Jump to content

ధనరే పాస్కల్

వికీపీడియా నుండి
ధనరే పాస్కల్ జన్యా
ధనరే పాస్కల్


పదవీ కాలం
2014 – 2019 అక్టోబర్ 24
ముందు రాజారామ్ ఓజారే
తరువాత వినోద్ భివా నికోల్
నియోజకవర్గం దహను

వ్యక్తిగత వివరాలు

జననం 1971/1972
మరణం (aged 49)
వాపి, గుజరాత్
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
వృత్తి రాజకీయ నాయకుడు

ధనరే పాస్కల్ జన్యా మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014 మహారాష్ట్ర ఎన్నికలలో దహను శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. దహను నుంచి ఎన్నికైన తొలి బీజేపీ ఎమ్మెల్యే ఆయనే.

రాజకీయ జీవితం

[మార్చు]

ధనరే పాస్కల్ జన్యా భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2014 శాసనసభ ఎన్నికలలో దహను శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి సీపీఎం అభ్యర్థి బార్క్యా మంగత్ పై 16,700 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1] ఆయన 2019 శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి సీపీఎం అభ్యర్థి వినోద్ భివా నికోల్ పై 4,707 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.

మరణం

[మార్చు]

ధనరే పాస్కల్ జన్యాకు కరోనా సోకి ఆ తర్వాత ఆరోగ్యం క్షిణించడంతో గుజరాత్ రాష్ట్రంలోని, వాపిలోని రెయిన్‌బో ఆస్పత్రికి తరలించగా చికిత్స తీసుకొని అనంతరం ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2021 ఏప్రిల్ 12న మరణించాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.[2][3][4][5]

మూలాలు

[మార్చు]
  1. India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
  2. Sakshi (12 April 2021). "కరోనాతో మాజీ ఎమ్మెల్యే కన్నుమూత". Archived from the original on 15 December 2024. Retrieved 15 December 2024.
  3. The Hindu (12 April 2021). "Former Maharashtra BJP MLA Pascal Dhanare passes away" (in Indian English). Archived from the original on 15 December 2024. Retrieved 15 December 2024.
  4. India Today (12 April 2021). "Former Maharashtra BJP MLA Paskal Dhanare dies of Covid-19" (in ఇంగ్లీష్). Archived from the original on 15 December 2024. Retrieved 15 December 2024.
  5. The Times of India (12 April 2021). "Maharashtra: Former BJP MLA Paskal Dhanare dies of Covid-19". Archived from the original on 15 December 2024. Retrieved 15 December 2024.