాంతంగా పరిగణించబడింది. కానీ 1955లో ఆంధ్ర రాష్ట్రంలో భాగమైంది) వాటిలో 21 ద్విసభ్య నియోజకవర్గాలు.[8] వాటి వివరాలను కింది పట్టికలో చూడవచ్చు.[9]
క్ర.సం | నియోజకవర్గం | ద్విసభ |
1 | సాలూరు | |
2 | చీపురుపల్లి | ద్వి |
3 | బొబ్బిలి | |
4 | పార్వతీపురం | |
5 | శ్రీకాకుళం | ద్వి |
6 | హొంజరం | |
7 | పాలకొండ | |
8 | నరసన్నపేట | |
9 | పాతపట్నం | ద్వి |
10 | టెక్కలి | |
11 | సోంపేట | |
12 | ఇచ్ఛాపురం | |
13 | విజయనగరం | ద్వి |
14 | భీమునిపట్నం | |
15 | ఆలమండ | |
16 | శృంగవరపుకోట | |
17 | చోడవరం | |
18 | మాడుగుల | |
19 | విశాఖపట్నం | |
20 | పరవాడ | |
21 | అనకాపల్లి | |
22 | యలమంచిలి | |
23 | పాయకరవుపేట | |
24 | గొలుగొండ | ద్వి |
25 | భద్రాచలం | ద్వి |
26 | తుని | |
27 | పిఠాపురం | |
28 | పెద్దాపురం | |
29 | బూరుగుపూడి | |
30 | రాజమండ్రి | |
31 | కాకినాడ | ద్వి |
32 | రామచంద్రాపురం | |
33 | అనపర్తి | |
34 | పామర్రు | |
35 | అమలాపురం | ద్వి |
36 | రాజోలు | ద్వి |
37 | చింతలపూడి | |
38 | ఏలూరు | |
39 | తాడేపల్లిగూడెం | |
40 | అలంపురం | |
41 | ఉండి | |
42 | భీమవరం | |
43 | నర్సాపురం | ద్వి |
44 | పాలకొల్లు | |
45 | తణుకు | |
46 | పెనుగొండ | |
47 | కొవ్వూరు | ద్వి |
48 | జగ్గయపేట | |
49 | విజయవాడ | |
50 | కంచికచర్ల | |
51 | తిరువూరు | |
52 | కంకిపాడు | |
53 | నూజివీడు | |
54 | గుడివాడ | ద్వి |
55 | కైకలూరు | |
56 | దివి | ద్వి |
57 | బందరు | |
58 | వినుకొండ | |
59 | పల్నాడు | |
60 | బెల్లంకొండ | |
61 | నరసరావుపేట | |
62 | చిలకలూరిపేట | |
63 | సత్తెనపల్లి | |
64 | మంగళగిరి | |
65 | గుంటూరు | |
66 | ప్రత్తిపాడు | |
67 | దుగ్గిరాల | |
68 | తెనాలి | |
69 | అమర్తలూరు | |
70 | రేపల్లె | |
71 | బాపట్ల | |
72 | పొన్నూరు | |
73 | చీరాల | |
74 | ఒంగోలు | ద్వి |
75 | గూడూరు | |
76 | వెంకటగిరి | |
77 | రాపూరు | |
78 | నెల్లూరు | ద్వి |
79 | కోవూరు | |
80 | అత్మకూరు | |
81 | కావలి | |
82 | ఉదయగిరి | |
83 | కనిగిరి | |
84 | కందుకూరు | ద్వి |
85 | దర్శి | |
86 | మార్కాపురం | |
87 | కంభం | |
88 | నంద్యాల | |
89 | కోయిలకుంట్ల | |
90 | డోన్ | |
91 | నందికొట్కూరు | |
92 | కర్నూలు | ద్వి |
93 | రాజంపేట | ద్వి |
94 | రాయచోటి | |
95 | కడప | |
96 | బద్వేలు | |
97 | ప్రొద్దటూరు | |
98 | కమలాపురం | |
99 | జమ్మలమడుగు | |
100 | పెనుకొండ | |
101 | హిందూపురం | |
102 | మడకశిర | |
103 | కదిరి | |
104 | ధర్మవరం | |
105 | కళ్యాణదుర్గం | ద్వి |
106 | తాడిపత్రి | |
107 | అనంతపురం | |
108 | ఆదోని | ద్వి |
109 | రాయదుర్గం | |
110 | చట్టు | |
111 | మదనపల్లె | |
112 | పుంగనూరు | |
113 | పీలేరు | |
114 | పలమనేరు | |
115 | చిత్తూరు | ద్వి |
116 | పుత్తూరు | |
117 | కాళహస్తి | |
118 | చంద్రగిరి |
1955లో ఆంధ్రరాష్ట్ర శాసనసభ లోని ద్విసభ్య నియోజకవర్గాలు
[మార్చు]1955 ఎన్నికల నాటికి ఆంధ్రరాష్ట్ర శాసనసభలో మొత్తం 167 నియోజకవర్గాలుండేవి. వాటిలో 29 ద్విసభ్య నియోజకవర్గాలు. అంటే మొత్తం 196 మంది శాసనసభ్యులు ఎన్నికయ్యేవారు. ద్విసభ్య నియోజకవర్గాల జాబితా ఇది. అప్పట్లో రాష్ట్రంలో 11 జిల్లాలే ఉండేవి.
