ద‌ర్శ గుప్తా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ద‌ర్శ గుప్తా
2021లో ద‌ర్శ గుప్తా
జననం
ద‌ర్శ గుప్తా

చెన్నై, తమిళనాడు, భారతదేశం
జాతీయతఇండియన్
ఇతర పేర్లుధర్షు[1]
వృత్తి
  • నటి
  • మోడల్
క్రియాశీల సంవత్సరాలు2017 – ప్రస్తుతం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
కుకు విత్ కోమాలి (సీజన్ 2)
రుద్ర తాండవం (2021)
ఓహ్ మై గోస్ట్

దర్శ గుప్తా భారతీయ నటి. ఆమె ప్రధానంగా తమిళ చలనచిత్రాలు, టెలివిజన్ షోలలో నటిస్తుంది. స్టార్ విజయ్ ఛానెల్‌లో ప్రసారమైన కామెడీ రియాలిటీ టీవీ షో కుకు విత్ కోమాలి (సీజన్ 2)లో ఆమె నటనకు ప్రసిద్ధిచెందింది.[2] అంతేకాకుండా రుద్ర తాండవం, ఓ మై గోస్ట్, మెడికల్ మిరాకిల్ సినిమాలతో ఆమె బాగా పేరు తెచ్చుకుంది.[3]

రిచర్డ్ రిషి కథానాయకుడుగా మోహన్ జి దర్శకత్వంవహించిన తమిళ చిత్రం రుద్ర తాండవం (2021)తో ఆమె అరంగేట్రం చేసింది. 2022లో నటి సన్నీలియోన్ నటించిన ఓహ్ మై ఘోస్ట్ చిత్రంలో కూడా ఆమె నటించింది.[4]

కెరీర్[మార్చు]

జీ తమిళ్‌లో ప్రసారమైన తమిళ టెలివిజన్ సీరియల్ ముల్లుమ్ మలరంలో ఆమె తొలిసారిగా నటించింది. ఆమె రంజిత్‌తో పాటు స్టార్ విజయ్‌లో సెంథూర పూవేలో కూడా కీలక పాత్ర పోషించింది.[5] 2020లో, ఆమె కుకు విత్ కోమాలి (సీజన్ 2) అనే కామెడీ రియాలిటీ షోలో మెరిసింది.[6]

2021 సంవత్సరంలో, మోహన్ జి. తన దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం రుద్ర తాండవంలో ఆమె వారాహి పాత్రలో కథానాయికగా నటించింది. ఇది తన తొలి చిత్రం.[7][8][9] ఆమె FAB AWARD ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఆ సంవత్సరపు ఉత్తమ తొలి నటిగా గెలుపొందింది.[10] ఆమె తర్వాత మెడికల్ మిరాకిల్ అనే మరో భారీ చిత్రంలో నటించింది. సన్నీ లియోన్ ప్రధాన పాత్రలో అభిషేక్ కపూర్ దర్శకత్వంలో వచ్చిన తమిళ చిత్రం ఓహ్ మై ఘోస్ట్‌లో ఆమె కూడా నటించింది.[11]

భారతదేశంలో కోవిడ్-19 లాక్-డౌన్ సమయంలో. ఆమె 20000 మందికి పైగా ఆశ్రయం, ప్రాథమిక వైద్య అవసరాలను అందించింది. సమాజానికి చేసిన తన సేవకుగాను హార్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకుంది.[12][13]

మూలాలు[మార్చు]

  1. "Pugazh wishes Darsha by calling new nickname". www.indiaglitz.com.
  2. "Dharsha Gupta clocks 2.1M followers on Instagram; celebrates with fans". The Times of India.
  3. "From Dharsha Gupta to Akshara Reddy: Fit and fab Tamil TV actresses who can inspire you to hit the gym". The Times of India.
  4. "#Rewind2020: Dharsha Gupta to Losliya Mariyanesan, Tamil TV celebs who announced their debut on the silver screen this year". The Times of India.
  5. "Here's how Dharsha Gupta is helping the needy during lockdown". The Times of India.
  6. "Dharsha Gupta to Ashwin Kumar Lakshmikanthan: Celebs who are basking in the success of Cooku with Comalis 2". The Times of India.
  7. "Dharsha Gupta completes dubbing for her debut film 'Rudrathandavam'". The Times of India.
  8. "Dharsha Gupta to debut as heroine in Draupathi director's next movie 'Rudhra Thandavam'". thenewscrunch.com.
  9. "Rudra Thandavam movie starring 'Cook with Comali' fame Dharsha Gupta to release soon". thenewscrunch.com.
  10. "Dharsha Gupta Winning the Best Debutante Actress Of The Year - FAB AWARDS". YouTube.
  11. "Teaser of Sunny Leone and Sathish's Oh My Ghost out". Cinema Express.
  12. "Dharsha Gupta's timely help to the poor people affected by COVID 19 lockdown wins hearts". www.indiaglitz.com.
  13. "actress Dharsha Gupta celebrates special milestone with fans". www.indiaglitz.com.