ధనుంజయ గోత్రం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పరిచయము[మార్చు]

ధనుంజయ గోత్రము అనగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రాజుల ( ఆంధ్ర క్షత్రియులు ) కులంలో నాలుగు గోత్రములలో ఒకటి. ఇతర గోత్రములు ఏవనగా - కౌండిన్య, వశిష్ట, కాస్యప. ఈ గోత్రం ఆర్య క్షత్రియులు, కర్ణాటక రాజులకు, రాజాపూర్ సరస్వతి బ్రాహ్మణులకు, కన్యకుబ్జ బ్రాహ్మణులకు, గౌడ సరస్వతి బ్రాహ్మణులకు కూడా చెందుతుంది. వేలాది సంవత్సరాలుగా ధనుంజయ గోత్రానికి కౌండిన్య, వశిష్ట, కాస్యప గోత్రాలతో వివాహ సంబంధాలు ఉన్నాయి.

చరిత్ర[మార్చు]

సుప్రసిద్ధ కామకోటి పీటం వారి ప్రకారము ధనుంజయ గోత్రానికి ఋషి ప్రవ్రర ఏమనగా :

  • 1. శ్రీమద్వైశ్వామిత్ర మధుచ్చందో ధనుంజయ త్రయార్షేయ ప్రవరాన్విత ధనుంజయ గోత్ర:
  • 2. శ్రీమదఘమర్షణ మధుచ్చందో ధనుంజయ త్రయార్షేయ ప్రవరాన్విత ధనుంజయ గోత్ర:
  • 3. శ్రీమదాత్రేయ అత్యనానస ధనుంజయ త్రయార్షేయ ప్రవరాన్విత ధనుంజయ గోత్ర:

బ్రహ్మర్షి విశ్వామిత్రుడి తండ్రి యైన గాది చంద్రవంశానికి చెందిన రాజు. కనుక ధనుంజయ గోత్రము చంద్రవంశానికి చెందినదని తెలుస్తున్నది. ఈ గోత్రపు రాజ ప్రవర: భరత్ పరీక్షిత్ విష్ణువర్ధన ప్రవరాన్విత కోట హరిసీమ కృష్ణ మహారాజ వంశ'

ఆంధ్ర దేశములో ధరణి కోటను రాజధానిగా చేసుకుని 400 సంవత్సరాల పాటూ గుంటూరు జిల్లాను పాలించిన ధరణికోట రాజులు ధనుంజయ గోత్రీకులు [1][2] నేడు కోస్తా జిల్లాలలో కనిపించే ఆంధ్ర క్షత్రియులలో ధనుంజయ గోత్రము వారు ధరణికోట రాజుల వంశస్థులు.

గృహనామాలు[మార్చు]

1. అడ్డాల; 2. ఈపూరి (వీపూరి) ; 3. ఉద్దరాజు; 4. ఉయ్యూరి; 5. ఏటికూరి (వేటికూరి) ; 6. కంకిపాటి; 7. కంతేటి; 8. కమ్మెల (కమ్మెళ్ళ) ; 9. కళ్ళేపల్లి; 10. కాశి; 11. కూనపరాజు; 12. కూసంపూడి (కూచంపూడి) ; 13. కొండూరి; 14. కొక్కెర్లపాటి; 15. కొత్తపల్లి; 16. కొప్పెర్ల; 17. కొలనువాడ 18. కొల్నాటి (కొల్లాటి) ; 19. కొవ్వూరి; 20. గండ్రాజు; 21. గాదిరాజు; 22. గుంటూరి; 23. గూడూరి; 24. గొట్టుముక్కల (గొట్టెముక్కల, గొట్టుముక్కుల) ; 25. గోకరాజు; 26. చంపాటి (చెంపాటి) ; 27. చింతలపాటి; 28. చెరుకూరి; 29. చేకూరి; 30. కోటజంపన 31. జుజ్జూరి; 32. తిరుమలరాజు; 33. తోటకూర (తోటకూరి) ; 34. దండు; 35. దంతులూరి; 36. దాట్ల ; 37. నల్లపరాజు; 38. నున్న; 39. పచ్చమట్ల (పట్సమట్ల) ; 40. పాకలపాటి; 41. పూసంపూడి; 42. పెన్మెత్స (పెనుమత్స) ; 43. భూపతిరాజు; 44. బైర్రాజు; 45. మద్దాల; 46. ముదుండి; 47. రుద్రరాజు; 48. వడ్లమూడి; 49. వానపాల; 50. వేగిరాజు; 51. సాగిరాజు 52.సాకిరాజు 53.వరదరాజు

కర్ణాటక రాజుల్లో ధనుంజయ గోత్రపు గృహనామాలు:

గుంటుమడుగు, చెలమగుంట, కాశి, వడ్లమూడి, వానపాల, నందిమండలం, అరవీటి, రాచకొండ, పాండురాజు,

మూలాలు[మార్చు]

  1. The History of Andhra Country 1000 A.D-1500 A.D by Yashoda Devi, Gyan Publishing House, ISBN 8121204380.
  2. Studies in South Indian Jainism, Part II, Andhra karnataka Jainism. Author(s): B.Seshagiri Rao, Ayyangar

ఇంకా చదవండి[మార్చు]

లింకులు[మార్చు]