క్ర.సం | జిల్లా | నియోజకవర్గం |
---|---|---|
1 | శ్రీకాకుళం జిల్లా | పాతపట్నం, సాలూరు, చీపురుపల్లి |
2 | విశాఖ జిల్లా | నర్సీపట్నం, గజపతినగరం, శృంగవరపుకోట |
3 | తూర్పు గోదావరి జిల్లా | పల్లిపాలెం, భద్రాచలం, బూరుగుపూడి, అమలాపురం, రాజోలు |
4 | పశ్చిమ గోదావరి జిల్లా | కొవ్వూరు, పాలకొల్లు, తాడేపల్లిగూడెం |
5 | కృష్ణా జిల్లా | గుడివాడ, దివి |
6 | ప్రకాశం జిల్లా | ఒంగోలు |
7 | నెల్లూరు జిల్లా | బుచ్చిరెడ్డిపాలెం, గూడూరు, వెంకటగిరి |
8 | కడప జిల్లా, | రాజంపేట |
9 | కర్నూలు జిల్లా | ఎమ్మిగనూరు, నందికొట్కూరు |
10 | అనంతపురం జిల్లా | హిందూపురం, ధర్మవరం, గుత్తి |
11 | చిత్తూరు జిల్లా | పుంగనూరు, శ్రీకాళహస్తి, తిరుత్తణి |
1952 లో మద్రాసు శాసనసభకు జరిగిన ఎన్నికలలో ఆంధ్ర ప్రాంతంలో 118 నియోజకవర్గాలుండేవి. వాటిలో 22 ద్విసభ్య నియోజకవర్గాలు. అంటే మొత్తం 140 మంది సభ్యులు ఎన్నికయ్యారు. 1953 లో మద్రాసు నుండి విడివడి ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం ఏర్పడినపుడు ఈ 118 నియోజకవర్గాల నుండి ఎన్నికైన 140 మంది సభ్యులే కొత్త రాష్ట్ర శాసనసభలో ప్రాతినిధ్యం వహించారు.[10]
1952లో హైదరాబాదు రాష్ట్ర శాసనసభ ఎన్నికలు
[మార్చు]1948 లో పోలీసుచర్య తరువాత హైదరాబాదు రాజ్యం, హైదరాబాదు రాష్ట్రంగా మారి భారతదేశంలో విలీనమై పోయింది. 1952 లో హైదరాబాదు రాష్ట్ర శాసనసభకు తొలి ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో మొత్తం 142 శాసనసభ నియోజకవర్గాలు ఉండగా వాటిలో 33 ద్విసభ్య స్థానాలు. మొత్తం 175 మంది సభ్యులు శాసనసభకు ఎన్నికయ్యారు. జిల్లా వారీగా ద్విసభ్య స్థానాల జాబితాను కింది పట్టికలో చూడవచ్చు[11]
క్ర.సం. | జిల్లా | మొత్తం
నియోజకవర్గాలు |
ద్విసభ్య నియోజకవర్గాలు |
---|---|---|---|
1 | హైదరాబాదు | 14 | సికిందరాబాద్, ఇబ్రహీంపట్నం |
2 | మహబూబ్ నగర్ | 11 | కల్వకుర్తి, నాగర్‌కర్నూలు, మక్తల్-ఆత్మకూరు |
3 | రాయిచూరు | 11 | ఆలంపూరు-గద్వాల |
4 | గుల్బర్గా | 14 | కోడంగల్, యాద్గిర్ |
5 | బీదర్ | 11 | హుమ్నాబాద్, ఉద్గిర్ |
6 | ఉస్మానాబాద్ | 7 | ఉస్మానాబాద్ |
7 | భీర్ | 8 | మోమినాబాద్ |
8 | ఔరంగాబాద్ | 11 | భోకర్దాన్, పైఠాన్-గంగాపూర్ |
9 | పర్భని | 9 | హింగోలి, బస్మఠ్ |
10 | నాందేడ్ | 9 | డేగ్లూర్, కాంధార్ |
11 | ఆదిలాబాదు | 9 | నిర్మల్, ఆసిఫాబాద్, లక్సెట్టిపేట్ |
12 | నిజామాబాదు | 8 | |
13 | మెదక్ | 10 | వికారాబాద్, ఆందోల్ |
14 | కరీంనగర్ | 15 | హుజూరాబాద్, సిరిసిల్ల, జగిత్యాల |
15 | వరంగల్ | 14 | మహబూబాబాద్, ఇల్లందు, ఖమ్మం |
16 | నల్గొండ | 14 | నల్గొండ, హుజూర్‌నగర్, సూర్యాపేట |
మొత్తం | 175 |
ఇతర రాష్ట్రాల్లో
[మార్చు]వివిధ రాష్ట్రాల శాసన సభల్లో ద్విసభ్య నియోజకవర్గాలు కింది విధంగా ఉండేవి. ఇవన్నీ కూడా 1961 నాటి చట్టంతో రద్దైపోయాయి.
మైసూరు రాష్ట్ర శాసనసభకు 1951, 1957లో జరిగిన న్నికలలో ద్విసభ్య నియోజకవర్గాలు ఉండేవి. 1951లో ఈ నియోజకవర్గాల సంఖ్య 19. 1957 నాటికి ఈ సంఖ్య పెరిగి 29 అయింది.[12]
కేరళలో 1957 ఫిబ్రవరి-మార్చి లలో జరిగిన ఎన్నికలలో మొత్తం నియోజకవర్గాలు 114 కాగా, అందులో 12 ద్విసభ్య నియోజకవర్గాలు. 1960 ఎన్నికల నాటికి ఈ సంఖ్యలో మార్పేమీ లేదు.[13]
మూలాలు
[మార్చు]- ↑ "ఒక నియోజకవర్గం నుంచి ఇద్దరా?". EENADU. Archived from the original on 2022-01-30. Retrieved 2022-01-30.
- ↑ "Women's group in Chennai bats for dual-member system in general elections". The New Indian Express. Archived from the original on 2022-01-31. Retrieved 2022-01-31.
- ↑ "Women's groups suggest dual-member constituencies | Pune News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 2022-01-31. Retrieved 2022-01-31.
- ↑ "మొదటి ఎన్నికల్లో జవహర్‌లాల్ నెహ్రూను మించిన మెజార్టీ సాధించిన తెలుగు ఎంపీ". BBC News తెలుగు. Archived from the original on 2022-01-30. Retrieved 2022-01-30.
- ↑ "Statistical Report On General Elections, 1951 To The First Lok Sabha" (PDF). Election Commission of India. Archived from the original (pdf) on 4 April 2014. Retrieved 12 January 2010.
- ↑ "STATISTICAL REPORT ON GENERAL ELECTIONS, 1957 TO THE SECOND LOK SABHA" (PDF). ఎలెక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. Archived (PDF) from the original on 2012-01-11. Retrieved 2012-01-11.
- ↑ "Statistical Report on General Elections, 1957 to the Second Lok Sabha, (Vol. I)" (PDF). Election Commission of India. Archived from the original (PDF) on 20 March 2012. Retrieved 2014-05-27.
- ↑ "పాత అసెంబ్లీల ముచ్చట్లు!". ఆంధ్రజ్యోతి. Archived from the original on 2022-01-30. Retrieved 2022-01-30.
- ↑ "Statistical Report on General Election, 1951 : To the Legislative Assembly of Madras" (PDF). Election Commission of India. Archived from the original (PDF) on 27 January 2013. Retrieved 2014-10-14.
- ↑ "ఆర్కైవ్ నకలు". m.andhrajyothy.com. Archived from the original on 2022-01-30. Retrieved 2022-01-30.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ "Hyderabad Legislative Assembly". ECI. AP Legislature. Archived from the original on 4 ఆగస్టు 2013. Retrieved 30 జనవరి 2022.
- ↑ "Days of double-member segments". The Hindu (in Indian English). 2018-04-21. ISSN 0971-751X. Archived from the original on 2021-08-06. Retrieved 2022-01-30.
- ↑ "Kerala elections | When a constituency returned 2 members". The Hindu (in Indian English). Special Correspondent. 2021-03-11. ISSN 0971-751X. Archived from the original on 2021-11-27. Retrieved 2022-01-31.
{{cite news}}
: CS1 maint: others (link)